NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

AP Elections 2024: ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో అతి కీలక ఘ‌ట్టమైన నామినేష‌న్ల స్వీక‌ర‌ణ కార్య‌క్ర‌మం గురువారం నుంచి ప్రారంభమ‌వుతుందని, ఇందు కోసం అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ఇప్ప‌టికే ఏర్పాట్లను పూర్తి చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.

EC AP CEO Mukesh Kumar Meena

పార్ల‌మెంటు స్థానాలకు పోటి చేసే అభ్య‌ర్ధులు ఆయా క‌లెక్ట‌రేట్ లో, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్య‌ర్ధులు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌ధాన కేంద్రాల్లో నామినేష‌న్ల‌ను దాఖ‌లు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఒక్కో అభ్య‌ర్ధి గ‌రిష్టంగా నాలుగు సెట్ల‌ను దాఖ‌లు చేయ‌వ‌చ్చని, ఒక అభ్య‌ర్ధి ఏవైనా రెండు స్థానాల్లో మాత్ర‌మే పోటీ చేసేందుకు అవ‌కాశం ఉందని తెలిపారు.

నామినేష‌న్లు దాఖ‌లు చేసే అభ్య‌ర్ధితో పాటు మ‌రో న‌లుగురిని మాత్ర‌మే ఆర్ఓ కార్యాల‌యం వ‌ర‌కు అనుమ‌తి ఇస్తారని, మిగిలిన వారిని 100 మీట‌ర్ల అవ‌త‌ల నిలిపివేస్తారన్నారు. అభ్య‌ర్ధితో మొత్తం మూడు వాహ‌నాల‌కు మాత్ర‌మే అనుమ‌తి ఉంటుందన్నారు. పోటీ చేసే అభ్య‌ర్ధులు పార్ల‌మెంటుకు రూ.25,000, అసెంబ్లీకి రూ.10,000 ధ‌రావ‌తు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎస్‌సి, ఎస్‌టి అభ్య‌ర్ధులు దీనిలో 50 శాతం చెల్లిస్తే స‌రిపోతుందన్నారు.

ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని పాటిస్తూ అభ్యర్ధులు త‌మ నామినేష‌న్ల‌ను దాఖ‌లు చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఈ నామినేషన్ ల ప్రక్రియను పూర్తిగా రికార్డు చేసేందుకు నామినేష‌న్లను స్వీక‌రించే గ‌దిలో, అభ్య‌ర్ధులు ప్ర‌వేశించే ద్వారాల వ‌ద్దా సిసి కెమేరాల‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మోడ‌ల్ కోడ్ అమ‌ల్లో భాగంగా అభ్య‌ర్ధుల ఊరేగింపుల‌ను, నామినేష‌న్ దాఖ‌లు చేసే కార్య‌క్ర‌మాల‌ను సైతం వీడియో రికార్డింగ్ చేస్తారన్నారు

నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు

  • అభ్యర్థులు నామినేషన్ల దాఖలకు 13 రకాల డాక్యుమెంట్లను తీసుకురాలి
  • పార్ల‌మెంటుకు పోటీచేసే అభ్య‌ర్ధులు ఫార‌మ్ 2ఏ, అసెంబ్లీకి పోటీ చేసేవారు ఫార‌మ్ 2బి లో ధ‌ర‌ఖాస్తు చేయాలి.
  • నోటిఫైడ్ తేదీలలో ఉదయం 11.00 నుండి మధ్యాహ్నం 3.00 వరకు నామినేషన్లను స్వీకరించడం జరుగుతుంది.
  • పబ్లిక్ సెలవు దినాలలో నామినేషన్ స్వీకరించబడదు.
  • అభ్యర్థులు గరిష్టంగా 4 సెట్ల నామినేషన్ దాఖలు చేయవచ్చు.
  • నామినేష‌న్ల‌ను ఆర్ఓ కు గానీ, సంబంధిత ఏఆర్ఓకు మాత్ర‌మే స‌మ‌ర్పించాలి.
  • అభ్య‌ర్ది త‌న నామినేష‌న్‌ను నేరుగా గానీ, త‌న ప్ర‌పోజ‌ర్ ద్వారా గానీ స‌మ‌ర్పించ‌వ‌చ్చు.
  • అభ్య‌ర్ధి నామినేష‌న్‌తో పాటు త‌మ పేరిట కొత్త‌గా తెరిచిన బ్యాంకు ఖాతా వివ‌రాల‌ను స‌మ‌ర్పించాలి.
  • రెండు కంటే ఎక్కువ నియోజకవర్గాల నుండి అభ్యర్థులు నామినేషన్లను ఫైల్ చేయడం కుదరదు.
  • నామినేషన్ల దాఖలు సమయంలో 100 మీటర్ల పరిధిలో గరిష్టంగా 3 వాహనాలు అనుమతించబడతాయి.
  • అభ్య‌ర్ధితో స‌హా ఐదుగురు వ్య‌క్తులు మాత్ర‌మే ఆర్ఓ ఆఫీస్‌లోకి ప్రవేశించవచ్చు.
  • నామినేషన్ల స్వీకరణకు సంబంధించి ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరుగుతుంది.
  • అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేశారు.
  • సువిధ యాప్ ద్వారా నామినేష‌న్లను దాఖ‌లు చేసే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ, వాటి కాపీల‌ను భౌతికంగా ఆర్ఓకు అంద‌జేయాల్సి ఉంటుంది.
  • ఫార‌మ్‌-26 ద్వారా త‌న అఫ‌డ‌విట్‌ను స‌మ‌ర్పించాలి.
  • ఫారమ్ 26 స్టాంప్ పేపర్ యొక్క విలువ రూ. 10 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి.
  • భౌతిక స్టాంప్ పేపర్ అందుబాటులో లేకుంటే E స్టాంప్ కూడా ఉపయోగించవచ్చు.
  • అభ్యర్థి నామినేషన్ వేసిన దగ్గర నుంచీ, ఖర్చు అతని ఖాతాలో లెక్కించడం జరుగుతుంది.
  • పత్రికల్లో వచ్చే ప్రకటనలు, పెయిడ్ న్యూస్ వార్తలను సైతం అభ్యర్థి ఖాతాలో లెక్కించడం జరుగుతుంది.

ఎన్నికల ప్రక్రియ షెడ్యూలు మరియు ముఖ్య‌మైన తేదీలు:

  • గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసే తేదీ: 18 ఏప్రిల్ 2024 (గురువారం)
  • గెజిట్ నోటిఫికేషన్ జారీ తేదీ నుంచి నామినేష‌న్ల స్వీక‌ర‌ణ ప్రారంభ‌మ‌వుతుంది.
  • నామినేషన్లు వేయడానికి చివరి తేదీ : 25 ఏప్రిల్ 2024 (గురువారం)
  • నామినేషన్ల పరిశీలన తేదీ: 26 ఏప్రిల్ 2024 (శుక్రవారం)
  • అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ: 29 ఏప్రిల్ 2024 (సోమవారం)
  • పోల్ తేదీ: 13 మే 2024 (సోమవారం)
  • కౌంటింగ్ తేదీ : 04 జూన్ 2024 (మంగళవారం)

Inter Board: ఏపీ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన .. రీ వెరిఫికేషన్, బెటర్మెంట్ ఫీజు చెల్లింపునకు పూర్తి సమాచారం ఇది

Related posts

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ ..ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలంటూ ఆదేశం

sharma somaraju