NewsOrbit
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili: మల్లిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్న గౌతమ్…ఆనందంలో కౌసల్య నీలిమ…మల్లిని పెళ్ళికి ఒప్పించే ప్రయత్నంలో మీరా!

Malli Nindu Jabili August 14 2023 Episode 422 highlights

Malli Nindu Jabili:  బాబు గారు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు గౌతమ్ బాబు చూస్తే గొడవ చేస్తారు మీరు వెళ్ళండి అని మల్లి అంటుంది.నేను వెళ్లడానికి రాలేదు నీతో మాట్లాడడానికి వచ్చాను గౌతమ్ తో పెళ్లికి రెడీ అవుతున్నావని మాలిని అమ్మ వాళ్లతో చెబుతుంటే విని అడుగుదామని వచ్చాను సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకోకపోతే జీవితాలు పాడవుతాయి అర్థం చేసుకోనంత చిన్న పిల్లవి కాదు అర్థం లేకుండా ఎందుకు ప్రవర్తిస్తున్నావ్ అని అరవిందు అంటాడు.నా జీవితం పక్క వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది నన్నేం చేయమంటారు అని మల్లి అడిగింది.గౌతమ్ ని పెళ్లి నీ జీవితం పాడవుతుంది, నువ్వు ఏం చేయాలో చెప్తాను నువ్వు నాతో రా అని మల్లి ని తీసుకువెళ్లిపోబోతుంటాడు అరవింద్.ఇంతలో కౌసల్య అక్కడికి వచ్చి ఆగు మల్లిని ఎక్కడికి తీసుకు వెళుతున్నావు అని అరవిందుని అడిగింది.

Malli Nindu Jabili August 14 2023 Episode 422 highlights
Malli Nindu Jabili August 14 2023 Episode 422 highlights

మల్లి నీ సురక్షితమైన చోటికి తీసుకు వెళుతున్నాను అయినా మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని అరవింద్ అంటాడు. కానీ నాకు చెప్పాలి మల్లి చేయి వదులు అని గౌతమ్ అంటాడు.పట్టుకున్నది వదలడానికి కాదు వదిలించుకోవాలని మల్లి చూసినా వదిలేలా చేయాలని ఇంకెవరైనా చూసిన వదిలేది లేదు అని అరవింద్ అంటాడు.మల్లి తో నీకేం సంబంధం అని గౌతమ్ అంటాడు.నాలుగు రోజులు షెల్టర్ ఇచ్చిన వారు మీకంటే నాకే సంబంధం ఎక్కువగా ఉంది అని అరవింద్ అంటాడు.ఇంట్లో ఉంచుకొని చదివించినంత మాత్రాన మల్లి మీద నీకు హక్కులు ఉంటాయా అని గౌతమ్ అంటాడు.ఆఫీసులో ఏదో ఉద్యోగం ఇచ్చిన అంత మాత్రాన నీకు ఉంటుందా అధికారం అని అరవింద్ అంటాడు.వాళ్ల అమ్మే ఇక్కడ ఉండమని చెప్పింది ఆవిడ కంటే నీకే ఎక్కువ ఉందా అని గౌతమంటాడు.

Malli Nindu Jabili August 14 2023 Episode 422 highlights
Malli Nindu Jabili August 14 2023 Episode 422 highlights

అవును ఆ బంధం ఎంత గొప్పదో మా బంధం కూడా అంతే గొప్పది అని అరవింద్ అంటాడు.ఏదో బంధం బంధం అంటూ మాట్లాడుతున్నాడు ఏంటి మల్లి అని గౌతమ్ అడుగుతాడు.అరవింద్ సార్ ఊరికే అంటున్నారు బాస్ గారు చేయి వదలండి అని మల్లి అంటుంది.వీళ్లు నాలుగు రోజులేదో బాగా చూసుకుంటున్నారని ఇక్కడ ఉండిపోతాను అనుకుంటున్నావు వీళ్ళ నిజస్వరూపం బయట పడితే ఇక్కడ ఉండలేవు అందుకనే బయటికి వెళ్ళిపోదాం రా అని అరవింద్ అంటాడు.మల్లి జీవితాంతం ఇక్కడే ఉంటుంది అని గౌతమ్ అంటాడు. ఏ హక్కుతో అంటున్నావు అని అరవింద్ అంటాడు.నేను మల్లి నీ పెళ్లి చేసుకుంటాను అని గౌతమ్ అంటాడు.నీకు కావలసిన సమాధానం నా కొడుకు చెప్పాడు కదా ఇక బయలుదేరు అని కౌసల్య అంటుంది.మల్లి చూసావు కదా ఇక్కడ ఏం జరుగుతుందో పద అని అరవింద్ అంటాడు.

Malli Nindu Jabili August 14 2023 Episode 422 highlights
Malli Nindu Jabili August 14 2023 Episode 422 highlights

మీరు నా విషయంలో జోక్యం చేసుకోకండి మీరు వెళ్ళండి అని మల్లి అంటుంది.నువ్వు గౌతమ్ ని పెళ్లి చేసుకున్నావంటే నిన్ను నువ్వు కోల్పోతావ్ నా మాటల్లోని అర్థం ఇప్పుడు తెలుసుకో లేకపోయినా ముందు ముందు తెలుసుకుంటావు నీ చేత కన్నీరు పెట్టిస్తుంది నువ్వు మునిగిపోతున్న ప్రతిసారి నేను చేయి అందిస్తున్నాను నువ్వు అందుకోవడం లేదు అని అరవిందు అక్కడనుండి వెళ్ళిపోతాడు. గౌతమ్ నువ్వు ఇందాక అన్నది ఆవేశంలో అన్నావా నిజంగానే మనసులో మాట అని కౌసల్య అడిగింది.నిజంగానే నా మనసులో మాట స్వప్నని ఎవరు రీప్లేస్ చేయలేరు అనుకున్నాను కొద్ది రోజులుగా ఆ ప్లేస్ ని నువ్వు అందుకుంటూ వస్తున్నావు మల్లి నీ మీద నాకు అధికారం రావాలంటే మనిద్దరం పెళ్లి చేసుకోవాలి నన్ను పెళ్లి చేసుకోవడంలో నీకు ఎటువంటి అభ్యంతరం లేదంటే చెప్పు అని గౌతమ్ వెళ్ళిపోతాడు.మల్లి గౌతమ్ ని పెళ్లి చేసుకుంటే నువ్వు మహారాణివి అవుతావు అని కౌసల్య అంటుంది.

Malli Nindu Jabili August 14 2023 Episode 422 highlights
Malli Nindu Jabili August 14 2023 Episode 422 highlights

నాకు ఏమీ అర్థం కావడం లేదు ముందు నేను మా అమ్మ వాళ్ళని కలవాలి అని మల్లి అక్కడి నుండి వెళ్ళిపోతుంది.ఏకాదశి ఇంకా మూడు రోజులే ఉంది అందుకే ఇలా జరిగిందేమో అని కౌసల్య అంటుంది. స్వామీజీ గారు చెప్పినట్టే జరుగుతుందమ్మా అని నీలిమ అంటుంది.మల్లి మళ్లీ పెళ్లి చేసుకోవడమే అన్ని రకాలుగా మంచిది అనిపిస్తుంది రా అని శరత్ చంద్ర వాళ్ళ అమ్మ అంటుంది. నేను మీరా చెప్పాము అమ్మ మల్లి మీదే ఆధారపడి ఉంది అని శరత్చంద్ర అంటాడు.ఒక మల్లి మీదే ఆధారం పెట్టకండి తండ్రిగా మీరు కూడా బాధ్యత తీసుకున్నారు గా మల్లి నుండి ఏదైనా రిప్లై వచ్చిందా అని మాలిని అడిగింది.రెండో పెళ్లి అంటే ఏ ఆడపిల్ల అయినా ఆలోచిస్తుంది ఎలా అని జగదాంబ అంటుంది.మల్లి ఏమంటుందో అని ఆలోచిస్తున్నాం అమ్మ అని మీరా అంటుంది.తన కూతురి విషయంలో తనకు అంటే నీకెందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు అని వసుంధర మాలిని అడుగుతుంది.ఒక శుభకార్యం జరగాలంటే అందరూ ఉండాలి కదా అమ్మ అని మాలిని అంటుంది.

Malli Nindu Jabili August 14 2023 Episode 422 highlights
Malli Nindu Jabili August 14 2023 Episode 422 highlights

ఇక్కడ ఒక పెద్ద కుటుంబమే ఉంది నువ్వేం అంత టెన్షన్ పడకు అని వసుంధర అంటుంది.కట్ చేస్తే ఇంతలో మల్లి అక్కడికి వస్తుంది.మల్లి నిర్ణయం తీసుకున్నావా అని మీరా అడిగింది.నా నిర్ణయం గురించి చెప్పడానికి రాలేదమ్మా అరవింద్ బాబు గారు గౌతమ్ వాళ్ళ ఇంటికి వచ్చి గొడవ చేసి వెళ్ళింది చెబుదామని వచ్చాను అని మల్లి జరిగిందంతా చెబుతుంది.మేమే గౌతమ్ బాబుని అడుగుదామని అనుకుంటున్నాం ఆ అబ్బాయి చేసుకుంటానని అన్నప్పుడు అదృష్టం తలుపు తట్టినట్టే కదా అమ్మ అని మీరా అంటుంది.దీన్ని గౌతమ్ పెళ్లి చేసుకుంటానన్నాడా అని వసుంధర షాక్ అవుతుంది.అతని నోటి నుంచే వచ్చినప్పుడు ఒప్పుకోవడం మంచిదమ్మా అని శరత్ చంద్ర అంటాడు.కాదనకు మల్లి అని మీరా అంటుంది.నావల్ల కాదమ్మా అని మల్లి అంటుంది.చదువుకుంటాను అన్నావ్ ఉద్యోగం చేస్తానన్నావు నా కాళ్ళ మీద నేను నిలబడతాను అని అన్నావు అనుకున్నవన్నీ జరిగాయి వాటితోనే జీవితం సంపూర్ణం అయిపోదు కదా భవిష్యత్తు అనేది తాలి బంధం తోటే ముడిపడి ఉండాలి ఆడదానికి అదే అసలైన జీవితం నువ్వు పెళ్లి చేసుకొని తీరవలసింది అని మీరా అంటుంది.నీ జీవితంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు నా జీవితం నీ కళ్ళముందే అంతా జరిగింది మగాడి వల్ల ఇద్దరికీ గాయాలయ్యాయి ఆ గాయాల నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేకపోతున్నాం అన్నీ తెలిసి నన్ను ఎలా పెళ్లి చేసుకోమని అడుగుతున్నావు నీకు మనసు ఎలా వస్తుందమ్మా అని మల్లి అడిగింది.

Malli Nindu Jabili August 14 2023 Episode 422 highlights
Malli Nindu Jabili August 14 2023 Episode 422 highlights

జీవితం అన్ని సార్లు ఒకేలాగా ఉంటుందని నేను అనుకోవడం లేదమ్మా నీకు మంచే జరుగుతాదని నేను నమ్ముతున్నాను అని మీరా అంటుంది.నీకు ఆ నమ్మకం ఉందేమో కానీ నాకు ఆ నమ్మకం లేదు మరోసారి ఆ ఊబిలోకి నేను దూకలేను అని మల్లి అంటుంది.నువ్వు నాలా అవకూడదని నా బాధంతా నేను బతికుండగా నీ జీవితాన్ని సరిదిద్దకపోతే నా బతుకే అనవసరం అని మీరా అంటుంది.ఎందుకు వాణ్ణి తప్ప ఇంకెవరిని చేసుకోకూడదు అని వసుంధర అంటుంది. ఇష్టపడ్డోడినే చేసుకుంటే బాగుంటుంది అని జగదాంబ అంటుంది.మల్లికి ఇలా చెప్తే అర్థం కాదు అర్థమయ్యే రీతిలో నేను చెబుతాను గా అని మల్లి ని మాలిని తీసుకొని వెళ్ళిపోతుంది మల్లి ఇలా ఎందుకు చేస్తున్నావు అని మాలిని అడిగింది.నేనేమీ చేయట్లే అక్క నా ఫోటో పేపర్లో వేయించి నన్ను ఇబ్బందుల పాలు చేసి నేను పెళ్లి చేసుకునేలాగా ఇబ్బంది పెడుతున్నావు అని మల్లి అంటుంది.నువ్వు పెళ్లి చేసుకోకపోతే జీవితాంతం అరవింద్ నీ చుట్టే తిరుగుతాడు అని మాలిని అంటుంది.

అయితే అరవింద్ బాబుని బంధించుకో నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు అని మల్లి అడిగింది.అక్క చెల్లెల మధ్య తాళి గురించి ఈ పోరు రాకూడదు మల్లి నన్ను అర్థం చేసుకొని ఈ పెళ్లికి ఒప్పుకో అని మాలిని అడిగింది.నేనేం చేశాను అక్క నాకు న్యాయం చేయమని నీ ఇంటి ముందు టెంట్ వేసుకొని కూర్చున్నానా పోలీస్ స్టేషన్ కు వెళ్లానా కోర్ట్ మెట్లు ఎక్కానా ఏం చేశాను ఏమి చేయలేదు నా పాటికి నేను అరవింద్ బాబును వదిలేసి వచ్చేసాను అని మల్లి అంటుంది.అయితే నువ్వు ఈ పెళ్లి చేసుకోను అంటావు సరే ఒక పని చెయ్ నువ్వు తీసి ఇచ్చేసిన ఈ తాళి నువ్వు సంతకాలు చేసిన ఈ పేపర్.కట్ చేస్తే దీంతో ఈరోజు ఎపిసోడ్ మూస్తుంది మళ్ళీ రేపు ఏం జరుగుతుందో చూద్దాం

Related posts

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri