కొన్ని కాంబినేషన్స్ సినిమా ఇండస్ట్రీలో చాలా ఆసక్తిని కలిగిస్తుంటాయి. అలాంటి ఆసక్తికరమైన కాంబినేషన్లో ఒకటి త్వరలోనే వెండితెరపై రానుంది. అదెవరో కాదు.. నందమూరి బాలకృష్ణ, దిల్‌రాజు కాంబినేషన్. ఎన్నో విజయవంతమైన చిత్రాలు.. నేటి సూపర్‌స్టార్స్‌తో నిర్మించిన దిల్‌రాజు ఇప్పటి వరకు బాలకృష్ణతో దిల్‌రాజు సినిమా చేయలేదు. కానీ బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించబోయే చిత్రానికి దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరించున్నారని టాక్. సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ మూవీని ముందుగా బాలకృష్ణే నిర్మించాలని అనుకున్నాడు. కానీ నిర్మాతగా ఆయన చేసిన తొలి ప్రయత్నం ‘యన్.టి.ఆర్’ బాక్సాఫీస్ వద్ద పరాజయం కావడంతో.. బాలకృష్ణ నిర్మాతగా మరో సాహసం చేయలేకపోయాడు. తర్వాత సి.కల్యాణ్ పేరు వినపడింది. కానీ బడ్జెట్ వ్యవహారంలో బోయపాటి కాంప్రమైజ్ కాలేక .. దిల్‌రాజుని కలిశాడట. దిల్‌రాజు బాలకృష్ణ, బోయపాట హ్యాట్రిక్ కాంబోకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని అంటున్నారందరూ. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన సమాచారం వెలువడనుంది.
previous post
next post