Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న “పుష్ప-2” సినిమాపై బాలీవుడ్ లో భారీగా అంచనాలున్నాయి. టీజర్ రిలీజ్ తర్వాత ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ పొందేందుకు భారీగా డిమాండ్ ఏర్పడినట్లు తెలుస్తోంది. అయితే, భారీ ధరకు ఓ పాపులర్ డిస్ట్రిబ్యూటర్ హిందీ రైట్స్ ను సొంతం చేసుకున్నట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. ఆగస్టు 15న బాక్సాఫీస్ ను బద్దలు కొట్టనుందని అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2021లో విడుదలైన “పుష్ప” మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఈ సినిమాలో డైలాగులు, పాటలు, స్టోరీ అన్ని.. సినిమా లవర్స్ నీ అలరించడం జరిగింది. దీంతో ఇప్పుడు “పుష్ప” రెండో భాగంపై ప్రపంచవ్యాప్తంగా అనేక అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇటీవల అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా.. విడుదల చేసిన టీజర్.. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ టీజర్ తో సినిమాపై అంచనాలు డబల్ అయ్యాయి. ఇదే సమయంలో సినిమా హక్కుల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. దీనిలో భాగంగా హిందీ రైట్స్ అత్యధిక రేటింగ్ పలికినట్లు టాక్. ఇండియాలో పుష్ప సినిమా కోసం ఎక్కువ ఎదురుచూస్తుంది.. హిందీ ప్రేక్షకులే.
“పుష్ప” మొదటి భాగం హిందీలో 100 కోట్లు కలెక్ట్ చేసింది. సరిగ్గా కరోనా తగ్గు ముఖం పట్టిన సమయం.. ఆ టైంలో అలాంటి ప్రమోషన్స్ హిందీలో చేయలేదు. అయినా గాని 100 కోట్లు రావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇదిలా ఉంటే ఈసారి ఎక్కువ ప్రమోషన్ కార్యక్రమాలు చేయాలని సినిమా మేకర్స్ డిసైడ్ అయ్యారు. ఇందులో అత్యధికంగా.. హిందీలోనే ప్రమోషన్ కార్యక్రమాలు ఎక్కువగా ఉండబోతున్నావని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా హిందీ భాషల్లోనే.. “పుష్ప” రిలీజ్ చేయబోతున్నట్లు కూడా టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా 70 శాతం షూటింగ్ కంప్లీట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మిగతా షూటింగ్ భాగం జూన్ నెల చివరికి కంప్లీట్ కాబోతుందట. జులై నెల స్టార్టింగ్ నుండి ఆగస్టు 15 వరకు వరుస పెట్టి.. ప్రమోషన్స్ చేయనున్నారట.