Paluke Bangaramayenaa november 14 2023 episode 73: స్వర వాళ్ళ అమ్మని తలుచుకునే బాధపడుతూది . కట్ చేస్తే యశోద అమ్మవారి గుడిలో పోర్లు దండాలు పెడుతూ ఉంటే ఝాన్సీ కీర్తి హెల్ప్ చేస్తూ ఉంటారు. పాపం ఎవరో ఈ తల్లి ఆ అమ్మాయికి తొందరగా తగ్గిపోవాలని పొర్లు దండాలు పెడుతుంది అని పంతులుగారు అనుకుంటాడు.ఏంటి పంతులుగారుఈ అమ్మ ఎందుకు అలా చేస్తుంది అని అడుగుతాడు విశాల్. ఏమీ లేదు బాబు మినిస్టర్ గారి కూతురికి అమ్మవారు పోసిందంట తక్కువ అయితే పొర్లు దండాలు పెడతానని మొక్కుకుందంట అందుకని ఆవిడ పొర్లు దండాలు పెడుతుంది ఈ తల్లి ఆ అమ్మాయికి ఎంత మేలు చేస్తుందో చూడు అని పూజారి అంటాడు. విశాల్ ఆ మాట వినగానే పళ్ళు పటపట కొరుకుతాడు. ఏంటి బాబు పళ్ళు కొరుకుతున్నావు అలా కొరకకూడదు అని పూజారి అంటాడు. పంతులుగారు ఆవిడ చేస్తున్న పూజలు నేను చేసుకోబోయే అమ్మాయి కోసమే అని విశాల్ అంటాడు.

అవునా బాబు ఆవిడ నీకు తెలిసిన ఆవిడ అందుకే అలా పొలుగడ్డలు పెడుతుంది అని పూజారి అంటాడు. తిన్నగా వాళ్ళ దగ్గరికి వెళ్లి చూడండి అమ్మ నా భార్య కోసం మీరు ఇంత చేస్తున్నారు మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అని విశాల్ అంటాడు. అంత అవసరం నీకు రానివ్వములే విశాల్ ఎందుకంటే స్వరాకి నేను అభిషేక్ ఉన్నాము అంతదాకా వస్తే మేమే చూసుకుంటాంలే అని ఝాన్సీ అంటుంది. ప్రళయం వచ్చినా నేను భయపడను అని విశాల్ అంటాడు. బస్మాసురుడు కూడా నీలాగే వరగర్వంతో విర్రవీగేవాడు తన చేతిని తన తల మీదనే పెట్టుకుని భస్మం అయిపోయినట్టు నువ్వు ఏదో ఒక రోజు అలాగే అవుతావు అని ఝాన్సీ అంటుంది. కోపంతో ఏమీ చేయలేని పరిస్థితిలో విశాల్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, స్వర ఈ జ్యూస్ తాగు అని అభిషేక్ అంటాడు. నీకెందుకండీ ఇంత శ్రమ అని స్వర అంటుంది. జ్యూస్ తెచ్చి ఇవ్వడం కూడా చెమటోడ్చి కష్టపడడం కాదులే స్వర తీసుకో అని అభిషేకం అంటాడు.

మీ రుణం ఎప్పటికీ మర్చిపోలేని సార్ మీరు చేసే సహాయాన్ని నేను ఉన్నంతవరకు గుర్తుపెట్టుకుంటాను అని స్వరా బాధపడుతుంది. కట్ చేస్తే యశోద భిక్షాటన చేస్తూ ఉంటే వీళ్లిద్దరూ తన వెనకాల తిరుగుతూ ఉంటారు. ఝాన్సీ భిక్షాటన అయిపోయింది ఈ బియ్యం తీసుకువెళ్లి అమ్మవారికి నైవేద్యం వండి పెడదాం పదా అని యశోద అంటుంది. అలాగే ఆంటీ పదండి అని వాళ్ళు ముగ్గురూ వెళ్ళిపోతారు. కట్ చేస్తే, విశాల్ ఝాన్సీ గుడిలో అవమానించినందుకు కోపంతో రగిలిపోతూ మందు తాగుతూ ఉంటాడు. ఏంటిరా విశాల్ ఈ టైంలో మందు తాగుతున్నావ్ ఏమైంది అని కళ్యాణి అడుగుతుంది. భయపడ్డాను అమ్మ ఫస్ట్ టైం ఒక ఆడది నన్ను బెదిరిస్తే భయపడి పోయి వచ్చేసాను నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మాట్లాడిది అమ్మ ఝాన్సీ ఆడదే కదా అనుకున్నాను కానీ తన మాటల్లో నాకు ధైర్యం కనిపించింది దానిని బ్రతకనిస్తే నాకే కీడు చేస్తుంది అమ్మ దాన్ని చంపేస్తాను అని విశాల్ అంటాడు.

చూడు విశాల్ నువ్వు తప్పుల మీద తప్పులు చేయకు దశదిశ కర్మ అయిపోగానే స్వరకి నీకు పెళ్లి అయితే స్వర బాధపడుతుంది కాబట్టి వాళ్ళు నిన్ను ఏమీ చేయలేరు అని వాళ్ళ అమ్మ అంటుంది. కట్ చేస్తే, కిటికీ దగ్గర నిలబడి స్వర ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఆర్య వచ్చి అక్క ఎలా ఉన్నావ్ అక్క పెద్దమ్మ చనిపోయినప్పుడు నాకు ఒకసారి ఫోన్ చేయొచ్చు కదా అని అంటాడు. తమ్ముడు నువ్వు ఎలా ఉన్నావురా ఎన్నాళ్ళు అయింది రా నిన్ను చూసి అమ్మ చనిపోయినప్పుడు నీకు చెబుదాము అనుకున్నాను కానీ నీకు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పలేదు రా నువ్వేమీ బాధపడకు అని స్వర అంటుంది.

అక్క పెద్దమ్మ చనిపోయినప్పుడు నువ్వు ఒక్కదానివే ఒంటరిగా ఎలా భరించావు అక్క నేను కూడా నీ పక్కన లేను అని ఆర్య అంటాడు. నువ్వు లేకపోతే ఏంట్రా అభిషేక్ సార్ నా పక్కన ఉండి నన్ను కంటికి రెప్పలా చూసుకున్నాడు ఆయనే లేకపోతే నేను ఏమైపోయే దనో తమ్ముడు అని స్వర అంటుంది. అక్క నిజంగా వాళ్ల కుటుంబం వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఎంత మంచి వాళ్ళ అక్క మనకి అడగకుండానే ఇంత సహాయం చేస్తున్నారు అక్క ఇప్పుడు నేను వచ్చేసాను కదా అమ్మతో చెప్తాను హాస్టల్ కి వెళ్ళాలని ఇక్కడి నుంచే చదువుకుంటాను అక్క అని ఆర్య అంటాడు. నిజంగా నువ్వు తమ్ముడివై పుట్టావు కానీ నాకన్నా పెద్ద వాడివి అయితే అన్నలా నన్ను ఎంత బాగా చూసుకునే వాడివో అని స్వర అంటుంది.

అక్క ఇప్పుడు కూడా నీకు అన్నయ్య ని అక్క ఎందుకంటే నీకంటే హైట్ ఉన్నాను కదా అని ఆర్య అంటాడు.ఏంటి తమ్ముడు నన్ను ఆటపట్టిస్తున్నావా నిన్ను కొట్టేస్తా చూడు అని స్వరఅంటుంది. అక్క నన్ను కొట్టడానికి అంతలా పరిగెత్తకు ఇక్కడే నిలబడతాను కొట్టు అని ఆర్యఅంటాడు. నిన్ను ఎందుకు కొడతాను తమ్ముడు నువ్వంటే నాకు కానీ అభిషేక్ సార్ వాళ్ళ కుటుంబం చేసే సహాయానికి నేను ఎప్పటికీ రుణం తీర్చుకోలేను అని స్వర అంటుంది. ఇంతలో యశోద వచ్చి అంత పెద్ద మాటలు ఎందుకులే అమ్మ నేను చేస్తున్నది చిన్న సహాయం అని అంటుంది. స్వర నువ్వు కోలుకోవాలని ఆంటీ అమ్మవారికి పొర్లు దండాలు పెట్టి భిక్షాటన చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి నీకు తెచ్చింది తిను స్వర అని ఝాన్సీ అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది