Hanuman: ఈ సంక్రాంతి పండుగకు విడుదల అయినా అన్ని సినిమాల్లో కంటే “హనుమాన్” ఘన విజయం సాధించింది. చిన్న సినిమా అయినా గాని పెద్ద సినిమాలకు పోటీగా బరిలోకి దిగి బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. మహేష్, నాగార్జున, వెంకటేష్ సినిమాల కంటే “హనుమాన్” సినిమా సూపర్ విజయం సాధించింది. నార్త్ ఇండియాలో అదేవిధంగా ఓవర్సీస్ లో కూడా సినిమాకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తూ ఉంది. దీంతో సినిమా విడుదలయ్యి వారం రోజులు గడవకముందే ₹100 కోట్ల మార్క్ అందుకోవటం జరిగింది. ఈ సినిమా చూసి సామాన్య ప్రేక్షకులు మాత్రమే కాదు సినీ సెలబ్రిటీస్ కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఒక్క తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన వారు మాత్రమే కాదు ఇతర ఇండస్ట్రీలకు చెందిన వారు కూడా.. హనుమాన్ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
కన్నడ నటుడు సూపర్ స్టార్ శివన్న, రిషబ్ శెట్టి అభినందనలు తెలియజేయడం జరిగింది. ఇక లేటెస్ట్ గా నటసింహం నందమూరి బాలయ్య బాబు కుటుంబంతో కలిసి “హనుమాన్” స్పెషల్ ప్రీమియర్ షో వేయించుకుని చూశారు. సినిమా చూసిన అనంతరం తన రివ్యూని తెలియజేస్తూ మంచి సినిమా తీశారని దర్శకుడు ప్రశాంతవర్మని పిలిపించుకుని మరి అభినందించారు. సినిమాలో ప్రతి ఆర్టిస్ట్ మరియు టెక్నీషియన్స్ ప్రాణం పెట్టి చేసినట్లు ఆ ఫలితం తెరపై కనిపిస్తుందని అన్నారు. అదేవిధంగా “హనుమాన్ 2” కోసం కూడా ఎదురు చూస్తున్నట్లు స్పష్టం చేశారు. సినిమాలో బోలెడంత కంటెంట్ ఉందని.. బాగా హ్యాండిల్ చేశావు అంటూ ప్రశాంత వర్మ అని భుజం తట్టారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులు శ్రీరామచంద్రుడి భక్తుడు దీవెనలు ఉంటాయి.
ట్రైలర్ చూసినప్పుడే సినిమా చూడాలనిపించింది. సినిమాపై మీ తపన ఏంటో కనిపించింది. దర్శకుడు నుంచే కాదు నిర్మాత నుంచి కూడా మంచి సపోర్టు ఉండటం ఈ సినిమా బాగా రావడానికి కారణమైంది. రెండున్నర ఏళ్ళు ఈ సినిమా నిర్మించడం మామూలు విషయం కాదు. అందుకు నిర్మాత నిరంజన్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించాలని అన్నారు. సినిమాలో అంతా బాగుందని అని వర్గాల ప్రేక్షకులు ఆకట్టుకునేలా రూపొందించారు. “హనుమాన్ 2” కోసం వెయిటింగ్ అని బాలకృష్ణ తన ఆసక్తిని తెలియజేశారు. “హనుమాన్” డైరెక్టర్ ప్రశాంత్ వర్మనీ… బాలకృష్ణ అభినందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Just #HANUMAN things..!
'Natasimham' #NandamuriBalakrishna watched HanuMan movie yesterday and got mesmerised with the Epic Superheroic saga on the big screen 🤩
He even appraised the valiant efforts of @PrasanthVarma, @Niran_Reddy, @tejasajja123 & the whole team in creating… pic.twitter.com/4fMrXhtZfB
— Mythri Movie Makers (@MythriOfficial) January 17, 2024