NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

Cotton Candy: తమిళనాడులో పీచు మిఠాయిపై నిషేదం విధించిన తర్వాత ఏపీలోనూ ఆ దిశగా చర్యలు..?

Cotton Candy: పీచు మిఠాయిని చిన్నారులు బాగా ఇష్టపడుతూ ఉంటారు. పీచు మిఠాయి చాలా తియ్యగా ఉండటంతో పాటు నోటిలో పెట్టుకోవడంతో వెంటనే కరిగిపోతుంది. రంగురంగుల్లో కనబడటం, టేస్టీ గా ఉండటంతో చిన్నారులు అమితంగా ఇష్టపడుతుంటారు. అనేక రాష్ట్రాల్లో అమ్మకాలు బాగానే జరుగుతూ ఉంటాయి. జాతరలు, ఉత్సవాల్లో వీటి అమ్మకాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అయితే తమిళనాడు ప్రభుత్వం ఇటీవల పీచు మిఠాయి అమ్మకాలను నిషేదించింది.

పీచు మిఠాయి తమిళనాడులో విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. పీచు మిఠాయిని కాటన్ క్యాండీగా పిలుస్తారు. అయితే ఇందులో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నట్లు పరిశోధనల్లో వెల్లడి కావడంతో తమిళనాడు ప్రభుత్వం దీనిపై నిషేద నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో చెన్నైలోని అనేక ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టిన ఫుడ్ సేఫ్టీ అధికారులు వాటి నాణ్యతను పరిశీలించారు. పీచు మిఠాయిలో రోడమైన్ బీ అనే కెమికల్ ఉన్నట్లు గుర్తించారు. కృత్రిమ రంగుల కోసం ఈ కెమికల్ ను వినియోగిస్తున్నట్లు తేల్చారు. ఈ కెమికల్ క్యాన్సర్ కారకంగా అధికారులు గుర్తించారు.

తమిళనాడుకు ముందు పుదుచ్చేరిలోనూ కాటన్ క్యాండీ అమ్మకాలను నిషేదించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. పీచు మిఠాయి నాణ్యతను పరిశీలించేందుకు అన్ని జిల్లాల నుండి శాంపిల్స్ సేకరించి పంపాలని జిల్లా అధికారులను ఆదేశించింది. ఇలా సేకరించిన నమూనాలను టెస్టింగ్ కు పంపాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఏపీ హెల్త్ అండ్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ నివాస్ వెల్లడించారు. జిల్లాల నుండి పీచు మిఠాయి శాంపిల్స్ రాగానే ఈ వారంలోనే పరీక్షల కోసం ల్యాబ్ కు పంపనున్నట్లు ఆయన తెలిపారు.

టెస్ట్ ల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా నిషేదం విధించాలా వద్దా అనే దానిదానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాటన్ క్యాండీల తయారీలో ఉపయోగించే సింథటిక్, నాన్ పర్మిటెడ్ రంగులు క్యాన్సర్ కారకమని, అలానే ఎలాంటి రంగు లేకుండా చేసిన పీచు మిఠాయిలు కూడా అపరిశుభ్రమైన పరిస్థితుల్లో తయారు చేసినందున సురక్షితం కాదని అన్నారు. అయితే అన్ని ప్రాంతాల నుండి పీచు మిఠాయి శాంపిల్స్ సేకరించి పరీక్షించేందుకు సుమారు నెల రోజుల సమయం పడుతుందని ఆయన వెల్లడించారు.

తమిళనాడు, పుదుచ్ఛేరి లో కాటన్ క్యాండీ పై నిషేదం విధించిన నేపథ్యంలో ఇప్పటికే కొంత మంది వ్యాపారులు వీటి విక్రయాలను స్వచ్చందంగా నిలిపివేసినట్లు ఏపీ అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి పండుగలు, జాతర సమయాల్లో వీటి విక్రయాలపై పరిమితులు విధించినట్లు చెప్పారు. తల్లిదండ్రులు పిల్లల విషయంలో జాగ్రత్తలు వహించాలని,  పాఠశాలల వద్ద పిల్లలు ఏది పడితే అది తినకుండా చూడాలని సూచిస్తున్నారు.

Supreme Court: సుప్రీం కోర్టులో బీజేపీకి బిగ్ షాక్ .. చండీగఢ్ మేయర్ ఎన్నికపై సంచలన తీర్పు

Related posts

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

Breaking: అనంతలో ఎన్ఐఏ సోదాల కలకలం

sharma somaraju

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

sharma somaraju