NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

Virat Kohli – Anushka Sharma: సెలబ్రిటీలు ప‌బ్లిక్‌లోకి ధైర్యంగా అడుగు పెట్టాలంటే వారి వెంట బాడీ గార్డ్స్ ఉండాల్సిందే. లేదంటే ప్ర‌జ‌లు వారిపై ఎగ‌బ‌డి ఉక్కిరి బిక్కిరి చేసేస్తారు. అందుకే బ‌య‌ట‌కు వెళ్లే ముందు బాడీ గార్డ్స్ ను వెంట పెట్టుకుని వెళ్తారు. ముఖ్యంగా ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో చాలా మంది హీరో, హీరోయిన్లు సొంత బాడీ గార్డ్ లను మెయింటేన్ చేస్తున్నారు. ఈ లిస్ట్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శ‌ర్మ కూడా ఒక‌రు. అనుష్క శ‌ర్మ ప‌ర్స‌న‌ల్ బాడీ గార్డ్ పేరు ప్రకాష్ సింగ్ అలియాస్ సోను. అనుష్కకు వివాహం జ‌ర‌గ‌డానికి ముందు నుంచే సోను ఆమె వ‌ద్ద‌ ప‌ని చేస్తున్నాడు. అనుష్క‌కు ఎంతో న‌మ్మ‌క‌మైన వ్య‌క్తిగా పేరు తెచ్చుకున్నాడు.

టీమిండియా మాజీ కెప్టెన్ మ‌రియు స్టార్ క్రికెట‌ర్‌ విరాట్ కోహ్లీని 2017లో అనుష్క శ‌ర్మ ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్ప‌టి నుంచి సోను అనుష్క‌తో పాటు విరాట్ కోహ్లీకి కూడా అంగరక్షకుడిగా సేవ‌లు అందిస్తున్నాడు. చాలా ఏళ్ల నుంచి విరుష్క దంప‌తుల‌ను ఎంతో జాగ్ర‌త్త‌గా చూసుకుంటున్నాడు. వృత్తి ప‌ట్ల సోనుకు ఉన్న అంకిత‌భావం కార‌ణంగా విరుష్క దంప‌తులు అత‌న్ని త‌మ‌ ఫ్యామిలీలో ఒక మెంబ‌ర్ గా భావిస్తాయి. ఎన్నోసార్లు అతని బర్త్‌డే వేడుకులను నిర్వ‌హించారు. ఇదిలా ఉంటే.. విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారుతుంది.

వివిధ నివేదికల ప్రకారం, సోను వార్షిక వేతనం రూ. 1.2 కోట్లు. అవును, మీరు చదివింది నిజమే. విరాట్ కోహ్లీ, అనుష్క శ‌ర్మ దంప‌తులు త‌మ బాడీ గార్డ్ కు ప్ర‌తి ఏడాది అక్ష‌రాల రూ. 1.2 కోట్లు జీతం ఇస్తున్నార‌ట‌. ఈ విష‌యం తెలిసి నెటిజ‌న్లు షాకైపోతున్నారు. సోను సంపాద‌న ముందు దేశంలోని చాలా టాప్ కంపెనీల సీఈఓలు కూడా ప‌నికిరారని అభిప్రాయ‌ప‌డుతున్నారు. కార్పొరేట్ లీడ‌ర్స్ కంటే సోను ఎక్కువ సంపాదిస్తున్నాడ‌ని అంటున్నారు.

కాగా, విరాట్ కోహ్లీ, అనుష్క శ‌ర్మ‌ల ల‌వ్ స్టోరీ గురించి తెలిసిందే. ఒక షాంపూ ప్ర‌క‌ట‌నలో తొలిసారి వీరిద్ద‌రూ క‌లిసి న‌టించారు. అలా ఏర్ప‌డిన వీరి ప‌రిచ‌యం కొద్ది రోజుల‌కే ప్రేమ‌గా మారింది. కొన్నాళ్లు ర‌హ‌స్యంగా ప్రేమాయాణాన్ని కొన‌సాగించిన విరాట్‌-అనుష్క‌.. ఆ త‌ర్వాత ప‌లు మార్లు జంట‌గా మీడియా కంట‌ప‌డి త‌మ రిలేష‌న్‌షిప్‌ను బ‌హిర్గ‌తం చేశారు. 2017లో ఇట‌లీ వేదిక‌గా వీరిద్ద‌రూ డెస్టినేష‌న్ వెడ్డింగ్ చేసుకున్నారు. అప్ప‌ట్లో ఎంతో వైభ‌వంగా వీరి వివాహం జ‌రిగింది.

పెళ్లి అనంత‌రం విరుష్క‌గా పాపుల‌ర్ అయిన ఈ జంట‌కు 2021లో వామిక అనే ముద్దుల కూతురు జ‌న్మించింది. రెండో సంతానంగా ఈ దంపతులు కొద్ది రోజుల క్రిత‌మే బేబీ బాయ్‌కు వెల్క‌మ్ చెప్పారు. సెకండ్ ప్రెగ్నెన్సీని చాలా సీక్రెట్ గా ఉంచిన అనుష్క శ‌ర్మ‌.. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 15న విదేశాల్లో మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మిచ్చింది. బిడ్డ పుట్టిన ఐదు రోజుల త‌ర్వాత విరాట్ కోహ్లీ ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడు. అలాగే బాబుకు అకాయ్ అని నామ‌క‌ర‌ణం చేసిన‌ట్లు స్ప‌ష్టం చేశాడు.

Related posts

YSRCP MLA: ఆ వైసీపీ ఎమ్మెల్యే ఈసీకి భలే దొరికిపోయారు(గా) ..! ఈవీఎంను పగులగొట్టిన దృశ్యాలు వైరల్

sharma somaraju

ACB Raids On ACP: ఏసీపీ నివాసంలో భారీగా బయటపడిన నగదు, నగలు .. కొనసాగుతున్న ఏసీబీ సోదాలు

sharma somaraju

CM Revanth Reddy: పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీ పడేలా నూతన పాలసీలు :  సీఎం రేవంత్ రెడ్డి

sharma somaraju

AP Election 2024: కొత్తపేటలో ఓటర్లకు నగదు పంపిణీపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

sharma somaraju

వినియోగదారుల స్వచ్చంద సంస్థలు, సంఘాలకు ఏపీ సర్కార్ కీలక హెచ్చరిక .. ఆ పదాలను వాడటం చట్టవిరుద్దం

sharma somaraju

Singapore Airlines: సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానంలో భారీ కుదుపులు ..ఒకరి మృతి.. 30 మందికి గాయాలు

sharma somaraju

కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల మృతి.. ఏపీ హోంమంత్రి తానేటి వనిత సంతాపం

sharma somaraju

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri