NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్(కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్)లో ఊరట కలిగింది. ఏబీ వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయాలని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాదు వెంటనే సర్వీస్ లోకి తీసుకోవాలని రావాల్సిన ఏరియర్స్ మొత్తం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం రెండోసారి సస్పెండ్ చేయడం చట్ట విరుద్ధమని స్పష్టం చేయడం జరిగింది. ఒకే కారణంతో తనని రెండుసార్లు ప్రభుత్వం సస్పెండ్ చేసినట్లు వెంకటేశ్వరరావు క్యాట్ లో సవాల్ చేశారు. దీనిపై గతంలో వాదనల పూర్తికావడంతో క్యాట్ తీర్పు రిజర్వ్ చేయడం జరిగింది. తాజాగా ఈ పిటిషన్ పై ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట కలిగించేలా తీర్పు ఇవ్వడం సంచలనంగా మారింది.

Big relief for AB Venkateswara Rao, the former chief of AP Intelligence

దేశాత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వెంకటేశ్వరరావు సస్పెన్షన్ చట్టవిరుద్దమని చెప్పిన తర్వాత కూడా రెండోసారి సస్పెండ్ చేయటం ఉద్యోగిని వేధించడమేనని క్యాట్ పేర్కొంది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రక్షణ పరికరాల కొనుగోలులో అక్రమాలు జరిగాయని ఆరోపణలు కారణంగా ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెండ్ చేయడం జరిగింది. కేంద్ర హోం శాఖ కూడా దీనిని ధ్రువీకరించింది. ఈ పరిణామంతో వెంకటేశ్వరరావు క్యాట్ ను ఆశ్రయించగా క్యాట్ సస్పెన్షన్ ను సమర్ధించడం జరిగింది. ఆ సమయంలో వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఏబీవీ సస్పెన్షన్ కొట్టేసింది.

Big relief for AB Venkateswara Rao, the former chief of AP Intelligence

ఈ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సర్వీసులో ఉన్న అధికారిని రెండేళ్ల కంటే ఎక్కువ కాలం సస్పెన్షన్ లో ఉంచవద్దని ఆదేశిస్తూ ఏబీవీని విధుల్లోకి తీసుకోవాలని సుప్రీం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీమ్ ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం వెంకటేశ్వరరావును విధుల్లోకి తీసుకోవడం జరిగింది. అయితే కొంతకాలానికే తిరిగి అదే కారణం చెబుతూ సస్పెండ్ చేసింది. దీంతో వెంకటేశ్వరరావు మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘ విచారణ అనంతరం క్యాట్ బుధవారం తుది తీర్పు ఇస్తూ.. రాష్ట్ర ప్రభుత్వాన్ని విధుల్లోకి తీసుకోవాలని సూచించింది. అంతేకాదు సస్పెన్షన్ కాలానికి జీతభత్యాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని క్యాట్ ఆదేశించడం జరిగింది.

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?