NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Navneet Kaur Rana: ఏపీ మంత్రి రోజాకు అండగా మహారాష్ట్ర ఎంపీ, మాజీ నటి నవనీత్ కౌర్ రాణా.. టీడీపీ మాజీ మంత్రి బండారుపై ఫైర్

Share

Navneet Kaur Rana: ఏపీ మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలను మహిళా లోకం ముక్తకంఠంతో ఖండిస్తొంది. రోజాకు మద్దతుగా పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. అండగా ఉంటామని ప్రకటిస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర ఎంపీ, మాజీ నటి నవనీత్ కౌర్ రాణా సైతం రోజాకు అండగా నిలిచారు. మాజీ మంత్రి బండారు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సెల్ఫీ వీడియో తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్టు చేశారు.

బండారు .. అసలు సిగ్గు ఉందా.. మంత్రి రోజాపై ఇంత దిగజారి మాట్లాడావా అంటూ ఫైర్ అయ్యారు. మీ ఇంట్లో భార్య, చెల్లి, కూతురు లేరా . తెలుగు రాష్ట్రాల్లో మహిళలను చాల గౌరవిస్తారన్నారు. కానీ ఈ బండారు మహిళల గౌరవాన్ని తగ్గిచేలా మాట్లాడారన్నారు. నీకు రాజకీయాలు ముఖ్యమా.. లేకుంటే మహిళల గౌరవం ముఖ్యమా..ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి అని నవనీత్ కౌర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఎంపీగా, నటిగా, మహిళగా తాను మంత్రి రోజాకు అండగా ఉంటానని అన్నారు.

తానే కాదు యావత్ మహిళాలోకం రోజాకు ఉండగా ఉంటుందని అన్నారు.  రోజా సినీ పరిశ్రమకు సేవలందించారనీ, ఎందరో స్టార్ హీరోల సరసన నటించారన్నారు. ఆమెను తలా కించపర్చడం సరికాదని అన్నారు. రాజకీయాల్లో ఇంతగా దిగజారి మాట్లాడటం మంచిది కాదని హితవు పలికారు. ఇప్పటికే సినీ పరిశ్రమ నుండి రోజాకు కుష్బూ సుందర్, రాధికా శరత్ కుమార్ మద్దతుగా స్పందించారు.

PM Modi: ఇజ్రాయెల్ కు అండగా నిలుస్తామని ప్రకటించిన ప్రధాని మోడీ

 


Share

Related posts

CM Jagan: గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ తో సీఎం జగన్ భేటీ ..! ఇదీ కారణం..!?

somaraju sharma

జగన్‌కు సినీనటుల బాసట

somaraju sharma

Raja Raja Chora: ఆకట్టుకుంటున్న “రాజ రాజ చోర” టీజర్..!!

bharani jella