NewsOrbit
జాతీయం న్యూస్

Arvind kejrival: ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. కేజ్రీవాల్ కు బిగ్ రిలీఫ్  .. బెయిల్ మంజూరు

Arvind kejrival: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు అయ్యింది. లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ శనివారం రౌస్ అవెన్యూ కోర్టు ముందు హజరైయ్యారు. రూ.15వేల బాండ్, రూ.లక్ష పూచికత్తుతో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అనంతరం న్యాయమూర్తి అనుమతితో కోర్టు నుండి కేజ్రీవాల్ వెళ్లిపోయారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణ నిమిత్తం కేజ్రీవాల్ కు ఇప్పటి వరకూ ఎనిమిది సార్లు ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. వాటిని ఆయన తిరస్కరించారు. ఈ క్రమంలోనే గత నెల ఈడీ కోర్టులో ఫిర్యాదు చేసింది. దీనిపే విచారణ జరిపిన న్యాయస్థానం .. ఫిబ్రవరి 17న కోర్టు ముందు హజరుకావాలని ఆదేశించింది. అయితే ఆ సమయంలో అసెంబ్లీ విశ్వాస పరీక్ష ఉన్నందున వర్చువల్ గా హజరైన సీఎం .. తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హజరవుతానని అభ్యర్ధించారు. ఇందుకు అంగీకరించిన న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది.

ఈ అంశం కోర్టులో పెండింగ్ లో ఉండగానే ఈడీ ఆయనకు మరిన్ని సమన్లు జారీ చేసింది. చివరి సారిగా మార్చి (ఈ నెల) 4న విచారణకు రావాలని సమన్లు ఇవ్వగా, ఆయన గైర్హజరు అయ్యారు. అయితే, తాను విచారణను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నానని ఈడీకి సమాధానం పంపారు. మార్చి 12 తర్వాత వర్చువల్ గా హజరవుతానని షరతు విధించారు. దీంతో ఈడీ మరో సారి కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ ను విచారణ చేపట్టిన కోర్టు .. మార్చి 16న తప్పనిసరిగా తమ ఎదుట హజరు కావాలని ఆదేశించింది. దానిలో భాగంగా ఇవేళ కేజ్రీవాల్ కోర్టుకు హజరైయ్యారు.

కేజ్రీవాల్ పై మోపిన అభియోగాలు బెయిల్ పొందడానికి అవకాశం ఉన్న సెక్షన్లని న్యాయమూర్తి పేర్కొంటూ .. ఏడీ చేసిన రెండు పిర్యాదుల్లోనూ ఆయనకు బెయిల్ మంజూరు చేశారు.

Karimnagar: కరీంనగర్ ప్రతిమ మల్టీప్లెక్స్ ల పోలీసుల తనిఖీలు .. భారీగా నగదు పట్టివేత ..ఎవరివంటే..?

Related posts

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

sharma somaraju

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

sharma somaraju

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

sharma somaraju

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

sharma somaraju

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N