Virat Kohli – Anushka Sharma: సెలబ్రిటీలు పబ్లిక్‌లోకి ధైర్యంగా అడుగు పెట్టాలంటే వారి వెంట బాడీ గార్డ్స్ ఉండాల్సిందే. లేదంటే ప్రజలు వారిపై ఎగబడి ఉక్కిరి బిక్కిరి చేసేస్తారు. అందుకే బయటకు వెళ్లే ముందు బాడీ గార్డ్స్ ను వెంట పెట్టుకుని వెళ్తారు. ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరో, హీరోయిన్లు సొంత బాడీ గార్డ్ లను మెయింటేన్ చేస్తున్నారు. ఈ లిస్ట్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ కూడా ఒకరు. అనుష్క శర్మ పర్సనల్ బాడీ గార్డ్ పేరు ప్రకాష్ సింగ్ అలియాస్ సోను. అనుష్కకు వివాహం జరగడానికి ముందు నుంచే సోను ఆమె వద్ద పని చేస్తున్నాడు. అనుష్కకు ఎంతో నమ్మకమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు.
టీమిండియా మాజీ కెప్టెన్ మరియు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని 2017లో అనుష్క శర్మ ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి సోను అనుష్కతో పాటు విరాట్ కోహ్లీకి కూడా అంగరక్షకుడిగా సేవలు అందిస్తున్నాడు. చాలా ఏళ్ల నుంచి విరుష్క దంపతులను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. వృత్తి పట్ల సోనుకు ఉన్న అంకితభావం కారణంగా విరుష్క దంపతులు అతన్ని తమ ఫ్యామిలీలో ఒక మెంబర్ గా భావిస్తాయి. ఎన్నోసార్లు అతని బర్త్‌డే వేడుకులను నిర్వహించారు. ఇదిలా ఉంటే.. విరుష్క దంపతుల బాడీ గార్డ్ జీతం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారుతుంది.
వివిధ నివేదికల ప్రకారం, సోను వార్షిక వేతనం రూ. 1.2 కోట్లు. అవును, మీరు చదివింది నిజమే. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు తమ బాడీ గార్డ్ కు ప్రతి ఏడాది అక్షరాల రూ. 1.2 కోట్లు జీతం ఇస్తున్నారట. ఈ విషయం తెలిసి నెటిజన్లు షాకైపోతున్నారు. సోను సంపాదన ముందు దేశంలోని చాలా టాప్ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారని అభిప్రాయపడుతున్నారు. కార్పొరేట్ లీడర్స్ కంటే సోను ఎక్కువ సంపాదిస్తున్నాడని అంటున్నారు.
కాగా, విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల లవ్ స్టోరీ గురించి తెలిసిందే. ఒక షాంపూ ప్రకటనలో తొలిసారి వీరిద్దరూ కలిసి నటించారు. అలా ఏర్పడిన వీరి పరిచయం కొద్ది రోజులకే ప్రేమగా మారింది. కొన్నాళ్లు రహస్యంగా ప్రేమాయాణాన్ని కొనసాగించిన విరాట్-అనుష్క.. ఆ తర్వాత పలు మార్లు జంటగా మీడియా కంటపడి తమ రిలేషన్‌షిప్‌ను బహిర్గతం చేశారు. 2017లో ఇటలీ వేదికగా వీరిద్దరూ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. అప్పట్లో ఎంతో వైభవంగా వీరి వివాహం జరిగింది.
పెళ్లి అనంతరం విరుష్కగా పాపులర్ అయిన ఈ జంటకు 2021లో వామిక అనే ముద్దుల కూతురు జన్మించింది. రెండో సంతానంగా ఈ దంపతులు కొద్ది రోజుల క్రితమే బేబీ బాయ్‌కు వెల్కమ్ చెప్పారు. సెకండ్ ప్రెగ్నెన్సీని చాలా సీక్రెట్ గా ఉంచిన అనుష్క శర్మ.. ఈ ఏడాది ఫిబ్రవరి 15న విదేశాల్లో మగబిడ్డకు జన్మిచ్చింది. బిడ్డ పుట్టిన ఐదు రోజుల తర్వాత విరాట్ కోహ్లీ ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడు. అలాగే బాబుకు అకాయ్ అని నామకరణం చేసినట్లు స్పష్టం చేశాడు.