NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ కార్యాలయానికి సీఐడీ .. ఎందుకంటే..?

Share

టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. పార్టీ ఖాతాల వివరాలు అందజేయాలని సీఐడీ నోటీసులో పేర్కొంది. మంగళవారం టీడీపీ కార్యాలయానికి సీఐడీ కానిస్టేబుల్ వెళ్లి కార్యాలయ కార్యదర్శి అశోక్ బాబుకు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 18వ తేదీ లోపు వివరాలు ఇవ్వాలని నోటీసులో పేర్కొంది.

స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును ఇప్పటికే ఏపీ సీఐడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో 52 రోజుల పాటు జైల్ లో ఉన్న చంద్రబాబు ఆరోగ్య కారణాల రీత్యా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ప్రభుత్వం ద్వారా విడుదల అయిన నిధులు షెల్ కంపెనీల ద్వారా టీడీపీ ఖాతాకు జమ అయ్యాయనేది సీఐడీ ఆరోపిస్తొంది. ఈ క్రమంలో పార్టీ ఖాతాలోకి వచ్చిన విరాళాలకు సంబంధించి వివరాలు కావాలంటూ సీఐడీ నోటీసులో కోరింది.

ఇంతకు ముందే పార్టీ కార్యాలయానికి సీఐడీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో పార్టీకి సంబంధించి విరాళాలను అడగడాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ టీడీపీ హైకోర్టు ను ఆశ్రయించింది. సీఐడీ అధికారులు వేధిస్తున్నారంటూ హైకోర్టులో టీడీపీ పీటీషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం ఈ పిటిషన్ హైకోర్టులో విచారణ దశలో ఉండగానే సీఐడీ మరో సారి టీడీపీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ నోటీసులపై టీడీపీ ఏ విధంగా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి.

Vijayasai Reddy: ‘సిద్దాంతాలు ఉన్న పార్టీలో సిద్ధాంతాలు గాలికి వదిలివేసే పురందేశ్వరి’


Share

Related posts

Allu arjun : అల్లు అర్జున్ వెనక స్టార్ డైరెక్టర్..పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ సెట్ చేస్తారా..?

GRK

“వకీల్ సాబ్” సినిమా యూనిట్ పై ఒత్తిడి పెంచుతున్న ఫ్యాన్స్..!!

sekhar

రామ్ తో అలాంటి సినిమా తీసే దర్శకుడు ఒక్కడే.. ఒప్పుకుంటాడా ..?

GRK