Brahmanandam: తెలుగు కామెడీ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ కానుంది. భామకలాపం తరువాత నిర్మాతలు బీ బాపినీడు, సుధీర్ ఈదర కలిసి వీరాంజనేయులు విహారయాత్ర పేరుతో కామెడీ మూవీని నిర్మించారు. ఈ మూవీతో సుధీర్ పుల్లట్ల దర్శకుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. నిహారయాత్ర సినిమాలో సీనియర్ నరేష్ తో పాటు బ్రహ్మానందం ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కీడాకోలా ఫేమ్ రాగ్‌మయూర్, ప్రియా వడ్లమాని హీరో మరియు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రోడ్ ట్రిప్ బాడ్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమా డైరెక్ట్ గా ఈటీవీ విన్ ఓటీటీ లోనే రిలీజ్ కాబోతుంది.
ఇటీవల ఈ మూవీ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో వో పాతకాలం నాటి వాన్లో గోవాకు ఓ ఫ్యామిలీ మొత్తం గోవా టూర్ వెళ్తున్నట్లుగా చూపించారు. దానిపైన లగేజీతో పాటు అస్థికలతో కూడిన చిన్న కొండ కనిపించడం ఆసక్తిని పెంచుతుంది. గోవా రోడ్ ట్రిప్ లో ఓ ఫ్యామిలీ ఎదురైన ఇబ్బందులు, కష్టాలను ఫన్నీగా ఈ మూవీలో చూపించబోతున్నట్లు తెలుస్తుంది. వీరాంజనేయులు విహారయాత్రలో బ్రహ్మానందం క్యారెక్టర్ సర్ప్రైజింగ్ గా ఉండబోతున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీ తోనే బ్రహ్మానందం ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. కీడాకోలా హిట్ తర్వాత బ్రహ్మానందం, రాగ్‌మయూర్ కలిసి చేస్తున్న మూవీ ఇది. మోస్ట్ ఎంటర్టైనింగ్ రోడ్ ట్రిప్ ఆఫ్ ది ఇయర్ అనే క్యాప్షన్ ఆసక్తిని పెంచుతుంది. వీరాంజనేయులు విహారయాత్ర షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తుంది.
త్వరలోనే ఈటీవీ విన్ ఓటిటిలో ఈ కామెడీ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది. ఈ మూవీకు ఆర్ హెచ్ విక్రం మ్యూజిక్ అందిస్తున్నాడు. సినిమాలు మరియు సిరీస్ లలో నటి నటుడిగా బిజీ గా ఉన్నాడు సీనియర్ నరేష్. గత ఏడాది మళ్లీ పెళ్లి పేరుతో ఓ సినిమాను నిర్మించాడు. తన జీవితంలో జరిగిన సంఘటనలతోనే నరేష్ ఈ మూవీని తెరకెక్కించాడు. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ లో ఓ డిఫరెంట్ రోల్లో నరేష్ కనిపించడున్నాడు. గత కొన్నేళ్లుగా సినిమాల వేగాన్ని తగ్గించాడు బ్రహ్మానందం. గత ఏడాది రిలీజ్ అయిన బ్రో, భోళా శంకర్ మూవీలలో గెస్ట్ రోల్స్ లో కనిపించాడు బ్రహ్మానందం.
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో వరదరాజులు అనే పాత్రలో తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు బ్రహ్మానందం. ఇక మునిపట్టి లాగా వరుస పెట్టి బ్రహ్మానందం సినిమాలు చేయడం లేదు. దీనికి కారణం తన ఆరోగ్యమే. ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో సంవత్సరానికి ఒక సినిమాకు మించి ఎక్కువ సినిమాలు చేయలేకపోతున్నాడు బ్రహ్మానందం. చేసేది ఒక సినిమానే అయినప్పటికీ మంచి ప్రాధాన్యత ఉన్న కథలను ఎంచుకుంటున్నాడు బ్రహ్మానందం. కామెడీ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చే పేరు బ్రహ్మానందం. అంతలాగా తన పేరును ప్రపంచానికి చాటి చెప్పాడు మరి. ఇక మరోసారి తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్రహ్మానందం ఏ విధంగా ఆకట్టుకుంటాడో చూడాలి.