NewsOrbit
Entertainment News Telugu TV Serials

Jagadhatri February 9 2024 Episode 149: నిషికని ఇంట్లో నుండి బయటికి వెళ్లిపోమని చెప్పిన కౌశికి…

Jagadhatri Today Episode February 9 2024 Episode 149 Highlights

Jagadhatri February 9 2024 Episode 149:  నేను నీ ఫోన్ నుంచి దివ్యాంకకి ఫోన్ చేస్తాను తను పెన్ డ్రైవ్ సేఫ్ గా ఉంది అని చెప్తే నువ్వు ఇచ్చావని అర్థం లేదంటే నువ్వు తప్పు చేయలేదని నేను ఒప్పుకుంటాను అని జగదాత్రి అంటుంది. దివ్యాంక్క ఫోన్ లిఫ్ట్ చేసి నిషిక నువ్వేం టెన్షన్ పడకు పెన్ డ్రైవ్ నా దగ్గర సేఫ్ గా ఉంది మనం పెన్ డ్రైవ్ తో కౌశికిని ఎలాగైనా దెబ్బ కొట్టాలి అని అంటుంది. అది విని జగదాత్రి మిమ్మల్ని వదిలిపెట్టను దివ్యాంక వదిన పరువు తీయాలని చూస్తున్న నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు అని అంటుంది జగదాత్రి. జగదాత్రి ఫోన్ కట్ చేసి నిషిక నువ్వు ఏం చేస్తున్నావ్ నీకు తెలుసా నీ ఇంటి పరువు నువ్వే తీస్తున్నావ్ వదినను ఎందుకు ఇలా బాధ పెడుతున్నావ్ దివ్యాంకతో కలిసి ఎందుకు ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నావు వదినకు ఎలాంటి ఆపద వచ్చిన తన మీద ఎలాంటి నిందపడ్డ నేను చెల్లెలని కూడా చూడను ఏం చేస్తానో నాకే తెలియదు నిషిక అని అంటుంది జగదాత్రి. ఇంట్లో వాళ్ళందరికీ నిజం తెలిసిపోతుంది. ఇదంతా కల అని నిషిక అనుకుంటుంది.

Jagadhatri Today Episode February 9 2024 Episode 149 Highlights
Jagadhatri Today Episode February 9 2024 Episode 149 Highlights

నిషిక జగదాత్రి చేతిలో నుండి ఫోన్ తీసుకుంటుంది. ఏమైంది నిషిక నీ భవిష్యత్తు నీకు కనిపించిందా అందుకే తీసుకున్నావా అని అంటుంది జగదాత్రి. మర్యాదగా నిజం చెప్పు అని అంటుంది జగదాత్రి. ఇంతలో కౌశికి వచ్చి ఇన్ని రోజులు అపార్థం చేసుకుంటున్నావు అనుకున్నాను ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తూ వస్తున్నాను ఎందుకంటే ఈ కుటుంబం పరువు పోకూడదని కానీ నువ్వు హద్దులు మీరు ప్రవర్తిస్తున్నావు నిషిక చెడ్డ వాళ్లతో స్నేహం చేసి నువ్వు చేయరాని తప్పులు చేస్తున్నావు నువ్వు ఇంకా ఇంట్లో ఉండకు వెళ్ళిపో అని కౌశికి అంటుంది. నేను పెన్ డ్రైవ్ అయిపోయిందని బాధపడ్డానే తప్ప ఎవరు తీశారు అని నేను ఎవరిని ఇంట్లో వాళ్ళని అడగలేదు ఎందుకంటే వాళ్ళ పైన ఉన్న నమ్మకం నాకు అలాంటిది కానీ నువ్వు ఆ నమ్మకాన్ని కోల్పోయావు నీకు ఆ అర్హత లేదు కాబట్టి నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు

Jagadhatri Today Episode February 9 2024 Episode 149 Highlights
Jagadhatri Today Episode February 9 2024 Episode 149 Highlights

ఇప్పుడే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో నా కళ్ళ ముందు కనిపించకు నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది వెళ్ళిపో అని అంటుంది కౌశికి. అక్క తనని వెళ్ళిపోమంటావ్ ఏంటి అక్క అని యువరాజ్ అంటాడు. యువరాజ్ తను తప్పు చేసింది అర్హత లేదు వెళ్ళిపోతుంది నీకు అభ్యంతరం ఉంటే నువ్వు కూడా ఇంట్లోంచి వెళ్ళిపో నేను ఆపాను అని అంటుంది కౌశికి. వెళ్లిపో నిషిక ఇంకొక నిమిషం ఇంట్లో ఉంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని అంటుంది కౌశికి. కౌశికి తను వెళ్లదు అని అంటుంది వైజయంతి.

Jagadhatri Today Episode February 9 2024 Episode 149 Highlights
Jagadhatri Today Episode February 9 2024 Episode 149 Highlights

తను ఈ ఇంటి కోడలు అది గుర్తుపెట్టుకొని మాట్లాడు తను వెళ్ళదు వెళ్ళనివ్వను అని అంటుంది వైజయంతి. నిషిక వాళ్ళ అత్తయ్య అండ చూసుకొని నవ్వుతుంది. అది చూసి జగదాత్రికి కోపం వస్తుంది కానీ ఏం చేయలేదు. పిన్ని తను ఇంటి పరువు తీస్తుంది అందుకే వెళ్ళిపొమ్మని అంటున్నాను అని కౌశికి అంటుంది. అత్తయ్య తను పెన్ డ్రైవ్ దివ్యాంకకి ఇచ్చింది అని అంటుంది జగదాత్రి. తను పెన్ డ్రైవ్ ఇచ్చింది అని చెప్పింది కానీ మినిస్టర్ సాక్షాలు ఉన్న పెన్ డ్రైవ్ అని చెప్పిందా అని అడుగుతుంది వైజయంతి. లేదు అని చెప్తుంది జగదాత్రి. మరి తనను ఎలా అనుమానిస్తారు మొన్న పార్టీ ఫోటోలు పంపించమని అడిగింది దివ్యాంక ఫోటోలు పెన్ డ్రైవ్ లో ఉన్నాయని పెన్ డ్రైవ్ ఇచ్చింది నిషిక ఆ విషయం తెలుసుకోకుండా తనమీద నిందలు ఎందుకు వేస్తున్నారు అని అంటుంది వైజయంతి. వదిన ఇప్పటికైనా నమ్ముతారా లేకపోతే నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటారా చెప్పండి వెళ్లిపోమంటే వెళ్ళిపోతాను నాకు ఇలా అవమానాలు పడాల్సిన అవసరం నాకు లేదు అని అంటుంది నిషిక. ఇది మన ఇల్లు వదిన నేను మీ మనిషిని మిమ్మల్ని ఎలా మోసం చేస్తాను బయట వాళ్ళని నమ్మినంతగా నన్ను నమ్మట్లేదు అని నిషిక అంటుంది. చూడు కౌశికి బయటి వాళ్లను నమ్మి నిషికను ఇంకొకసారి అవమానిస్తే బాగోదు అని అంటుంది వైజయంతి. నిషిక వైజయంతి తన గదిలోకి వెళ్లి పోతారు. ఏది నిజమో ఏది అబద్దమో తెలియట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటుంది కౌశికి. మీరేం కంగారు పడకండి వదిన ఆ పెన్ డ్రైవ్ ఎక్కడ ఉన్నా నేను మీకు తెచ్చి ఇస్తాను మీ గౌరవాన్ని కాపాడుతాను అని చెప్తుంది జగదాత్రి.

Jagadhatri Today Episode February 9 2024 Episode 149 Highlights
Jagadhatri Today Episode February 9 2024 Episode 149 Highlights

మీరు సరైన సమయానికి వచ్చి కాపాడారు అత్తయ్య మీరు గనక రాకపోతే ఆ జగదాత్రి నన్ను ఇరికించేది నేనే దివ్యాంకకి పెన్ డ్రైవ్ ఇచ్చాను అని ఇంట్లో తెలిసిపోయేది నన్ను ఇంట్లో నుండి బయటకు గెంటేసే వాళ్ళు అని అంటుంది నిషిక. అసలు జగదాత్రికి ఆ విషయం ఎలా తెలిసింది అని అంటుంది వైజయంతి. తను నా ఫోన్లో నుండి దివ్యాంకకి మెసేజ్ చేసింది దివ్యాంక దాంట్లో పెన్ డ్రైవ్ గురించి చెప్పింది అని అంటుంది నిషిక. జగదాత్రి తక్కువది కాదు నిషిక చాలా తెలివైనది ఇలాంటి వన్నీ చేస్తుంది మనం తనని తక్కువ అంచనా వేశాము ఇకనుంచి జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది వైజయంతి. ముందు దివ్యాంకకి ఫోన్ చేసి జగదాత్రి ఒకవేళ తనకి ఫోన్ చేస్తుందేమో జాగ్రత్త పడమని చెప్పు అని అంటుంది వైజయంతి. నిషిక దివ్యాంకకి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెబుతుంది. ఆ జగదాత్రికి నక్క తెలివి ఉన్నది పులి వేగం ఉన్నది దానికున్న సామర్థ్యానికి అది పంతులమ్మ గా ఉండాల్సింది కాదు పోలీస్ గా ఉండాల్సిన మనిషి మీరు జాగ్రత్తగా ఉండండి అని అంటుంది దివ్యాంక.

Jagadhatri Today Episode February 9 2024 Episode 149 Highlights
Jagadhatri Today Episode February 9 2024 Episode 149 Highlights

మీరు పోలీసులని నాకు తెలుసు జగదాత్రి నువ్వు పోలీస్ స్టేషన్ దగ్గర షూట్ చేసిన విధానం చూస్తే ఏది సరిగ్గా లేదు నాకు ఎందుకో అనుమానం వస్తుంది మీరు పోలీసులు అని తెలిసే ఒక ఆధారం దొరికితే అప్పుడు నేను చేసేది చేస్తాను అని యువ అనుకుంటాడు. జగదాత్రి కేదార్ గదిలోకి వెళ్లి వాళ్ళ ఐడెంటిటీ కార్డ్ వెతుకుతాడు. ఎక్కడపడితే అక్కడ అన్ని విసిరేస్తు ఉంటాడు. కేదార్ జగదాత్రి ఐడి కార్డ్స్ కింద పడిపోతాయి. ఇంతలో జగదాత్రి కేదార్ వాళ్ళ గదిలోకి వస్తారు యువరాజ్ గదిలోనే ఉండడం చూసి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఏం చేస్తున్నావు అని అడుగుతారు. నా చార్జర్ ఎవరో ఎక్కడో పెట్టారు అందుకే అన్ని గదులు వెతుకుతున్నాను అని అంటాడు యువరాజ్. కిందపడి ఉన్న ఐడీ కార్డ్స్ ని జగదాత్రి కేదర్ చూసి కంగారు పడతారు. పక్కన ఉన్న చార్జర్ తీసుకెళ్లి ఇదిగో అని ఇస్తాడు కేదార్. ఇలా ఇద్దరు అడ్డంగా ఎందుకు నిలుచున్నారు నేను వెళ్ళాలి తప్పుకోండి అని అంటాడు యువరాజ్. పక్కనుంచి వెళ్ళు యువరాజ్ అని అంటుంది జగదాత్రి. నేను ఇలాగే వెళ్తానని కేదార్ ని తోసేసి వాళ్ళ మధ్యలో నుంచి వెళ్లేసరికి జగదాత్రి ఐడి కార్డ్ తన షూ కి అంటుకొని ఉంటుంది. అది చూసి జగదాత్రి నేను వెళ్లి తీసుకు వస్తాను అని తన వెనకాల వెళుతుంది.

Related posts

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri