Poonam Pandey: బాలీవుడ్ హాట్ బ్యూటీ పూనమ్ పాండే ఇటీవల మరణించినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. సర్వేకల్ క్యాన్సర్ వల్ల చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచిందని నిన్న ఓ పోస్ట్ సోషల్ మీడియాని కుదిపేసింది. దీంతో చాలామంది పూనమ్ పాండే మరణ వార్తపై రకరకాలుగా స్పందించారు. కొంతమంది సంతాపం కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇదే సమయంలో కొంతమంది ఇది పబ్లిసిటీ స్టంట్ ఆమె ఎలాంటివి చేయడంలో చాలా నేర్పరి అని కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ రకంగానే ఆమె మరణ వార్తలు వచ్చిన ఒక్క రోజు తర్వాత పూనమ్ పాండే మళ్లీ ప్రత్యక్షమై క్యాన్సర్ కారణంగా తాను చనిపోలేదని క్లారిటీ ఇచ్చారు.
తాను బతికే ఉన్నానని చెప్పుకొచ్చారు. గర్భాశయ క్యాన్సర్ కారణంగా ఎంతో మంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారని అందరికీ ఈ మహమ్మారిపై అవగాహన కల్పించాలని ఆలోచనతోనే.. తాను చనిపోయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్లు క్లారిటీ ఇచ్చారు. ఇదే సమయంలో మరణ వార్తతో బాధపడిన ఇబ్బంది పడిన అందరికీ క్షమాపణలు చెబుతున్నట్లు వీడియోలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తాజాగా పూనమ్ పాండే.. వ్యవహరించిన తీరుపై రామ్ గోపాల్ వర్మ వెరైటీగా స్పందించారు.
విషయంలోకి వెళ్తే “హేయ్ పూనం పాండే.. గర్భాశయ క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు నువ్వు ఎంచుకున్న విధానం కొంతమందికి చిరాకు తెప్పించొచ్చు. కానీ ఈ కల్పిత ప్రచారం ద్వారా నువ్వు సాధించిన దాన్ని నీ మంచి ఉద్దేశాన్ని ఎవరు ప్రశ్నించలేరు. ఎందుకంటే ఇప్పుడు అంతట గర్భాశయ క్యాన్సర్ పైనే చర్చ జరుగుతుంది. నీ మాదిరే నీ ఆత్మ కూడా చాలా అందమైనది సంపూర్ణమైన సంతోషకరమైన జీవితం నీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. అని ఆర్జీవి ట్విట్ చేశారు. పూనమ్ పాండే గతంలో కూడా ఇలాంటి ప్రకటనలే చేయడం జరిగింది. 2011వ సంవత్సరంలోక వరల్డ్ కప్ టోర్నమెంట్లో ఇండియా గెలిస్తే బట్టలు మొత్తం విప్పేసి గ్రౌండ్ లో పరిగెడతానని సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. స్వదేశంలో జరిగిన ఆ టోర్నమెంట్ లో ధోని సారధ్యంలో ఎంజాయ్ గెలిచింది. ఈ క్రమంలో పూనమ్ పాండే కొన్ని హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ రకంగా పలు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసి ఆమె వార్తల్లో నిలిచారు. అయితే ఆమె సోషల్ మీడియా ఎకౌంటు ద్వారా ఏకంగా చనిపోయినట్లు ప్రకటించడం తర్వాత రోజే పూనమ్ పాండే తాను బతికున్నట్లు.. తెలియజేయడం పట్ల చాలామంది నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంక నువ్వు మారవా.. పబ్లిసిటీ స్టంట్ లు కోసం మరి నీచంగా దిగజారుతావా అంటూ పూనమ్ పాండే పై సీరియస్ అవుతున్నారు.