NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Big Breaking: కేజ్రీవాల్ నివాసంలో ఈడీ అధికారుల సోదాలు .. ఢిల్లీలో టెన్షన్ .. ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ..?

Big Breaking: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేజ్రీవాల్ నివాసానికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు చేరుకున్నారు. ఆయన నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ హైకోర్టు అరవింద్ కేజ్రీవాల్ కు అరెస్టు నుండి ఉపశమన ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన తర్వాత ఈడీ అధికారులు ఆయన నివాసానికి సెర్చ్ వారెంట్ తో రావడంతో ఆయనను అరెస్టు చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది.

arvind kejriwal

ఆయన ఇంటి వద్దకు అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. పోలీసులు కూడా ఆయన ఇంటి వద్ద భారీగా మొహరించారు. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్టు చేయాలని వారు ప్లాన్ చేసినట్లు అర్ధం అవుతోందని ఢిల్లీ మంత్రి భరద్వాజ్ అన్నారు.

Enforcement Directorate

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో విచారణకు రావాలని ఇప్పటికే తొమ్మిది సార్లు సమన్లు జారీ చేసినా కేజ్రీవాల్ హజరయ్యేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ కేసులో కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో ఇవేళ ఊరట లభించలేదు. ఈడీ నోటీసులు సస్పెండ్ చేయాలని కోరుతూ కేజ్రీవాల్ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో విచారణకు సహకరిస్తానని, అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును అభ్యర్ధించినా నిరాకరించింది.

ప్రస్తుతం ఈ కేసు పురోగతి దృష్ట్యా ఇందులో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పిన గంటల వ్యవధిలోనే ఈడి అధికారులు ఆయన ఇంటికి చేరుకుని సోదాలు జరుపుతున్నారు. ఇదే కేసులో ఇటీవల హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసంలో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించిన వెంటనే అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడ అదే విధంగా ఈడీ అధికారులు సెర్ట్ వారెంట్ తో అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి చేరుకుని  సోదాలు జరుపుతుండటంతో ఏక్షమైనా అరెస్టు చేసే అవకాశం ఉందని వార్తలు వినబడుతున్నాయి.

మరో పక్క .. ఈ అంశంపై కేజ్రీవాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మద్యం విధానంలో కేసులో మధ్యంతర ఉపశమనం కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించడాన్ని ఆయన తరుపు న్యాయవాదులు సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. ఈ అంశాన్ని అత్యవసర జాబితాలో చేర్చి విచారణ జరిపించేందుకు లీగల్ టీమ్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తొంది.

YS Sharmila: కడప జిల్లా నేతలతో వైఎస్ షర్మిల సమావేశం .. పోటీపై ఏమన్నారంటే ..?

Related posts

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju