NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: ఆరోగ్య సురక్ష క్యాంప్ లపై సీరియస్ గా దృష్టి పెట్టాలి – సీఎం జగన్

CM YS Jagan:  జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్‌లపై సీరియస్‌‌గా దృష్టిపెట్టాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ పై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎస్ డాక్టర్ జవహర్ రెడ్డి, మంత్రి విడదల రజిని, ఇతర ఉన్నతాధికారుల హజరు అయ్యారు. ఈ సందర్భంలో జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 పై చర్చించారు.

ఆరోగ్య శ్రీ ఎలా వినియోగించుకోవాలనే దానిపై ముమ్మరంగా ప్రచారం చేయాలని అన్నారు సీఎం జగన్. ఆరోగ్ సేవలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలన్నారు. నిర్ణీత గడువులోగా ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా రూ.25 లక్షల వరకూ వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. నెట్‌ వర్క్‌ ఆస్పత్రులకు ఎలా వెళ్లాలన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలియాలని చెప్పారు. ప్రతి ఇంటిని జల్లెడ పట్టి క్యాంపుల ద్వారా అవసరమైన వారికి వైద్యసేవలు అందాలని ఆదేశించారు.

ప్రతి ఆరు నెలలకోసారి రికార్డులు అప్డేట్‌ చేయాలన్నారు. ప్రతి సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని డ్రైవ్‌ చేయాలని సూచించారు. నూతన మెడికల్‌ కాలేజీల్లో అవసరమైన పరికరాలు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.  జిల్లాల వారీగా జగనన్న ఆరోగ్య సురక్ష 2 స్టేటస్ ను అధికారులు వివరించారు. మొత్తం 1338 క్యాంపులు నిర్వహించగా, క్యాంప్ లలో స్పాట్ టెస్టింగ్ 98,210 మందికి నిర్వహించినట్లు, 4,27,910 మంది ఓపి ద్వారా వైద్య సేవలు పొందారని తెలిపారు.

అదే విదంగా జేఏఎన్ 1 కంటి వెలుగు కళ్ల అద్దాల స్టేటస్ రిపోర్టును వివరించారు. మొత్తం 5,76,493 మందికి కళ్ల అద్దాలు అవసరం కాగా, 67 శాతం పంపిణీ జరిగిందని, మిగిలిన కళ్లద్దాల పంపిణీ కూడా త్వరితగతిన పూర్తి చేయనున్నామని తెలిపారు.

JD Lakshmi Narayana: ప్రాంతీయ పార్టీలపై జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

Related posts

CM Revanth Reddy: పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీ పడేలా నూతన పాలసీలు :  సీఎం రేవంత్ రెడ్డి

sharma somaraju

AP Election 2024: కొత్తపేటలో ఓటర్లకు నగదు పంపిణీపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

sharma somaraju

వినియోగదారుల స్వచ్చంద సంస్థలు, సంఘాలకు ఏపీ సర్కార్ కీలక హెచ్చరిక .. ఆ పదాలను వాడటం చట్టవిరుద్దం

sharma somaraju

Singapore Airlines: సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానంలో భారీ కుదుపులు ..ఒకరి మృతి.. 30 మందికి గాయాలు

sharma somaraju

కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల మృతి.. ఏపీ హోంమంత్రి తానేటి వనిత సంతాపం

sharma somaraju

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

Breaking: అనంతలో ఎన్ఐఏ సోదాల కలకలం

sharma somaraju

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk