Salaar: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన “సలార్ పార్ట్ 1- సీజ్ ఫైర్” డిసెంబర్ 22వ తారీకు విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. దీంతో విడుదలకు ఇంకా వారం రోజులు మాత్రమే ఉండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ కావడం జరిగాయి. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. దీంతో దేశవ్యాప్తంగా సలార్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ మొదటి తారీకు ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ విడుదల చేయడం జరిగింది. “సలార్” మొదటి భాగం ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. యూట్యూబ్ లో అనేక రికార్డులు బ్రేక్ చేయడం జరిగింది.
మూడు నిమిషాల కంటే అధికంగా ఉన్న ఈ ట్రైలర్ లో సినిమా స్టోరీతో పాటు ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో చెప్పేయడం జరిగింది. స్నేహితుడి కోసం ఎంతటి పోరాటానికైనా దిగి పాత్రలో ప్రభాస్ నటిస్తున్నాడు. ప్రభాస్ స్నేహితుడిగా మలయాళ నటుడు పృథ్వీరాజ్.. సుకుమారన్ నటించిన జరిగింది. ఇదిలా ఉంటే తాజాగా “సలార్” నుంచి ఫస్ట్ సింగిల్ మేకర్స్ విడుదల చేశారు. “సూర్యుడే గొడుగు పట్టి” అంటూ సాగే ఈ సాంగ్ లో ప్రభాస్ మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ మధ్య.. స్నేహాన్ని చూపిస్తూ.. చిత్రీకరించడం జరిగింది. సాంగ్ చాలా ఎమోషనల్ గా ఆకట్టుకుంటూ ఉంది. “కేజిఎఫ్” లో తల్లి సెంటిమెంట్ నేపథ్యంలో వచ్చే సాంగ్ తరహాలో.. ఈ సాంగ్ ఉంది.
ఇంకా విడుదలకు వారం రోజులు మాత్రమే ఉండటంతో ఈ సినిమా నుండి మరో ట్రైలర్ విడుదల కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొదటి ట్రైలర్ లో ప్రభాస్ కేవలం చివరి నిమిషంలో మాత్రమే ఉండటంతో.. అభిమానులు కొద్దిగా నిరుత్సాహం చెందారు. అయితే ఇప్పుడు రెండో ట్రైలర్ లో ప్రభాస్ పూర్తిగా కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వరుస పరాజయాలలో ఉన్న ప్రభాస్ ఈ సినిమాతో విజయం సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు.