NewsOrbit
Entertainment News సినిమా

Pawan Kalyan: పవన్ కళ్యాణ్… ఆలీ మధ్య జరిగిన గొడవ పై క్లారిటీ ఇచ్చిన నాగబాబు..!!

Share

Pawan Kalyan: తెలుగు చలనచిత్ర రంగంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమెడియన్ ఆలీ జోడి సన్నివేశాలు వెండితెరపై బాగా పండుతాయి. పవన్ కూడా తన సినిమాలలో ఆలీకి స్పెషల్ రోల్ ఉండేలా చూసుకునే అంత స్నేహం ఉంది. వీరి కాంబినేషన్ సన్నివేశాలు.. ప్రేక్షకులు ఎంతగానో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇండస్ట్రీలో మంచి దోస్తులైన వీరిద్దరూ రాజకీయాల్లోకి ఎప్పుడొచ్చారో వీరి దారులు వేరయ్యాయి. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించినప్పటికీ ఆలీ పార్టీలో జాయిన్ అవ్వలేదు. పని 2019 ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ సమయంలో ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్… అలీ మధ్య మాటలు యుద్ధం జరిగింది. ఆలీ సొంతూరు రాజమండ్రిలో.. పవన్ కళ్యాణ్ కొన్ని కామెంట్లు చేయడం జరిగింది.

Nagababu gave clarity on the fight between Pawan Kalyan Ali

తన దగ్గర ఆలీ సాయం పొందాడని కానీ రాజకీయాల్లో ఎలా చేస్తాడని అనుకోలేదని కొద్దిగా నెగటివ్ గా మాట్లాడారు. దీంతో ఆలీ అప్పుడు తాను ఇండస్ట్రీలో స్వయంకృషితో ఎదిగినట్లు ఎవరి దగ్గర సాయం పొందలేదని పవన్ కి కౌంటర్ ఇవ్వడం జరిగింది. అప్పటినుండి వీరిద్దరి మధ్య దూరం పెరిగింది. ఆ తర్వాత వైసీపీ పార్టీ అధికారంలోకి రావడంతో ప్రస్తుతం మాలి ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో త్వరలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కొద్ది నెలల క్రితం అవసరమైతే పవన్ కళ్యాణ్ పై కూడా పోటీ చేయడానికి సిద్ధమే అన్నట్టు ఆలీ వ్యాఖ్యానించారు. పరిస్థితి ఇలా ఉంటే పవన్ అలీ మధ్య వివాదాల గురించి నాగబాబు ఇటీవల ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ ఆలీ ఇద్దరు కూడా మంచి స్నేహితులు. వారి మధ్య ఎలాంటి గొడవ జరగలేదు. ఆలీ వేరే పార్టీలోకి వెళ్లిపోవడంతో కళ్యాణ్ బాబు ఒక్కసారి మాత్రమే నేను ఆలీకి చాలా ఉపయోగపడ్డాను.

Nagababu gave clarity on the fight between Pawan Kalyan Ali

ఇలా చేస్తారని అనుకోలేదు అనే ఒకే ఒక్క మాట మాత్రమే మాట్లాడారు. అంతకుమించి వారి మధ్య గొడవ జరగలేదని తెలిపారు. పవన్ పై పోటీ చేస్తాను అని ఆలీ చెప్పటం పట్ల తాను సీరియస్ గా తీసుకోవడం లేదని.. నాగబాబు తెలిపారు. ఆయన ఒక పార్టీలో ఉన్నారు పార్టీ హై కమాండ్ చెప్పిన విధంగానే మాట్లాడాల్సి వస్తది. అంతకుమించి ఏమీ ఉండదని ఈ విషయాన్ని కూడా సీరియస్ గా తీసుకోలేదని నాగబాబు తెలియజేయడం జరిగింది. అయినా ఇప్పుడు వీళ్ళిద్దరూ బయట కలుసుకున్న మాట్లాడుకుంటారు. ఆమధ్య ఆలీ తన కూతురు పెళ్లికి నా ముందే పవన్ కి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చి ఆహ్వానించారు. కానీ ఆ సమయంలో పవన్ కళ్యాణ్ మంగళగిరిలో పార్టీ కార్యక్రమాలలో బిజీగా ఉండటంతో ఆలీ కూతురు పెళ్లికి వెళ్లలేక పోయారని నాగబాబు స్పష్టం చేశారు.


Share

Related posts

Deepika Padukone: రెడ్ కార్పెట్ పై రెడ్ డ్రెస్ ధరించి, ఆహుతులకు కనువిందు చేసిన దీపిక పదుకొనె!

Ram

Bigg Boss 7 Telugu Today ఎపిసోడ్ 12: బిగ్‌బాస్‌లో ఉన్నవాళ్లందరూ బఫూన్స్.. ఛండాలంగా ఉందంటూ రతిక రోజ్‌ సంచలన వ్యాఖ్యలు.. ఆమెపై సీరియస్ అయిన కంటెస్టెంట్లు.. బిగ్‌బాస్ ఊహించని ట్విస్ట్!

Deepak Rajula

అల్లు అరవింద్ ఆహా ప్లాన్ అన్నీ వాళ్ళని టార్గెట్ చేసే అంటున్నారు .. ?

GRK