NewsOrbit
జాతీయం న్యూస్

PM Modi: ఇజ్రాయెల్ కు అండగా నిలుస్తామని ప్రకటించిన ప్రధాని మోడీ

Share

PM Modi: ఇజ్రాయెల్ లోని చొరబడిన హమాస్ మిలిటెంట్లు దేశ వ్యాప్తంగా పలు చోట్ల దాడులకు దిగారు. వీరిని ఇజ్రాయెల్ సైన్యం తీవ్రంగా ప్రతిఘటిస్తొంది. కాల్పుల శబ్దాలతో దేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 50 మంది మృతి చెందగా, వందలాది మంది గాయపడ్డారు. ఒకే సారి 5వేల మిసైల్స్ దాడి జరిగింది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. మరో పక్క ఇజ్రాయెల్ లో హమాస్ మిలిటెంట్ల హింసాత్మక దాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.

PM Modi

తాజాగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దీనిపై స్పందిస్తూ తీవ్ర విచారణ వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ కు అండగా ఉంటామని ప్రకటించారు. ఇజ్రాయెల్ లో ఉగ్రవాదులు భీకర దాడుల వార్తలు విని తీవ్ర దిగ్భంతికి లోనయ్యా. ఈ సమాయంలో మా ఆలోచనలు, ప్రార్థనలన్నీ.. భాధిత పౌరులు, వారి కుటుంబాల గురించే. ఈ విపత్కర పరిస్థితుల్లో మేం ఇజ్రాయెల్ కు అండగా నిలబడుతాం అని మోడీ ట్వీట్ చేశారు.

అటు అగ్రరాజ్యం అమెరికా కూడా హమాస్ దాడిని తీవ్రంగా ఖండించింది. ఇజ్రాయెల్ ప్రభుత్వానికి తాము అండగా ఉంటామనీ, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు వెల్లడించారు.

Ambati Rambabu: కృష్ణా జలాల వివాదంపై మరో సారి సుప్రీం కోర్టును ఆశ్రయించనున్న ఏపీ సర్కార్


Share

Related posts

Mask: ఇలాంటి మాస్క్ లతో బ్లాక్ ఫంగస్…నిర్లక్ష్యం వద్దు !!

siddhu

రేపటి నుండి యధావిధిగా ప్రభుత్వ ఆఫీసులు

somaraju sharma

మరో సారి తన దొడ్డ మనసును చాటుకున్న సీఎం జగన్ .. చిన్నారి వైద్య సాయానికి కోటి మంజూరు

somaraju sharma