Salaar: ప్రభాస్ “సలార్” సినిమాకి మొదటి రోజు పాజిటివ్ టాక్ రావడం జరిగింది. దీంతో సినిమాకి భారీ ఎత్తున కలెక్షన్స్ వస్తూ ఉన్నాయి. డిసెంబర్ 22వ తారీకు శుక్రవారం మొదటి పార్ట్ విడుదలయ్యింది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కావటం జరిగింది. అయితే మొదటి రోజే హిట్ టాక్ కవచనం చేసుకోవడంతో ₹175 కోట్లకు పైగా కలెక్షన్ వచ్చినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ₹135 కోట్లు వసూలు అయ్యాయట. ఇక వీకెండ్ రావడంతో కలెక్షన్స్ మరింతగా పెరిగా అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ఇదే జోరు కొనసాగితే ప్రభాస్ కెరియర్ లో భారీ వసూలు సాధించిన సినిమాల “సలార్” నిలుస్తుంది అని ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం.
అంతే కాదు 2023వ సంవత్సరం ముగుస్తున్న సమయంలో మొదటి రోజు బిగ్గెస్ట్ రికార్డు స్థాయి ఓపెనింగ్స్… రాబట్టిన సినిమాగా సలార్ నిలిచింది. “సలార్” తర్వాత స్థానాలలో లియో, ఆదిపురుష్… సినిమాలు ₹140 కోట్ల గ్రాస్ తో అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న సినిమాలు గా ఉన్నాయి. “బాహుబలి” సినిమాతో 2018లో ప్రభాస్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాతే ఇప్పటి వరకు మరో హిట్టు పడలేదు. ఇలాంటి పరిస్థితులలో ఎప్పటినుండో ఫ్యాన్స్ ప్రభాస్ మళ్లీ హిట్ ట్రాక్ కాలని కోరుకుంటున్నారు. బాహుబలి తర్వాత మూడు సినిమాలు విడుదలయ్యాయి అన్నీ కూడా పరాజయమయ్యాయి. ఇటువంటి పరిస్థితులలో “KGF” సినిమాలతో దేశాన్ని దడదడలాడించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. “సలార్” సినిమా ప్రభాస్ తో చేయటం సంచలనం సృష్టించింది.
ప్రభాస్ నీ సరిగ్గా వెండి తెర మీద చూపించాడు. ప్రభాస్ కటౌట్ కి తగ్గ ఎలివేషన్స్..తో “సలార్” లో ప్రతి ఫ్రేమ్ అందరినీ ఆకట్టుకున్నాడు. సినిమా స్టోరీ కూడా బలంగా ఉండటంతో.. అన్నీ కలిసి వచ్చి ఊహించని రేంజ్ లో విజయం అందుకోవడం జరిగింది. ప్రభాస్ కి చాలా కాలం తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హిట్ పడటంతో ఫ్యాన్స్ దర్శకుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. సలార్ సినిమాలో చాలా అద్భుతంగా ప్రభాస్ ని చూపించారని చెప్పుకొస్తున్నారు. మొదటి భాగం రకరకాల ట్విస్టులతో సాగగా రెండో భాగం ఉందని క్లైమాక్స్ లో తెలియజేయడంతో.. “సలార్” సెకండ్ పార్ట్ పై ఇప్పుడు భారీ అంచనాలు ఏర్పడ్డాయి.