NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Inter Board: ఏపీ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన .. రీ వెరిఫికేషన్, బెటర్మెంట్ ఫీజు చెల్లింపునకు పూర్తి సమాచారం ఇది

Inter Board: ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులతో పాటు ఇంప్రూవ్‌మెంట్‌ రాయాలనుకునే విద్యార్ధులు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల కోసం రేపటి (ఏప్రిల్‌ 18) నుంచి ఫీజు చెల్లించాలని ఇంటర్‌ బోర్డు తెలిపింది. ఫీజు చెల్లింపులకు ఏప్రిల్ 24వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. ఈ మేరకు ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌ ప్రకటన విడుదల చేశారు.

మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌ కోసం కూడా ఏప్రిల్‌ 18 నుంచి ఏప్రిల్ 24వ తేదీల్లో ఫీజు చెల్లించాలని సూచించారు. ఒక్కో పేపర్‌ జవాబు పత్రం రీ వెరిఫికేషన్‌కు రూ.1300 చెల్లించాలని పేర్కొన్నారు. ఒక్కో పేపర్ రీకౌంటింగ్‌కు రూ.260 చెల్లించాలని తెలిపారు.

ఇక సప్లిమెంటరీ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకునే ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు పేపర్లతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ రూ.550 చెల్లించాలి అని తెలిపారు. ప్రాక్టికల్స్‌కు రూ.250, బ్రిడ్జి కోర్సులకు రూ.150 చొప్పున చెల్లించాలని ఆయన వివరించారు.

ఇంటర్‌ మొదటి సంవత్సరంలో అన్ని పేపర్లు ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలు రాయాలను కుంటే.. అటువంటి వారు రూ.550 పరీక్ష ఫీజుగా చెల్లించాలి. దీంతో పాటు ఒక్కో పేపర్‌కు రూ.160 చొప్పున చెల్లించాలి. మొదటి, రెండో సంవత్సరం రెండింటికీ ఇంప్రూవ్‌మెంట్‌ రాయాలనుకుంటే.. సైన్స్‌ విద్యార్థులు రూ.1440, ఆర్ట్స్‌ విద్యార్థులు రూ.1240 ఫీజుగా చెల్లించాలని ఆయన సూచించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను తమ తమ కాలేజీల్లోని ప్రిన్సిపల్స్‌ ను సంప్రదించాలని సూచించారు.

కాగా ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 25 నుంచి జూన్‌ 1 వరకు నిర్వహించనున్నామని ఇప్పటికే ఇంటర్‌ బోర్డు స్పష్టం చేసింది. ఏప్రిల్‌ 18 నుంచి ఏప్రిల్ 24వ తేదీల్లో ఫీజు చెల్లించిన వారు మాత్రమే అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు అవకాశం కల్పిస్తారు. ఈ విషయం అన్ని జూనియర్‌ కాలేజీల ప్రిన్సిపాల్స్‌ తమ విద్యార్ధులకు తెలియ జేయాలని సౌరభ్‌ గౌర్‌ కోరారు.

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

Related posts

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

Breaking: అనంతలో ఎన్ఐఏ సోదాల కలకలం

sharma somaraju

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

sharma somaraju

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

sharma somaraju

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

sharma somaraju