Devara: 2013లో ప్రభాస్ నటించిన “మిర్చి” సినిమా సూపర్ డూపర్ హిట్ కావటం తెలిసిందే. దర్శకుడిగా కొరటాల శివకి మొదటి సినిమా అయినా గాని చాలా అద్భుతంగా తెరకెక్కించారు. “ఛత్రపతి” తర్వాత ఆ తరహాలో హీరోయిజం “మిర్చి” లో కనబడటంతో సినిమాని ఫాన్స్ ఫుల్ ఎంజాయ్ చేశారు. తండ్రి కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. మ్యూజిక్ పరంగా అన్ని రకాలుగా “మిర్చి” ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే కొరటాల శివ ప్రస్తుతం ఎన్టీఆర్ తో “దేవర” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ 80 శాతం పూర్తయింది.
చివరి దశలో షూటింగ్ ఉండగా విలన్ పాత్ర చేస్తున్న సైఫ్ అలీ ఖాన్ ఎడమ చేయి ఫ్రాక్చర్ కావడంతో షూటింగ్ ఆగిపోయింది. దీంతో ఏప్రిల్ 8వ తారీకు విడుదల కావలసిన “దేవర” వాయిదా పడటం జరిగింది. కొత్త విడుదల తేదీ త్వరలో ప్రకటించనున్నట్లు సమాచారం. “దేవర” రెండు భాగాలుగా రాబోతోంది. మొదటి భాగం సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఫలితం వచ్చిన అనంతరం రెండో భాగం స్టార్ట్ చేయాలని సినిమా మేకర్స్ ఉన్నారు. ఇదిలా ఉంటే “దేవర”కి ప్రభాస్ “మిర్చి” ఫార్ములా ఉపయోగిస్తున్నట్లు సమాచారం. విషయంలోకి వెళ్తే “దేవర” కూడా తండ్రి కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలోనే చిత్రీకరిస్తున్నారట. ఎన్టీఆర్ ని రెండు పాత్రలలో చూపించబోతున్నారట.
“మిర్చి” మాదిరిగానే చాలా పవర్ ఫుల్ గా ఎన్టీఆర్ ని కొరటాల శివ తండ్రి కొడుకుల పాత్రలలో చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ కెరియర్ లో “దేవర” 30వ సినిమా కావడంతో చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. పైగా “RRR” లాంటి అతి పెద్ద భారీ హిట్ అందుకున్న తర్వాత చేస్తున్న సినిమా కావడంతో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ “జనతా గ్యారేజ్” అనే సినిమా చేయడం జరిగింది. 2016లో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో “దేవర” పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.