Bramhamudi: రాజ్ ని సీతారామయ్య వద్ద ఇరికించిన కావ్య కావ్య కి సీతారామయ్య నుండి ఫుల్లు సపోర్టు దక్కడం తో పక్క రోజు నుండి తన పుట్టింటికి వెళ్లి పని చేద్దాం అని నిర్ణయం తీసుకుంటుంది. కానీ రాజ్ మాత్రం అందుకు ఒప్పుకోడు, అప్పుడు కావ్య సరే అని ఒప్పుకున్నట్టే ఒప్పుకొని రాజ్ చేతనే ఇంటికి వెళ్ళు అని చెప్పించే ప్రయత్నం చేస్తుంది. క్రింద తన తాతయ్య తో కూర్చొని న్యూస్ పేపర్ చదువుతున్న రాజ్ ని చూసి తాతయ్య దగ్గర ఇరికించాలని అనుకుంటుంది. తాతయ్య కి ఈరోజు నుండి పుట్టింటికి వెళ్లి పని చెయ్యాలనే విషయాన్నీ గుర్తు చెయ్యడం కోసం ఏదైనా అవసరం ఉంటే అడగండి తాతయ్య, ఈరోజు మొత్తం నేను వంటింట్లోనే ఉంటాను అని అంటుంది కావ్య. అప్పుడు సీతారామయ్య అదేంటి ఈరోజు నుండి నువ్వు మీ ఇంటికి వెళ్లి పని చేసుకుంటాను అని నాతో చెప్పావు కదా అని అంటాడు సీతారామయ్య.

అవును తాతయ్య కానీ మా ఆయనకీ ఈరోజు నేను వెళ్లడం అసలు ఇష్టం లేదు అని అంటుంది. అప్పుడు రాజ్ ఏమి లేదు తాతయ్య ఈరోజు అసలు ముహూర్తం బాగలేదు అని నాకు తెలిసిన ఒక పంతులు చెప్పాడు, అందుకే రేపు వెళ్ళమని చెప్పా అని అంటాడు రాజ్. అప్పుడు సీతారామయ్య ఈరోజు బాగాలేకపోవడం ఏందిరా, ఈరోజు ఎంతో దివ్యమైన రోజు , ఆ పంతులు వెదవ ఎవడో నాకు ఫోన్ కలిపి ఇవ్వు చెప్తా వాడి సంగతి అని అంటాడు సీతారామయ్య.

ఇప్పుడు వాడి సంగతి ఎందుకులే తాతయ్య, ఈరోజు నుండే వెళ్తుందిలే అని సమాధానం ఇస్తాడు రాజ్. తాతయ్య దగ్గర ఇరికించాలని చూసిన కావ్య ని చేతులు పట్టుకొని రూమ్ కి లాక్కెళ్తాడు రాజ్. అప్పుడు కావ్య ముహూర్తం పెట్టి శోభనం చేసుకోండి అన్న రోజేమో సైలెంట్ గా ఉన్నారు, ఇప్పుడేమో సమయం సందర్భం లేకుండా రెచ్చిపోతున్నారు అని అంటుంది కావ్య. రాత్రులే పట్టించుకోను, ఇక పగలు పూట అలాంటివి ఎందుకు చేస్తాను అని అంటాడు రాజ్.

నూనె పోసి కావ్య ని కాలు జారీ క్రిందపడేలా చెయ్యడానికి రాజ్ ప్రయత్నం :
అప్పుడు రాజ్ నువ్వు కావాలనే తాతయ్య దగ్గర ఓవర్ యాక్షన్ చేసి నన్ను ఇరికించాలని అనుకున్నావ్ కదా, నువ్వు ఇంటికి వెళ్ళడానికి అన్నీ దాని అంతటా అదే జరగాలి, దానికి తగ్గట్టుగా పథకం వేశావు అని అంటాడు రాజ్. అదేమీ లేదండి మీరు వెళ్ళమంటేనే వెళ్తాను, వద్దంటే ఇదే విషయాన్నీ తాతయ్య గారితో చెప్తాను , భర్త మాటే నాకు వేదవాక్కు అని అంటుంది కావ్య. చేసిన ఓవర్ యాక్షన్ ఇక వెళ్లి ఫ్రెష్ అయ్యి రా అంటాడు కావ్య. ఇక ఆ తర్వాత కావ్య కి రద్దు చేసిన కాంట్రాక్టు ని తిరిగి ఇవ్వమని విగ్రహాల కాంట్రాక్టు అతనికి కాల్ చేసి చెప్తాడు రాజ్. మరోపక్క క్రింద స్వప్న రాహుల్ ని తిడుతూ ఉండడాన్ని గమనిస్తాడు రాజ్. అవతల రాజ్ తన భార్య కోసం ఎన్నో చేస్తున్నాడు, ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్నాడు, భార్య మీద ఈగ కూడా వాలనివ్వడం లేదు, కానీ నువ్వు నన్ను అసలు పట్టించుకోవు అని గొడవ చేస్తుంది.

అప్పుడు రాజ్ నాకు తెలియకుండా కావ్య కి నేను అంత సహాయ సహకారాలు ఎప్పుడు అందించాను, నా గురించి ఇంట్లో అందరూ ఇలా అనుకుంటున్నారా, ఇది ఎలా మార్చాలి అని అనుకుంటాడు రాజ్. ఎలా అయినా కావ్య ని బయటకి వెళ్ళినవ్వకుండా ఉండడానికి నూనె పోసి కావ్య ని కాలు జారీ పడేలా చేస్తాడు. కానీ కావ్య అది గమనించి నన్నే పడేయాలని చూస్తారా అని అంటుంది. ఆధారాలు లేకుండా మాట్లాడకు అని అంటాడు రాజ్, అప్పుడు కావ్య ఫోన్ లో వీడియో తీసింది చూపించి రాజ్ ని షాక్ కి గురి చేస్తుంది. అలా ఈ ఎపిసోడ్ మొత్తం సరదాగా సాగిపోతుంది.