NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీలో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం .. భారత చైతన్య యువజన పార్టీగా ప్రకటించిన రామచంద్ర యాదవ్

ఏపీలో మరో నూతన రాజకీయ పార్టీ ఏర్పాటు అయ్యింది. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గానికి చెందిన పారిశ్రామిక వేత్త రామచంద్ర యాదవ్ నేతృత్వంలో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) పేరుతో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. గుంటూరు – విజయవాడ జాతీయ రహదారిలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ప్రజా సింహగర్జన పేరుతో ఆదివారం రామచంద్ర యాదవ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికగా రామచంద్ర యాదవ్ కొత్త రాజకీయ పార్టీ పేరును ప్రకటించారు.

Ramachandra Yadav

ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ తన ప్రసంగంలో ఇప్పటి వరకూ రాష్ట్రాన్ని పాలించిన పాలకులను విమర్శించారు. పార్టీలు మారుతున్నా, పాలకులు మారుతున్నా ప్రజల తరరాతలు మారడం లేదని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు, యువత, మహిళలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరగకపోవడంతో యువత ఉపాధి అవకాశాలకు పొరుగు రాష్ట్రాలకు వలస వెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  రాష్ట్రంలో ప్రస్తుతం దోపిడీ. దుర్మార్గ పాలన సాగుతోందని విమర్శించారు. రాష్ట్రంలో రైతులు, యువత, మహిళలు ఇలా ఏ వర్గం సంతోషంగా లేదని అన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దాడులు పెరిగాయన్నారు. జగన్ పాలన పురాణాల్లో రాక్షసుల పాలన గుర్తు చేస్తొందని రామచంద్ర యాదవ్ విమర్శించారు.

వైసీపీలో పెద్దల నుండి కార్యకర్తల వరకూ అందరూ దోచుకుంటున్నారని ఆరోపించారు.  రాష్ట్రంలో ప్రైవేటు భూములు, ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. కుటుంబ, దోపిడీ పార్టీలకు చరమగీతం పాడాలన్నారు. ఇప్పటి వరకూ వెన్నుపోటు పార్టీలకు, దోపిడీ పార్టీలకు అవకాశం ఇచ్చారనీ, భావి తరాల భవిష్యత్తు, రాష్ట్ర ప్రగతికి ఒక్క సారి భారత చైతన్య యువజన పార్టీకి ప్రజలు అవకాశం ఇవ్వాలని రామచంద్ర యాదవ్ కోరారు. ఈ సభలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్, సూరజ్ మండల్ లు తదితరులు పాల్గొని ప్రసంగించారు. తొలుత ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వివిధ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో బహిరంగ సభకు హజరైయ్యారు.

Breaking: వైఎస్ వివేకా కేసులో కీలక పరిణామం .. మాజీ విచారణ అధికారి రామ్ సింగ్ పై సీబీఐ డైరెక్టర్ కు ఎంపీ అవినాష్ రెడ్డి ఫిర్యాదు

Related posts

AP Election 2024: కొత్తపేటలో ఓటర్లకు నగదు పంపిణీపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

sharma somaraju

వినియోగదారుల స్వచ్చంద సంస్థలు, సంఘాలకు ఏపీ సర్కార్ కీలక హెచ్చరిక .. ఆ పదాలను వాడటం చట్టవిరుద్దం

sharma somaraju

Singapore Airlines: సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానంలో భారీ కుదుపులు ..ఒకరి మృతి.. 30 మందికి గాయాలు

sharma somaraju

కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల మృతి.. ఏపీ హోంమంత్రి తానేటి వనిత సంతాపం

sharma somaraju

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

Breaking: అనంతలో ఎన్ఐఏ సోదాల కలకలం

sharma somaraju

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?