NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Medaram Jatara: మేడారం జాతరకు వెళ్లే మహిళా భక్తులకు సర్కార్ గుడ్ న్యూస్

Medaram Jatara: ఈ నెల 21 నుండి 24వ తేదీ వరకూ మేడారం మహా జాతర జరగనుంది. జాతర సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని భావిస్తున్న చాలా మంది ముందుగానే వెళ్లి మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. దీంతో మేడారంకు  ఇప్పటి నుండి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో ప్రయాణీకుల కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది.

ఈ క్రమంలో సర్కార్ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే తెలంగాణ సర్కార్ ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణ సదుపాయం మహాలక్ష్మి పథకం అమలులో ఉండగా, మేడారం జాతరకు వెళ్లే మహిళా భక్తులకూ ఆర్టీసీ బస్సుల్లోనూ ఈ పథకం అమలులో ఉంటుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు.

ఎండీ సజ్జనార్ తెలిపిన సమాచారం ప్రకారం..మేడారం జాతరకు టీఎస్ఆర్సీటీ 6వేల బస్సులను నడుపుతోంది. మేడారం జాతరకు 51 బేస్ పాయింట్లను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల నుండి ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో..ఈ జిల్లాల నుండి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు.

అలానే ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో హనుమకొండ జిల్లా కాజీపేట నుండి కూడా బస్సులను నడుపుతున్నారు. ఈ నెల 18 నుండి 25వరకూ ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. అయితే ఈ స్పెషల్ బస్సు సర్వీసుల్లోనూ ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయడం లేదని వెల్లడించారు సజ్జనార్.

హైదరాబాద్ నుండి మేడారం వరకు మొత్తం 228 కిలో మీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఉదయం 6, 6.30 గంటలకు హైదరాబాద్ జేబీఎస్ నుండి, 7 గంటలకు ఎంజీబీఎస్ నుండి బస్సులు బయలుదేరతాయి. పెద్దలకు రూ.750లు, చిన్నారులకు రూ.450ల టిక్కెట్ ధర నిర్ణయించారు. మేడారం నుండి తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2, 2.30, 3 గంటలకు బయలు దేరతాయి.

ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిలలకు ఉచిత ప్రయాణం కల్పించారు. ఇందులో రానుపోను చార్జీ పెద్దలకు రూ.550లు, చిన్నారులకు 310లు నిర్ణయించారు. సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులను కూడా నడుపుతారు. అయితే వీటిలో ఉచిత ప్రయాణ సదుపాయం లేదు. సూపర్ లగ్జరీలో టికెట్ ధర పెద్దలకు రూ.750లు, చిన్నారులకు రూ.550లు, ఏసీ బస్సుల్లో పెద్దలకు రూ.950లు, పిల్లలకు రూ.750 లుగా నిర్ణయించారు.

YSRCP: సీఎం వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం .. పార్లమెంట్ నియోజకవర్గాలకు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు .. ఏ పార్లమెంట్ కు ఎవరెవరంటే..?

Related posts

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?