NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

వైసీపీలో కీల‌క నాయ‌కులుగా ఉన్న ఇద్ద‌రు నేత‌ల‌ను మార్చ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ఆ పార్టీ సీని యర్లు. ఎందుకంటే.. ఈ ఇద్ద‌రు నేతల విష‌యంలో స‌ర్వేలు హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్నాయి. వీరు గెలిచే ప‌రిస్థితి లేద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టి మ‌రీ చెబుతున్నాయి. పోనీ.. ఏదో వైసీపీని వ్య‌తిరేకించే స‌ర్వే సంస్థ ఇలా చెప్పింద‌ని అనుకున్నా.. వైసీపీ అనుకూల స‌ర్వేలు కూడా.. ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఓట‌మి ఖాయ‌మ‌ని అంచ‌నా వేస్తున్నారు. దీంతో వైసీపీ అధిష్టానం ఆత్మ ర‌క్ష‌ణ‌లో ప‌డింది.

1) ఆముదాలవ‌ల‌స‌: ఉమ్మ‌డి శ్రీకాకుళంలోని ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి త‌మ్మినేని సీతారాం విజ‌యం ద‌క్కించుకున్నారు. దీంతో వైసీపీ అధినేత ఆయ‌న‌కు బీసీ కోటాలో స్పీక‌ర్ ప‌ద‌విని అప్ప‌గించారు. ఇక‌, ఇప్పుడు కూడా ఆయ‌న‌కే అవ‌కాశం ఇచ్చారు. ప్ర‌స్తుతం కీల‌క ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయ‌ని.. చెప్పి.. ఆయ‌న వార‌సుడికి కూడా టికెట్ తిర‌స్క‌రించారు. మొత్తంగా త‌మ్మినేని బ‌రిలో ఉన్నారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన స‌ర్వేల్లో ఇక్క‌డ టీడీపీ విజ‌యం ద‌క్కించుకుంటుంద‌ని తేలింది.

టీడీపీ నుంచి కూన ర‌వికుమార్ పోటీ చేస్తున్నారు. ఆయ‌న‌కు సానుభూతి పెరిగింద‌ని.. పార్టీ త‌ర‌ఫున బ‌ల మైన గ‌ళం కూడా వినిపించ‌డం.. పార్టీలో వ్య‌తిరేక‌త లేక‌పోవ‌డం వంటివి.. కూన‌కు ప్ల‌స్గామారితే.. త‌మ్మినే నికి ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌న్న‌ది స‌ర్వేల మాట‌. ఇక‌, స్పీక‌ర్‌గా చేసిన వారు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గెలిచిన సంద‌ర్భం లేదు. ఇదొక సెంటిమెంటుగా ఉంది. దీంతో ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో స్పీక‌ర్ త‌మ్మినేనిని త‌ప్పించి.. ఆయ‌న కుమారుడికే అవ‌కాశం ఇచ్చే ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

2) న‌గ‌రి: ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని ఈ సెగ్మెంట్ నుంచి మంత్రి రోజా ఇప్ప‌టి వ‌ర‌కు రెండు సార్లు విజ యం ద‌క్కించుకున్నారు. మూడోసారి కూడా విజ‌యం కోసం త‌పిస్తున్నా.. ఇక్క‌డ టీడీపీ గెలుపు ప‌క్కా అంటున్నాయి స‌ర్వే సంస్థ‌లు. ఇక్క‌డ కూడా ఒక‌టి రెండు కాదు. ఇప్ప‌టి వ‌ర‌కు స‌ర్వే చేసిన అన్ని సంస్థ‌లు కూడా.. రోజా గెలుపు సుల‌భం కాద‌ని తేల్చేశాయి. గాలిభాను ప్ర‌కాశ్ కు సానుభూతి పెరిగింద‌ని చెబుతున్నాయి. దీంతో ఈడిగ సామాజిక వ‌ర్గానికి చెందిన కేజే కుమార్‌కు లేదా. ఆయ‌న స‌తీమ‌ణికి.. ఇక్క‌డ టికెట్ ద‌క్కే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని వైసీపీ చెబుతోంది. బీఫారాల ఇచ్చే వ‌ర‌కు.. అనేక చోట్ల మార్పులు కూడా జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

Related posts

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju