NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Ambati Rambabu: కృష్ణా జలాల వివాదంపై మరో సారి సుప్రీం కోర్టును ఆశ్రయించనున్న ఏపీ సర్కార్

Share

Ambati Rambabu: కృష్ణా నదీ జలాలను రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కు కొత్త విధివిధాలను ప్రతిపాదించింది. ఈ నెల 4న కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం మేరకు శుక్రవారం రాత్రి గెజిట్ నోటిపికేషన్ జారీ చేసింది. అంతర్ రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార చట్టంలోని సెక్షన్ 3,5(1), 12లను అనుసరించి ట్రైబ్యునల్ కు రెండు విధివిధానాలను ప్రతిపాదించాలని నిర్ణయించినట్లు కేంద్ర జలశక్తి శాఖ ఈ నోటిఫికేషన్ లో పేర్కొంది. కృష్ణా జల వివాద పరిష్కార ట్రైబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన 811 టీఎంసీలు, దానికి అతీతంగా కేటాయించిన అదనపు జలాలు, పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణాకు తరలించడానికి వీలుగా గోదావరి ట్రైబ్యునల్ సమైక్య రాష్ట్రానికి చేసిన కేటాయింపుల్లోని వాటాను రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసేలా కేంద్ర ప్రభుత్వం ఈ ట్రైబ్యునల్ కు విధివిధానాలు ప్రతిపాదించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని ఈ విషయంలో తదుపరి చర్యలను నిలిపివేయాలని కోరుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి వినతి పత్రం ఇచ్చారు. అదే విధంగా ప్రధాని మోడీకి లేఖ కూడా రాశారు. తాజా విధివిధానాల నుండి మహారాష్ట్ర, కర్ణాటకలను మినహాయించి కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణకే పరిమితం చేయడం భావ్యం కాదని పేర్కొన్నారు. కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్ 2 కు మరిన్ని విధివిధానాల జారీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం ఏపీ ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసిందని ప్రధాని మోడీ దృష్టికి తీసుకువెళ్లారు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో అయిదు ఎస్ఎల్పీలు పెండింగ్ లో ఉన్నాయని, ఈ సమస్య గురించి 2021 ఆగస్టు 17, 2022 జూన్ 25 న కేంద్ర జలశక్తి మంత్రి దృష్టికి తీసుకొచ్చామని పేర్కొన్నారు.

2014 జూలై 14న తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుని ఈ విధివిధానాలను కేవలం కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేశారని లేఖలో పేర్కొన్నారు. ఈ నిర్ణయం కృష్ణానది పరివాహకంపై ఆధారపడిన ఏపీ ప్రజల ప్రయోజనాలకు విఘాతం కల్గించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ వాటాల పంపిణీపై ట్రైబ్యునల్ తుది నిర్ణయం వెలువరించడానికి ఎలాంటి గడువూ విధించలేదు. ఈ అంశంపై ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు  స్పందించారు.

శనివారం మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణాజలాల పై ఉన్న అడ్డంకులను తొలగించాల్సిందిగా కేంద్రాన్ని కోరామని చెప్పారు. కృష్ణాజలాల పునః పంపిణీని ఆపేయాలని కోరామని, ఈ మేరకు ప్రధానికి సీఎం జగన్ లేఖ రాశారన్నారు. రాష్ట్రానికి నష్టం జరిగే విధానాన్ని తాము ఒప్పుకోమని అన్నారు. కృష్ణాజలాలపై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. కృష్ణా జలాల కోసం సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని, కొత్త గా విధివిధానాలు రూపొందించడానికి ఒప్పకోమని చెప్పారు. ఏపీకి రావాల్సిన ప్రతి నీటి బొట్టును తీసుకుంటామని, అన్యాయంగా తీసుకెళ్తామంటే ఒక్క నీటి బొట్టును కూడా వదులుకోమని స్పష్టం చేశారు.

Israel: ఇజ్రాయిల్ లో యుద్ధ మేఘాలు.. వేలాది రాకెట్లను ప్రయోగించిన హమాస్ సంస్థ..50 మందికిపైగా మృతి


Share

Related posts

Pawan kalyan : పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ టైటిల్‌తో విద్యాబాలన్ బాలీవుడ్ మూవీ..రీమేక్ చేస్తున్నారా..?

GRK

Pawan Kalyan: పవన్ భేటీ అంతరార్థం ఏమిటి..!? “కాపు” కాస్తున్నట్టేనా..!?

Muraliak

Easwar Mahadev Temple: ఆ ఆలయంలో ప్రతి రోజు తెల్లవారుజాము నాలుగు గంటలకు జరిగే అధ్బుతం ఎప్పటికీ మిస్టరీనే..! అది ఏమిటంటే..?

bharani jella