NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

ప్ర‌స్తుత అసెంబ్లీ… పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు సంబంధించి ఏపీలో కూట‌మి పార్టీల్లో ఒక‌టైన‌.. జ‌న‌సేన కీల‌క ఘ‌ట్టానికి తెర‌దీసింది. మొత్తం 21 అసెంబ్లీ, 2 పార్ల‌మెంటు స్థానాల్లో పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే అభ్య‌ర్థుల‌ను కూడా ప్ర‌కటించారు. ప్ర‌చార ప‌ర్వం కూడా ఓ రేంజ్ లో సాగుతోంది. వాస్త‌వానికి.. ఇత‌ర పార్టీల‌కంటే కూడా.. 21 స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చాలా స‌మ‌య‌మే తీసుకున్నారు. ఆచి తూచి అడుగులు వేశారు.

కానీ, మ‌రో ముఖ్య ఘ‌ట్ట‌మైన‌.. బీఫారాల పంపిణీలో మాత్రం జ‌న‌సేన చాలా ముందుగా ఉంది. ఇత‌ర పార్టీ ల కంటే కూడా.. ముందుగానే త‌మ పార్టీ త‌ర‌ఫున బ‌రిలో ఉన్న వారికి బీ ఫారాలు అందించేసి.. ప్ర‌చారా న్ని మ‌రింత ముమ్మ‌రం చేసుకోవాల‌నే ఉద్దేశంతో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. దీంతో బుధ‌వారం ఫారాల పంపి ణీకి చేసింది. మొత్తం రెండు పార్ల‌మెంటు స్థానాల అభ్య‌ర్థుల‌ను, 21 అసెంబ్లీ స్థానాల అభ్య‌ర్థులకు మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాల‌యానికిరావాలంటూ.. వ‌ర్త‌మానం పంపించింది.

ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. స‌గంమంది కి పైగా అభ్య‌ర్థులు బీఫారాలు తీసుకునేందుకు విముఖత వ్య‌క్తం చేసిన‌ట్టు తెలిసింది. న‌వ‌మి రోజు రాలేమ‌ని.. పార్టీ కార్యాల‌యానికి వ‌ర్త‌మానం పంపారు. వీరిలో సెంటిమెంటు ఎక్కువ‌గా ఉన్న‌వారే ఉండ‌డం గ‌మ‌నార్హం. దీనికి వారు చెబుతున్న రీజ‌న్‌.. `బుధ‌వారం న‌వ‌మి. పైగా శ్రీరామ న‌వ‌మి. ఈ రోజు పుణ్య‌తిథే అయినా.. కొత్త కార్య‌క్ర‌మాలు ప్రారంభించేందుకు మంచిది కాదు. అందుకే.. రేపు(ద‌శ‌మి-గురువారం) వ‌స్తాం` అని తేల్చి చెప్పార‌ట‌.

కానీ, ప‌వ‌న్ మాత్రంఇప్ప‌టికే ఏర్పాట్లు పూర్తి చేసుకున్న ద‌రిమిలా.. ఖ‌చ్చితంగా రావాల్సిందేన‌ని ప‌ట్టు బ‌ట్ట‌డంతోనే వారు బీ ఫామ్ లు తీసుకునేందుకు వ‌చ్చిన‌ట్టు తెలిసింది. దీంతో న‌వ‌మి తిథి వెళ్లిపోయిన త‌ర్వాత‌.. సాయంత్రం వేళ‌లో కార్యాల‌యానికి చేరుకునే లా కొంద‌రు నాయ‌కులు ముహూర్తం పెట్టుకున్నారు. మొత్తంగా బీ ఫారాల వ్య‌వ‌హారం సెంటిమెంటు చుట్టూ తిరిగి.. ప‌వ‌న్‌ను టెన్ష‌న్‌ను పెట్టింది.

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

Breaking: అనంతలో ఎన్ఐఏ సోదాల కలకలం

sharma somaraju

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju