NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

పురందేశ్వ‌రి నెత్తిన పెద్ద గుది బండ వేసిన బీజేపీ .. కోలుకోలేని షాక్.. ఇదే పాలి”ట్రిక్స్” అంటే..!

ఏపీ బీజేపీ చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రికి బీజేపీ అధిష్టానం షాక్ ఇచ్చిందా? ఆమె వ్య‌వ‌హార శైలిపై ఆగ్ర హం వ్య‌క్తం చేసిందా? ఇలా ఎందుకు చేస్తున్నారంటూ.. నివేదిక‌లు ఎదురుగా పెట్టి నిల‌దీసిందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా ఢిల్లీకి వెళ్లిన పురందేశ్వ‌రి.. రాష్ట్రంలో బీజేపీ ప‌రిస్థితిని నివేది క రూపంలో వెల్ల‌డించారు. ఎక్క‌డెక్క‌డ సీట్లు కావాలి? ఏయే స్థానాల్లో విజ‌యావ‌కాశాలు ఉన్నాయి? వంటి కీల‌క విష‌యాల‌పై ఆమె నివేదిక‌ను అందించారు.

అయితే.. ఈ నివేదిక‌ను క‌నీసం చూడ‌కుండానే బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు.. జేడీ న‌డ్డా పురందేశ్వ‌రిపై ప్ర‌
శ్న‌ల వ‌ర్షం కురిపించిన‌ట్టు ఢిల్లీ మీడియా చెబుతోంది. మీరు పార్టీ బాధ్య‌త‌లు తీసుకుని నాలుగు మాసా లు దాటిపోయింది. ఈ కాలంలో ఎంత‌మందిని పార్టీలోకి తీసుకువ‌చ్చారు. యువ‌త ఓట్ల‌ను ప్ర‌భావితం చేసేలా ఎలా ముందుకు సాగారు. ప్ర‌ధాన మంత్రి చెబుతున్న మ‌హిళా ఓట్ల‌ను రాబ‌ట్టు కోవ‌డంలో ఏం చేశారు? ముందు ఇవి చెప్పండి అని నిల‌దీసిన‌ట్టు తెలిసింది.

అంతేకాదు.. వైసీపీ ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేస్తున్న విష‌యాల‌పై కూడా అసంతృప్తి వ్య‌క్తం చేశార‌ని స‌మా చారం. ప్ర‌జ‌ల్లోకి మీరు ఎన్నిసార్లు వెళ్లారు? ఎన్ని స‌భ‌లు పెట్టారు? ఏయే నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టించా రు? అని కూడా న‌డ్డా ప్ర‌శ్నించారు. కీల‌క‌మైన మ‌రో విష‌యాన్ని కూడా పురందేశ్వ‌రితో ప్ర‌స్తావించిన‌ట్టు స‌మాచారం. పార్టీలో స‌ఖ్య‌త‌, ఐక్య‌త ఎలా ఉన్నాయి? సీనియ‌ర్లు, జూనియ‌ర్లు, మాజీ నేత‌ల‌తో ఎలా క‌ల‌సి ముందుకు సాగుతున్నారు? అనే విష‌యాల‌పైనా ఆమె ప్ర‌శ్నించిన‌ట్టు స‌మాచారం.

అయితే.. ఈ ప్ర‌శ్న‌ల‌న్నింటికీ.. పురందేశ్వరి బేల‌చూపులు చూశార‌ని, స‌మాధానం చెప్ప‌లేద‌ని తెలిసింది. దీంతో జేపీ న‌డ్డా.. ముందు ఈ విష‌యాల‌పై దృష్టి పెట్ట‌కుండా.. అభ్య‌ర్థుల‌కు టికెట్ ఇచ్చి ప్ర‌యోజ‌నం ఏంటి? అని ప్ర‌శ్నించిన‌ట్టు బీజేపీ వ‌ర్గాల్లో కూడా చ‌ర్చ సాగుతోంది. పార్టీ ప‌రంగా విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో పురందేశ్వ‌రి విఫ‌ల‌మ‌వుతున్నారంటూ.. కొంద‌రు నాయ‌కులు స‌మ‌ర్పించిన నివేదిక‌ల‌ను ఈసంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌స్తావించిన‌ట్టు తెలిసింది. ఏదేమైనా ఢిల్లీకి ఒకందుకు వెళ్తే.. మ‌రో రూపంలో పురందేశ్వ‌రి ఇబ్బందులు ఎదుర్కొన్నార‌ని అంటున్నారు.

Related posts

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

sharma somaraju

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

sharma somaraju

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

sharma somaraju

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

sharma somaraju

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

sharma somaraju

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N