Nabha Natesh: నవ నటేష్.. ఈ ముద్దుగుమ్మ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. వజ్రకాయ అనే కన్నడ మూవీ తో సినీరంగ ప్రవేశం చేసిన నభా నటేష్.. 2018లో నన్ను దోచుకుందువటే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ మూవీతో టాలీవుడ్ లో ఆమెకు భారీ క్రేజ్ వచ్చింది. ఇస్మార్ట్ శంకర్ అనంతరం వరస సినిమాలు చేస్తున్న నభా నటేష్ అనుకోకుండా ఓ యాక్సిడెంట్ కి గురైంది. దాంతో 2021 నుంచి ఆమె వెండితెరపై కనిపించలేదు. యాక్సిడెంట్ నుంచి పూర్తిగా కోరుకున్న తర్వాత నభా మళ్ళీ సినిమా ఛాన్సులు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది.
సోషల్ మీడియా ద్వారా గ్లామర్ ను ఎరగా వేస్తూ అవకాశాలు అందుకునేందుకు నానా తంటాలు పడుతోంది. ఇప్పుడిప్పుడే ఆమెకు మళ్ళీ సినిమా ఛాన్సులు వస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా కమెడియన్ కమ్ హీరో ప్రియదర్శికి నభా నటేష్ మాటలు జాగ్రత్త అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అసలు నభా నటేష్ వార్నింగ్ ఇచ్చే తప్పు ప్రియదర్శి ఏం చేశాడు..? అసలు వీరిద్దరూ ట్విట్టర్(ఎక్స్)లో ఎందుకు కొట్టుకున్నారు..? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నభా నటేష్ తాజాగా ప్రభాస్ వాయిస్‌తో ఓ డబ్స్మాష్ వీడియో చేసింది. ప్రభాస్ ఊతపదం డార్లింగ్ అన్న సంగతి మనందరికీ తెలిసిందే. డార్లింగ్ అన్న పదాన్ని ప్రభాస్ వాడినంత మరెవ్వరూ వాడరు. అయితే సినిమాలు, సినిమా ఈవెంట్స్, టీవీ షోలో ప్రభాస్ వాడిన కొన్ని ఫేమస్ డార్లింగ్ పదాలన్ని కలిపి నభా నటేష్ డబ్స్మాష్ వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టింది. ఈ వీడియోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చాలా తక్కువ సమయంలో నభా డబ్స్మాష్ వీడియో నెట్టింట ట్రెండ్ అయింది.
అయితే ఈ వీడియోపై నటుడు ప్రియదర్శి స్పందించాడు. వావ్ సూపర్ డార్లింగ్.. కిరాక్ ఉన్నావ్ డార్లింగ్ అని కామెంట్ పెట్టాడు. అది చూసిన నభా నటేష్ రెచ్చిపోయింది. మిస్టర్ కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చింది. ఒక తెలియని అమ్మాయిని డార్లింగ్ అని పిలవడం ఐపిసి సెక్షన్ 354 A ప్రకారం లైంగిన వేధింపుల కిందకు వస్తుందని గతంలో కలకత్తా కోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్నీ గుర్తు చేస్తూ పోస్ట్ పెట్టింది. అందుకు ప్రియదర్శి కూడా వెంటనే నభాకు కౌంటర్ ఇచ్చాడు.
`మనం ఒకరికొకరం తెలియదని నాకు తెలియదు. బై ద వే మీరేమో డార్లింగ్ అని పిలవొచ్చు.. మేము పిలిస్తే ఐపీసీ సెక్షన్ పెడతారా? లైట్ తీస్కో డార్లింగ్` అంటూ ప్రియదర్శి రిప్లై ఇచ్చాడు. దానికి `లైన్ క్రాస్ అవ్వొద్దు చూసుకుందాం` అని నభా నటేష్ రీకౌంటర్ ఇవ్వగా.. `వై దిస్ కొలవెరి` అంటూ ప్రియదర్శి ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. మొత్తానికి సరదాగా జరిగిన నభా నటేష్, ప్రియదర్శి ట్విట్టర్ వార్ నెట్టింట వైరల్ గా మారడంతో.. నెటిజర్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కాగా, సేవ్ ది టైగర్స్ సీజన్ 2 సక్సెస్ తో టాలీవుడ్ లో మరింత క్రేజ్ తెచ్చుకున్న ప్రియదర్శి ప్రస్తుతం హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో బిగ్ హిట్ అందుకున్న నిర్మాత నిరంజన్ రెడ్డి ఈ మూవీని తెరకెక్కిస్తుండగా.. నభా నటేష్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. ఓ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా ఇప్పుడు చిత్రీకరణ దశలో ఉంది.