NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ ప్ర‌పంచం

Israel: ఇజ్రాయిల్ లో యుద్ధ మేఘాలు.. వేలాది రాకెట్లను ప్రయోగించిన హమాస్ సంస్థ…50 మందికిపైగా మృతి

Share

Israel: ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఈ ఉదయం గాజా నుండి ఇజ్రాయిల్ పైకి వేలాది రాకెట్లు దూసుకొచ్చాయి. అటు పాలస్తీనా కు చెందిన ఇస్లామిక్ గ్రుపు హమాస్ మిలిటెంట్లు చొరబాటుకు దిగారు. గాజా స్ట్రిప్ ప్రాంతం నుండి ఇజ్రాయిల్ వైపు డజన్ల కొద్దీ మిస్సెల్స్ విరుచుకుపడ్డాయి. ఇళ్లు, భవనాలపై దూసుకొచ్చిన రాకెట్ల దాడుల్లో 50 మంది మరణించగా, వందలాది మంది గాయపడినట్లు తెలుస్తొంది. దీంతో అప్రమత్తమైన ఇజ్రాయిల్ సైన్యం ప్రతిదాడికి దిగింది. ఆ వెంటనే సైరన్లు మోగించి, గాజా సరిహద్దులో ఎమర్జెన్సీ ప్రకటించింది.

గాజా, గ్రేటర్ టెల్ అవీవ్ ప్రాంతం నుండి పెద్ద ఎత్తున పేలుళ్ల శబ్దం వినిపించడంతో ఇజ్రాయిల్ సైన్యం అప్రమత్తమై యుద్ధ స్థితిని ప్రకటించింది. తాజా పరిణామాలతో ఇజ్రాయెల్ లో యుద్ద మేఘాలు అలుముకున్నట్లు సైన్యం ప్రకటించింది. ఏ క్షణమైనా యుద్ధానికి తాము సిద్దంగా ఉన్నామని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. దేశ దక్షిణ, మధయ్ ప్రాంతాల్లో గంటకు పైగా ఫైర్ సైరన్ మోగించి ప్రజలను హెచ్చరించింది. అనేక మంది ఉగ్రవాదులు ఇజ్రాయిల్ భూభాగంలోకి చొరబడ్డారని పేర్కొంది. ప్రజలు ఇళ్లు లేదా బాంబు షెల్టర్ల వద్ద ఉండాలని కోరింది.

ఇజ్రాయిల్ పై మిలిటరీ ఆపరేషన్ ప్రారంభించామని హమాస్ మిలటరీ వింగ్ హెడ్ మొహమ్మద్ డెయిఫ్ ప్రకటించారు. ఈ తెల్లవారుజామున ఆపరేషన్ ఆల్ – అక్సా స్ట్రామ్ ప్రారంభమైందని, ఇప్పటి వరకూ 5వేల రాకెట్లను ప్రయోగించామని డెయిఫ్ చెప్పినట్లు ఓ వీడియో సందేశం బయటికి వచ్చింది. రాకెట్ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇందులో ఇజ్రాయిల్ సరిహద్దు పట్టణమైన స్డెరోట్ లో కాల్పుల శబ్దం వినబడుతోంది. మరో వీడియోలో గాజా స్ట్రిప్ సరిహద్దులో హమాస్, పాలస్తీనా మిలిటెంట్లు ఇజ్రాయిల్ మిటలరీ ట్యాంక్ ను స్వాధీనం చేసుకుని తగలబెడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

ఇక ఇజ్రాయిల్ దేశంలోని ఎంత మంది ఉగ్రవాదులు చొరబడ్డారు అనేది స్పష్టంగా తెలియలేదు. ప్రస్తుతం హమాస్, ఇజ్రాయిల్ మధ్య కాల్పులతో భీకరపోరు నడుస్తున్నట్లు తెలుస్తొంది. ఈ దాడుల్లో పలువురు సామాన్య ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మృతుల సంఖ్య భారీగా ఉండవచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అటు సరిహద్దుపై ఇజ్రాయిల్ సైన్యం నియంత్రణ కోల్పయినట్లు సమాచారం.

ED Notice To Navdeep: టాలీవుడ్ హీరో నవదీప్ కు నోటీసులు జారీ చేసిన ఈడీ


Share

Related posts

Flash News: తెలంగాణ మంత్రుల పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఏపీ సీఎం జగన్..!!

P Sekhar

2020 వరకూ కేజ్రీవాలే

Siva Prasad

ఖర్చు లేకుండానే మీ ఇంటికి సీసీ టీవీని పెట్టుకోవచ్చు

Kumar