NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడలోని 3 నియోజకవర్గాల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్నది సెంట్రల్ నియోజకవర్గం. బ్రాహ్మణ, కాపు, రెడ్డి సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం. ఇలాంటి చోట ఇప్పుడు వైసీపీ తరఫున మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పోటీ చేస్తుండగా… టీడీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ తలపడతున్నాడు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణు చేతిలో కేవలం 12 ఓట్ల తేడాతో మాత్రమే బోండా ఉమా ఓడారు. ఇది రాష్ట్రంలోనే అత్యల్ప మెజారిటీ. అయితే ఆ తర్వాత నుంటి సెంట్రల్ పరిధిలో బోండా నిత్యం తిరుగుతూనే ఉన్నారు.

అదే సమయంలో అందరికీ అందుబాటులో ఉంటాడనే గుర్తింపు కూడా. వీటన్నిటికి తోడు మాస్ లీడర్ అనే పేరు కూడా బోండా ఉమా సొంతం. ప్రధానంగా అజిత్ సింగ్ నగర్, పాయకాపురం, పైపుల రోడ్డు, నున్న, సత్యనారాయణ పురం రైల్వే కాలనీ, మధురానగర్ ప్రాంతాల్లో బోండా ఉమాకు మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే గత ఎన్నికల్లో జగన్ హవాలో కూడా కేవలం 12 ఓట్ల తేడాతోనే బోండా ఉమా ఓడారు. ఆ తర్వాత ఉమాకు పార్టీ పోలిట్‌బ్యూరో పదవి ఇచ్చారు చంద్రబాబు. వీటన్నిటికి తోడు కాపు నేత అనేది మరో బలం. పైగా మాచర్లలో పరామర్శకు వెళ్లిన సమయంలో బోండా ఉమపై దాడి జరిగింది. ఆ దాడిలో ఉమ గాయపడ్డాడు కూడా. ఆ సానుభూతి ఇప్పటికీ కొనసాగుతుంది.

ఇక వైసీపీ విషయానికి వస్తే… నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణును కాదని పశ్చిమ నియోజకవర్గం ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ను ఇక్కడ నుంచి పోటీ చేయిస్తున్నారు. వెల్లంపల్లి పేరు ప్రకటించగానే మల్లాది విష్ణు వర్గం అగ్గిమీద గుగ్గిలంలా మారింది. ఒకదశలో మల్లాది పార్టీ మారుతారని… ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారని కూడా పుకార్లు షికారు చేశాయి. సత్యనారాయణపురం ప్రాంతంలో బ్రాహ్మణ ఓటు బ్యాంక్ అధికం. అందుకే గతంలో ఇదే సామాజిక వర్గానికి చెందిన కోట శ్రీనివాసరావు ఇక్కడ నుంచే బీజేపీ తరఫున పోటీ చేసి గెలిచారు కూడా.

ఇప్పుడు ఆ వర్గం మొత్తం వైసీపీపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇందుకు ప్రధానం కారణం… 175 నియోజకవర్గాల్లో కేవలం కోన రఘుపతికి మినహా మరెవరికి జగన్ టికెట్ కేటాయించలేదు. ఈ సమయంలోనే సింగ్ నగర్‌లో బస్సు యాత్ర చేస్తున్న సీఎం జగన్‌పై రాయితో దాడి జరిగింది. ఆ దాడిలో కన్నుకు గాయమైందని వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా కట్టు వేశారు. అయితే ఈ దాడి టీడీపీ నేతలు చేశారని ముందుగా ప్రచారం చేసినప్పటికీ… తర్వాత క్వార్టర్ బాటిల్, డబ్బులు ఇస్తామని తీసుకువచ్చారని… అయితే డబ్బులు ఇవ్వకపోవడంతో… యువకులు రాళ్లు వేసినట్లు తెలుస్తోంది.

దీంతో సానుభూతి రాకపోగా వైసీపీకి చెడ్డపేరు కూడా వచ్చేసింది. ఇది వైసీపీ ఓటమికి పరోక్షంగా కారణం కూడా. వీటన్నిటికి తోడు… కాపు నేత వంగవీటి రాధాకృష్ణ కూడా ఇదే నియోజకవర్గానికి చెందిన నేత. ఆయన వర్గం కూడా టీడీపీకి అండగా నిలిచింది. అందుకే ఈసారి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా గెలుపు నల్లేరు మీద నడక అంటున్నారు.

Related posts

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

Breaking: అనంతలో ఎన్ఐఏ సోదాల కలకలం

sharma somaraju

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

sharma somaraju

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

sharma somaraju

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

sharma somaraju

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

sharma somaraju

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N