NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Vijayasai Reddy: ‘సిద్దాంతాలు ఉన్న పార్టీలో సిద్ధాంతాలు గాలికి వదిలివేసే పురందేశ్వరి’

Share

Vijayasai Reddy: ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. గత కొద్ది రోజులుగా విజయసాయిరెడ్డి తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా విమర్శలు, ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో పురందేశ్వరి స్వగ్రామం కారంచేడులో బీజేపీ అభ్యర్ధికి పోల్ అయిన వివరాలను పేర్కొంటూ తాజాగా విమర్శలు గుప్పించారు విజయసాయి రెడ్డి. ఉమ్మడి ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం నుండి గత ఎన్నికల్లో పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ అభ్యర్ధి గా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్ధి ఏలూరి సాంబశివరావుపై ఓటమి పాలైయ్యారు.

ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా చెరుకూరి రామ యోగేశ్వరరావు పోటీ చేయగా, కారంచేడు 145వ పోలింగ్ బూత్ లో బీజేపీ అభ్యర్ధికి ఆరు ఓట్లు పోల్ అయ్యాయి. ఆ చార్ట్ ను షేర్ చేసిన విజయసాయి రెడ్డి.. ‘కారంచేడు 145 వ పోలింగ్ బూత్ లో బీజేపీకి పడిన ఆరు ఓట్లలో అసలు పురందేశ్వరి గారి ఓటు ఉందా..? మీ సొంత బీజేపీ అభ్యర్ధికి రాష్ట్ర అధ్యక్షురాలు ఓటు వేయలేదా అని ప్రశ్నించారు. మీ బావ పక్షాన పక్షపాతివై ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీకు కంటగింపు అయిపోయింది. బీజేపీ లాంటి సిద్దాంతం ఉన్న పార్టీలో సిద్ధాంతాలు గాలికి వదిలేసే మీరు ఎన్ని రోజులు ఉంటారు.. గట్టిగా మాట్లిడితే మా ఓటు అక్కడ లేదు. వైజాగ్ లోనో రాజంపేటలోనో ఉండి పోయింది అని బొంకుతారు మళ్లీ!’ .. అంటూ విమర్శించారు విజయసాయి రెడ్డి.

బాబు ప్రయోజనాలు కాపాడటం కోసం పని చేస్తారా..?

అంతకు ముందు బాబు ప్రయోజనాల కోసం పని చేస్తారా అంటూ ప్రశ్నలు సంధించారు విజయసాయి రెడ్డి. పురంధేశ్వరి గారూ… ‘మీరు టీడీపీలో ఎన్నాళ్ళు ఉన్నారో, కాంగ్రెస్ కు ఎందుకు వెళ్ళారో, కాంగ్రెస్ నుంచి ఎందుకు బయటకు వచ్చారో, బీజేపీలో ఎందుకు చేరారో, ఇందులో ఏ ఒక్క ప్రశ్నకీ సమాధానం చెప్పలేకపోయారు. కనీసం బీజేపీలో ఎన్నాళ్ళు ఉంటారన్నదైనా చెప్పగలరా? రాష్ట్ర ప్రజలందరికీ ఒక డౌట్ వస్తుంది…ఇంతకీ మీరు చంద్రబాబుతో విభేదించి టీడీపీ నుంచి బయటకు వచ్చారా? లేక, చంద్రబాబు కోసమే, చంద్రబాబు పంపితేనే వేరే పార్టీల్లో కోవర్టుగా ఉంటూ…బాబు ప్రయోజనాల్ని కాపాడటానికే పనిచేస్తారా? అన్నది మీరు చెప్పకపోయినా ప్రజలకి బాగా అర్థమైంది’ అని విమర్శించారు.

BRS Vs Revanth Reddy: బీఆర్ఎస్ నేతలకు నిద్ర లేకుండా చేస్తున్న రేవంత్ రెడ్డి…ప్రచారం కి వెళ్లకుండా ఆపాలని ఈసీ ముందు విశ్వప్రయత్నం

 


Share

Related posts

YSRCP: సీఎం సొంత జిల్లాలో..వైసీపీ నేతల బాహాబాహీ..!!

somaraju sharma

పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ల‌తో బాలీవుడ్ న‌టుల‌కు సంబంధాలు..?

Srikanth A

ప్రాణాలు కాపాడిన స్మార్ట్ ఫోన్.. క్షణంలో మిస్.. అసలు ఏమైందంటే?

Teja