NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Chai GPT: కస్టమర్లను ఆకట్టుకుంటున్న చాయ్ జీపీటీ (టీ దుకాణాలు)

Advertisements
Share

Chai GPT: వ్యాపారులు కస్టమర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ఐడియాలు వేస్తుంటారు. కొందరు తమ దుకాణాలకు పెట్టే పేర్లతో కస్టమర్లను ఆకర్షిస్తుంటారు. ఇటీవల కొందరు నిరుద్యోగ యువకులు డిగ్రీ, బీటెక్ వంటివి పూర్తి చేసినా ఉద్యోగాలు లేక తమకు తామే ఉపాధి కల్పించుకుంటున్నారు. అందులో భాగంగా బీటెక్ చాయ్ వాలా.. గ్రాడ్యుయేట్ చాయ్ దుకాణాలు, గ్రాడ్యుయేట్ కిరణా దుకాణం పేరిట ప్రారంభించి నిర్వహిస్తున్నారు.

Advertisements

కొద్ది నెలల క్రితం ఓ వ్యాపారి వాళ్లను తలదన్నెలా ఆలోచన చేసి తన టీ దుకాణానికి ‘చాయ్ జీపీటి’ అంటూ వినూత్నంగా పేరు పెట్టాడు. ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇటీవల మనం ‘చాట్ జీపీటీ’ గురించి విన్నాం. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా పని చేసే అప్లికేషన్ ఇది. మనం ఏ సమాచారం కోరినా క్షణాల్లో మనముందు ఉంచే టూల్. గూగుల్ కంటే సమర్ధవంతంగా ఈ నూతన టెక్నాలజీ అవిష్కరణ ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది.

Advertisements

 

చాట్ జీపీటీ పేరు విస్తృతంగా వినబడుతుండటంతో ఓ తెలవైన వ్యాపారి తన టీ దుకాణానికి చాయ్ జీపీటీ అని బోర్డు తగిలించి వ్యాపారాన్ని వ్యాపారం చేస్తున్నాడు. ఇక్కడ జీపీటీ అంటే జెన్యూనిటీ ప్యూర్ టీ అని అర్ధం. చాయ్ జీపీటీ దుకాణానికి విపరీతమైన పబ్లిసిటీ రావడంతో పలువురు రోడ్ సైడ్ టీ స్టాల్స్ నిర్వహకులు కూడా తమ దుకాణంపై చాయ్ జీపీటీ అని బోర్డు తగిలించి కస్టమర్లను ఆకర్షిస్తూ వ్యాపారం చేస్తున్నారు. సాధారణంగా ఎవరైనా వినూత్నంగా ఆలోచించి తమ వ్యాపార సంస్థకు పెట్టి కస్టమర్లను ఆకట్టుకుంటుంటే .. అదే రకమైన వ్యాపారాలు చేసే వారు ఆ పేరును కాపీ చేయడం మామూలే. అలానే ఇప్పుడు చాయ్ జీపీటీ దుకాణాలు ఎక్కువగా కనిపిస్తున్తూ టెక్కీలను ఆకట్టుకుంటున్నాయి.

Banana: భారీగా పెరుగుతున్న అరటి పండ్ల ధరలు .. డజన్ ఎంతంటే..?


Share
Advertisements

Related posts

సుశాంత్ – రియా డ్రగ్ కేసు : రకుల్ ఇరుక్కుంటే ‘అక్క’ కూడా ఇరుక్కున్నట్టే ?

arun kanna

Pooja Hegde: పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ కు 100 మిలియన్ వ్యూస్..!!

bharani jella

రష్మిక ఏంటి పూజా హెగ్డేని కూడా తక్కువ చేసేసింది ..?

GRK