NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: రేపు విజయవాడలో వైసీపీ పదాధికారుల సమావేశం .. ఎన్నికల సన్నద్ధతపై దిశానిర్దేశం చేయనున్న సీఎం జగన్

YSRCP: పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు గానూ మండల స్థాయి నాయకత్వంతో రేపు విజయవాడలో వైసీపీ సమావేశం నిర్వహిస్తొంది. విజయవాడ ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియం నందు జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర నలుమూల నుండి పార్టీ శ్రేణులు భారీగా హజరుకానున్నారు. మొత్తం 8,222 మంది ప్రతినిధులు హజరయ్యే అవకాశం ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ కోఆర్డినేటర్ లు, సమన్వయకర్తలు, మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఎంపీపీలు సహా మండల పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, పార్టీ పరమైన పదవుల్లో ఉన్న వారు , పార్టీ అనుబంధ సంఘాల నేతలు హజరవుతారు.

CM YS Jagan

ఇది పూర్తిగా ఆహ్వానితులతోనే జరుగుతున్న సమావేశమనీ, బహిరంగ సభ కాదని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. మండల స్థాయిలో సంస్థాగతంగా అన్ని రకాలుగా లీడ్ చేయగలిగిన లీడర్ షిప్ తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంటరాక్షన్ ఉంటుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మండల స్థాయి నేతలు, ప్రజా ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తుండటంతో ఆయా నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఎన్నికలకు క్యాడర్ సమాయత్తం చేసేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.

YSRCP

రానున్న రోజుల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై పార్టీ శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. సమావేశానికి హజరయ్యే నేతలు పార్టీ అధినేత జగన్ ఆలోచనలు, ప్రభుత్వం నాలుగేళ్లుగా చేసిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తారని సజ్జల వివరించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే వారిగా, తర్వాత ఎన్నికల వరకూ జరిగే కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో లీడ్ చేసే వారిగా నేతలకు ఈ సమావేశం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. వారిలో నూతనోత్సాహాన్ని నింపుతుందని, వారికి చాలా అంశాలపై స్పష్టత వస్తుందని చెప్పారు.

ఇప్పటి వరకూ సీఎం జగన్ గడపగడపకు మన ప్రభుత్వం వర్క్ షాప్ లను ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్చిలు, ఎంపీలు, పార్టీ కోఆర్డినేటర్ లతోనే సమావేశాలను నిర్వహించగా, ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మండల స్థాయి పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు, అనుబంధ సంఘాలతో తొలి సారిగా సమావేశం నిర్వహిస్తున్నారు.

Navneet Kaur Rana: ఏపీ మంత్రి రోజాకు అండగా మహారాష్ట్ర ఎంపీ, మాజీ నటి నవనీత్ కౌర్ రాణా.. టీడీపీ మాజీ మంత్రి బండారుపై ఫైర్

Related posts

వినియోగదారుల స్వచ్చంద సంస్థలు, సంఘాలకు ఏపీ సర్కార్ కీలక హెచ్చరిక .. ఆ పదాలను వాడటం చట్టవిరుద్దం

sharma somaraju

Singapore Airlines: సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానంలో భారీ కుదుపులు ..ఒకరి మృతి.. 30 మందికి గాయాలు

sharma somaraju

కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల మృతి.. ఏపీ హోంమంత్రి తానేటి వనిత సంతాపం

sharma somaraju

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

Breaking: అనంతలో ఎన్ఐఏ సోదాల కలకలం

sharma somaraju

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?