Viral Video: మాజీ రవాణా శాఖ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని ఈ వేళ డ్రైవర్ అవతారం ఎత్తారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో పేర్ని నాని వైసీపీ టోపీ పెట్టుకుని బస్సు నడిపారు. అంతే కాకుండా పక్కన వెళుతున్న బస్సుకు, ప్రజలకు చేయి ఊపుతూ బస్సు ముందుకు పోనిచ్చారు.
బస్సులో అనేక మంది కార్యకర్తలు ఉండగా, పేర్ని నాని బస్సు నడపటం చూసి సంతోషం వ్యక్తం చేశారు. దెందులూరులో వైసీపీ సిద్దం సభకు మచిలీపట్నం నుండి కార్యకర్తలు బస్సులో బయలుదేరగా, డ్రైవర్ ను పక్కకు తప్పించి పేర్ని నాని బస్సు నడిపారు. కార్యకర్తలతో పాటు బస్సులో ఆయన తనయుడు, మచిలీపట్నం వైసీపీ ఇన్ చార్జి పేర్ని కిట్టు పాల్గొన్నారు.
ఇంతకు ముందు రవాణా శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనూ పేర్ని నాని ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. అంతే కాకుండా కరోనా సమయంలో పోలీసులు, కార్మికులతో కలిసి భోజనం చేశారు. మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్న పేర్ని నాని మొదటి నుండి ప్రజలతో కలివిడిగా ఉంటూ ఉంటారు. పేర్ని నాని తీరు పట్ల పార్టీ శ్రేణులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
YS Jagan: ప్రభుత్వ పథకాల లబ్దిదారులు అందరూ వైసీపీ స్టార్ క్యాంపెయినర్లు అవ్వాలి – సీఎం జగన్
సిద్ధం… సభకు జనాల్ని తరలిస్తున్న వాహన రథసారథి గా మాజీ మంత్రి పేర్ని నాని… pic.twitter.com/F0N5EMYTZB
— Swathi Reddy (@Swathireddytdp) February 3, 2024