NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం పైనే ఉంది. పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కచ్చితంగా గెలవాల్సిందే. ప్రస్తుత సిచువేషన్ కూడా అదే సూచిస్తోంది. ఒకవేళ పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతే.. జనసేన పార్టీ తరఫున ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచిన…. రాపాక తరహాలోనే వ్యవహరిస్తారాన్నది సత్యం. లేకపోతే జనసేన పార్టీ మొత్తం ఖాళీ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి పార్టీలో కూడా… అధినేత ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా గెలవాల్సిందే. ఇప్పుడు అదే పరిస్థితి పవన్ కళ్యాణ్ ముందు ఉంది. దీంతో పిఠాపురం నియోజకవర్గంలో ఎలాగైనా గెలిచేందుకు మొదటి నుంచి పవన్ కళ్యాణ్ చాలా ఫోకస్ పెడుతున్నారు.

గతంలో చేసిన తప్పిదాలను అధిగమిస్తూ… కొత్త కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు పవన్ కళ్యాణ్.
తనకు అనుకూలించే వారందరితో సఖ్యత మైంటైన్ చేస్తూ… ముందుకు సాగుతున్నారు. కాపులు ఎక్కువగా ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో… ఓట్లు చీలకుండా తనవైపు అందరూ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దీనికి తోడు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు అందరూ పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేస్తున్నారు. తాజాగా చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ కు మాత్రమే ఓటు వేయాలని పిఠాపురం నియోజకవర్గ ప్రజలను కోరారు.

ఇలాంటి నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఊహించని షాక్ తగిలింది. పవన్ కళ్యాణ్ కు ఓటు వేయద్దు అంటూ టిడిపి పిఠాపురం ఇన్చార్జి వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అనుచరులతో తాజాగా వర్మ సమావేశమయ్యారు. అయితే ఈ సందర్భంగా… పవన్ కళ్యాణ్ కు ఓటు వేయొద్దు అంటూ వర్మ మాట్లాడిన ఓ వీడియో క్లిప్ వైరల్ గా మారింది. అయితే అతడు అంతకు ముందు ఏం మాట్లాడాడు… తర్వాత ఏం మాట్లాడాడు అనే విషయాన్ని కట్ చేశారు.

కేవలం పవన్ కళ్యాణ్ను మాత్రం ఓడించాల్సిందే అంటూ వర్మ మాట్లాడిన ఒక్క వ్యాఖ్యను కట్ చేసి… వీడియోలో వైరల్ చేశారు. దీంతో పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. నిజంగానే పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వర్మ పని చేస్తున్నాడా ? అని అందరూ అనుకుంటున్నారు. ఒకవేళ వర్మ ప్లేట్… ఫిరాయిస్తే పవన్ కళ్యాణ్ కచ్చితంగా ఓడిపోతారని అంటున్నారు. మొన్నటికి మొన్న వర్మ వైసిపి పార్టీలోకి వెళ్తారని ప్రచారం కూడా జరిగిన సంగతి తెలిసిందే. కానీ దానికి వర్మ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి… జనసేనలో చేరుతారని సేటార్లు పేల్చారు వర్మ.

కానీ తాజాగా వర్మ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపుతున్నాయి. ఇలా వరుసగా పవన్ కళ్యాణ్ నియోజకవర్గం లో జరగడం జనసేన కార్యకర్తల్లో అలజడి నెలకొంటోంది. ఒకవేళ ఈ వీడియో క్లిప్ పై వర్మ క్లారిటీ ఇవ్వకపోతే… పవన్ కళ్యాణ్ సీట్ చిరగడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు. మరి దీనిపై వర్మ ఎలా స్పందిస్తారో చూడాలి. కాగా టిడిపి తరఫున పిఠాపురం నుంచి వర్మ పోటీ చేయాలనుకుని సైడ్ అయిపోయిన సంగతి తెలిసిందే.

Don't vote for Pawan Kalyan... Shocking twist given by Verma..!
Don’t vote for Pawan Kalyan… Shocking twist given by Verma..!

Related posts

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?

Chandrababu: అమెరికా వెళ్లిన చంద్రబాబు దంపతులు .. ఎందుకంటే..?

sharma somaraju

ఏపీలో ఎవ‌రు గెలిచినా.. ఎవ‌రు ఓడినా… వీరికి మంత్రి ప‌ద‌వులు…!

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N