NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

Nabha Natesh: నవ నటేష్.. ఈ ముద్దుగుమ్మ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. వజ్రకాయ అనే కన్నడ మూవీ తో సినీరంగ ప్ర‌వేశం చేసిన న‌భా న‌టేష్‌.. 2018లో నన్ను దోచుకుందువటే చిత్రంతో తెలుగు తెర‌కు పరిచయమైంది. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ మూవీతో టాలీవుడ్ లో ఆమెకు భారీ క్రేజ్ వచ్చింది. ఇస్మార్ట్ శంకర్ అనంతరం వరస సినిమాలు చేస్తున్న నభా నటేష్ అనుకోకుండా ఓ యాక్సిడెంట్ కి గురైంది. దాంతో 2021 నుంచి ఆమె వెండితెర‌పై కనిపించలేదు. యాక్సిడెంట్ నుంచి పూర్తిగా కోరుకున్న తర్వాత న‌భా మళ్ళీ సినిమా ఛాన్సులు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది.

సోషల్ మీడియా ద్వారా గ్లామర్ ను ఎరగా వేస్తూ అవకాశాలు అందుకునేందుకు నానా తంటాలు పడుతోంది. ఇప్పుడిప్పుడే ఆమెకు మళ్ళీ సినిమా ఛాన్సులు వస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా కమెడియన్ కమ్‌ హీరో ప్రియదర్శికి నభా నటేష్ మాటలు జాగ్రత్త అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అస‌లు న‌భా న‌టేష్ వార్నింగ్ ఇచ్చే త‌ప్పు ప్రియదర్శి ఏం చేశాడు..? అస‌లు వీరిద్ద‌రూ ట్విట్టర్(ఎక్స్‌)లో ఎందుకు కొట్టుకున్నారు..? అన్న విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.

న‌భా న‌టేష్ తాజాగా ప్రభాస్ వాయిస్‌తో ఓ డబ్‌స్మాష్ వీడియో చేసింది. ప్ర‌భాస్ ఊత‌ప‌దం డార్లింగ్ అన్న సంగ‌తి మ‌నంద‌రికీ తెలిసిందే. డార్లింగ్ అన్న ప‌దాన్ని ప్ర‌భాస్ వాడినంత మ‌రెవ్వ‌రూ వాడ‌రు. అయితే సినిమాలు, సినిమా ఈవెంట్స్, టీవీ షోలో ప్ర‌భాస్ వాడిన కొన్ని ఫేమస్ డార్లింగ్ పదాలన్ని కలిపి న‌భా న‌టేష్ డబ్‌స్మాష్ వీడియో చేసి సోష‌ల్ మీడియాలో పెట్టింది. ఈ వీడియోకు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. చాలా త‌క్కువ స‌మ‌యంలో న‌భా డ‌బ్‌స్మాష్ వీడియో నెట్టింట ట్రెండ్ అయింది.

అయితే ఈ వీడియోపై న‌టుడు ప్రియ‌ద‌ర్శి స్పందించాడు. వావ్ సూపర్ డార్లింగ్.. కిరాక్‌ ఉన్నావ్ డార్లింగ్ అని కామెంట్ పెట్టాడు. అది చూసిన న‌భా న‌టేష్ రెచ్చిపోయింది. మిస్టర్ కామెంట్‌ చేసేముందు మాటలు జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చింది. ఒక తెలియని అమ్మాయిని డార్లింగ్ అని పిలవడం ఐపిసి సెక్షన్ 354 A ప్రకారం లైంగిన వేధింపుల కిందకు వస్తుందని గ‌తంలో కలకత్తా కోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్నీ గుర్తు చేస్తూ పోస్ట్ పెట్టింది. అందుకు ప్రియ‌ద‌ర్శి కూడా వెంట‌నే న‌భాకు కౌంట‌ర్ ఇచ్చాడు.

`మనం ఒకరికొకరం తెలియదని నాకు తెలియదు. బై ద వే మీరేమో డార్లింగ్‌ అని పిలవొచ్చు.. మేము పిలిస్తే ఐపీసీ సెక్షన్‌ పెడతారా? లైట్ తీస్కో డార్లింగ్` అంటూ ప్రియ‌ద‌ర్శి రిప్లై ఇచ్చాడు. దానికి `లైన్ క్రాస్ అవ్వొద్దు చూసుకుందాం` అని న‌భా న‌టేష్ రీకౌంట‌ర్ ఇవ్వ‌గా.. `వై దిస్ కొలవెరి` అంటూ ప్రియ‌ద‌ర్శి ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. మొత్తానికి స‌ర‌దాగా జ‌రిగిన న‌భా న‌టేష్‌, ప్రియ‌ద‌ర్శి ట్విట్ట‌ర్ వార్ నెట్టింట వైర‌ల్ గా మార‌డంతో.. నెటిజ‌ర్లు ర‌క‌ర‌కాలుగా కామెంట్లు చేస్తున్నారు. కాగా, సేవ్ ది టైగర్స్ సీజన్ 2 సక్సెస్ తో టాలీవుడ్ లో మ‌రింత క్రేజ్ తెచ్చుకున్న ప్రియ‌ద‌ర్శి ప్ర‌స్తుతం హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో బిగ్ హిట్ అందుకున్న నిర్మాత నిరంజన్ రెడ్డి ఈ మూవీని తెర‌కెక్కిస్తుండ‌గా.. న‌భా న‌టేష్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. ఓ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా ఇప్పుడు చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది.

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

Breaking: అనంతలో ఎన్ఐఏ సోదాల కలకలం

sharma somaraju

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella