NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema: పద్మావతి విక్కి ల గొడవ.. అందరి ముందు కుచల తో గొడవపడిన అండల్..

Nuvvu Nenu Prema 15 aug 2023 today 389 episode highlights,
Advertisements
Share

Nuvvu Nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో, విక్కీ పద్మావతి ఇద్దరూ గొడవపడడం. కావాలనే విక్కీ పద్మావతిని, ఏడిపించడం. చిలకమ్మ మాటలతో విక్కీ ఇంకా కోప్పడం. అను ఆర్యలు సంతోషంగా గడపడం. కృష్ణ అరవింద ను చంపాలనుకోవడం, కృష్ణ ప్రమాదంలో పడడం జరుగుతుంది. అరవింద కృష్ణ ని కాపాడుతుంది.

Advertisements
Nuvvu Nenu Prema 15 aug 2023 today 389 episode highlights,
Nuvvu Nenu Prema 15 aug 2023 today 389 episode highlights

ఈరోజు ఎపిసోడ్ లో, విక్కీ పద్మావతి ఇద్దరూ గొడవ పడుతూ ఉండడంతో అక్కడికి చిలకమ్మ వస్తుంది. ఏంటమ్మా గారు మీ ఇద్దరు గొడవ పడుతున్నారు అని అడుగుతుంది. ఏం లేదు నేను పాటలు వింటూ ఉంటే మా వారికి నచ్చట్లేదు అని అంటుంది పద్మావతి. అయ్యో మీ ఇద్దరి మధ్యలో నేను ఎందుకు లేండి అని జ్యూస్ ఇచ్చి వెళ్ళిపోతుండగా పర్వాలేదు ఒక అమ్మాయి ఇక్కడే ఉండు మా వారు ఏమి అనుకోరు అని అంటుంది. పద్మావతి చాలా మంచిది అయ్యగారు మా పద్దమ్మ లాంటి వాళ్ళు మీకు దొరకడం చాలా అదృష్టం అని అంటుంది చిలకమ్మా. సెల్ఫీ తీసుకుందామని ముగ్గురు కలిసి సెల్ఫీ తీసుకుంటారు. ఏంటి బాబు బద్దమని పొగుడుతుంటే మీరు మాత్రం చాలా కోపంగా ఉన్నారు అని అంటుంది. అదేం లేదులే చిలకమ్మా మా వారు అట్లానే ఉంటారు అని పద్మావతి కవర్ చేస్తుంది.

Advertisements
Nuvvu Nenu Prema 15 aug 2023 today 389 episode highlights,
Nuvvu Nenu Prema 15 aug 2023 today 389 episode highlights

ఆండాలు, కుచల కి ఫోన్ చేయడం..

ఆండాలు కుచల కి ఫోన్ చేస్తుంది. కుచిలా కావాలనే ఆండాలతో, రండి మీరు అని అంటుంది నేను ఆండాలని అని చెప్పగానే, ఆండాలు అంటే ఎవరో నాకు తెలియదు మా ఇంటి ఎదురుగా పునుగులు వేసుకునే వాళ్ళ అని కావాలని ఏడిపిస్తుంది. నేను అను వాళ్ళ మేనత్తని అంటే అసలు అణువు ఎవరు? మా ఇంట్లో పని అమ్మాయి కదా వాళ్లే కదా అని అంటుంది. కావాలని ఆండాలని, తక్కువ చేసి మాట్లాడుతుంది. మీ చిన్నమ్మాయి ఎటుగూడి పెళ్లి చేసుకోవడానికి మీకు ఖర్చు ఏం పెట్టలేదు కదా కాబట్టి ఆ డబ్బులన్నీ మీరు మిగిలే ఉంటాయి కదా వాటితో గ్రాండ్ గా చేయండి 16 రోజులు పండగ అని అంటుంది. 16 రోజులు పండగ తూతూ మంత్రంగా గమనించకుండా మంచిగా గ్రాండ్ గా చేయండి అని అంటుంది ఆండాలతో. అప్పుడే అక్కడికి అరవింద వస్తుంది. కుచల దగ్గర నుంచి ఫోన్ అరవింద తీసుకొని ఆండాలతో మాట్లాడుతుంది. మా పిన్ని అన్నమాట మీరేం పట్టించుకోకండి మీ స్థాయికి తగ్గట్టు మీ ఇష్టమైతే తగ్గట్టే చేయండి మా కోసం ఆర్భాటాలు చేయకండి అని అంటుంది అరవింద. మీరు బాగున్నారు కదా అమ్మ అని అడుగుతుంది ఆడాలి అరవింద ని. అరవింద మేమంతా బాగున్నాము రేపు తప్పకుండా వస్తాము అని ఫోన్ పెట్టేస్తుంది. అదేంటి అరవిందా అలా మాట్లాడావు అని కుచల అంటుంది. మనం 16 రోజులు పండక్కి వెళ్తున్నాం పిన్ని ఆర్భాటాల కోసం కాదు ఇంకేం మాట్లాడకండి అని అక్కడ నుంచి అరవింద వెళ్ళిపోతుంది. ఆండాలు బాధగా ఉంటే లక్ష్మీ రేపొద్దున వచ్చి వీళ్ళ అత్తగారు ఏం గొడవ చేస్తుందో అని అంటుంది. ఏం చేయకుండా మనమే చూసుకోవాలి లక్ష్మి అని ఆడాలి సర్ది చెబుతుంది. ఇప్పటికి చాలా పనులు ఉన్నాయి చూసుకుందాం కదా అని లోపలికి వెళ్తారు.

Nuvvu Nenu Prema 15 aug 2023 today 389 episode highlights,
Nuvvu Nenu Prema 15 aug 2023 today 389 episode highlights

పద్మావతి విక్కి ల గొడవ..

పద్మావతి కావాలని, విక్కీ తో గొడవపడాలని చూస్తుంది. వికీ కన్నా ముందే పద్మావతి లోపలికి వచ్చి మంచం మీద పడుకుంటుంది. మంచం మీద నుంచి నూడివి నేను పడుకోవాలి అని అంటాడు. సారు ఎవరు ఫస్ట్ వస్తే వాళ్లే పడుకునేది నేను ఫస్ట్ వచ్చాను కాబట్టి నేనే మంచం మీద పడుకోవాలి అని అంటుంది పద్మావతి. నీకు నా గురించి పూర్తిగా తెలియట్లేదు నాకు కోపం తెప్పించకుండా ముందు దిగు అని అంటాడు విక్కి. అయినా నేను ఎందుకు లేవాలి, మీరు కింద పడుకోండి కావాలంటే అని అంటుంది నేనే చెప్తే అది మీరు విని తిరాల్సిందే, ఏంటి నన్నే బెదిరిస్తున్నావా అని అంటాడు. చూడు నాకు కోపం తెప్పించకు, పాపం మీకేం కొత్త కాదు కదా, అది ఎప్పుడు వైఫై లాగా మీ ముక్కు మీద ఉంటుంది దానికి పాస్వర్డ్ కూడా అవసరం లేదు మీకు తిక్క తీరుతే సినిమా చూపిస్తారు కదా అందుకే కదా మిమ్మల్ని టెంపరోడ్ అని నేను పిలిచేది. మీరు ఏమన్నా అనుకోండి నేను మాత్రం లేవని కాక లేవని అంటుంది పద్మావతి. లేకపోతే నేను బలవంతంగా లేపుతాను అని అంటాడు. మీరు నన్ను ఏం చేయలేరు

Nuvvu Nenu Prema 15 aug 2023 today 389 episode highlights,
Nuvvu Nenu Prema 15 aug 2023 today 389 episode highlights

విక్కీ మీద కావాలని రివెంజ్ తీర్చుకున్న పద్మావతి..

మీరు ఏమైనా చేయాలనుకుంటే నేను మా వాళ్ళని పిలుస్తాను. ఎందుకు ఏంటి అని వాళ్ళు అడుగుతారు సింపుల్ గా నన్ను కింద పడుకోమంటున్నాడు అని చెప్తా, ఎందుకో అని మా వాళ్ళు నిన్ను అడుగుతారు అప్పుడు నువ్వే సమాధానం చెప్పుకోవాలి. ఏంటి నువ్వు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నావా అని అంటాడు. బ్లాక్మెయిల్ గురించి నువ్వే మాట్లాడాలి నువ్వు అలా చేసే కదా నన్ను పెళ్లి చేసుకున్నావు అని అంటుంది. పద్మావతి మర్యాదగా చెప్తున్నాను లే అని అంటాడు మీరు నన్ను కొట్టిన తిట్టినా ఇక్కడి నుంచి లేవను. నా పక్కన పడుకోండి కావాలంటే ఈసారి మిమ్మల్ని కనికరిస్తాను. నీ మాటంటేనే నాకు తలనొప్పి ఇంక నీ పక్కన పడుకో నిద్ర కూడా పట్టదు. పోనీలే పాపం కనికరించాను చూడు అది నా తప్పు అదేం లేదు కింద పడుకోండి. అని అంటుంది. ఎక్కడ మంచం మీద పడుకుంటాడు అని కావాలని మంచానికి అడ్డంగా పడుకుంటుంది పద్మావతి. ఏంటి సార్ అలా చూస్తున్నారు ఎట్లా ఎందుకు పడుకున్నాను. నేను నిద్రపోయిన తర్వాత మీరు మధ్యలో వచ్చి పడుకుంటారేమోనని అందుకే ఇలా పడుకున్నాను. ఇలా క్రాస్ గా పడుకుంటే ఇప్పుడు మీరు పడుకోలేరు కదా ఎట్లా ఉంది నా ఐడియా బాగుంది కదా అని అంటుంది. సారీ చూసింది చాల్లేగాని అక్కడ చాప్ ఉంటుంది ఇక్కడ తింటుంది తీసుకొని పడుకో, నేను ఈ గదిలో అస్సలు పడుకోను. నీవికి గదిలో నుంచి బయటికి వెళ్ళబోతు ఉండగా సారు మీరు గదిలో నుంచి బయటికి వెళ్తే మా వాళ్లకు అనుమానం వస్తుంది అప్పుడైనా మన నిజం చెప్పాలి మీకు వేరే ఆప్షన్ లేదు కింద పడుకోవడం తప్ప, పద్మావతి పద్మావతి ఇక్కడ తగ్గేది లేదు. విక్కీ కోపంతో పద్మావతిని కట్టబోతుండగా దిండి విసిరేసి ఇక్కడ పడుకోండి అని అంటుంది. విక్కి చేసేదేం లేక చాప కింద తీసుకొని దిండేసుకొని పడుకుంటాడు. సారు మీకెందుకు ఇది తిప్పలు నా మాట విని అసలు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు చెప్పేసేయండి ఏ సమస్య ఉండదు. అసలు సమస్యను వదిలించుకోవడానికి ఈ ఆరు నెలలు ఎప్పుడెప్పుడు అయిపోతాయి అనేది చూస్తూ ఉంటాను. వదిలించుకోవాలనుకునే వాడివి ఎందుకు తగిలించుకున్నావ్, నా పాటికి నేను ప్రశాంతంగా ఉండేదాన్ని కదా అని అనగానే జస్ట్ షట్ అప్ అని అరుస్తాడు. టెంపరడా అని అనుకోని పడుకుంటుంది పద్మావతి. కావాలని పద్మావతి రేడియో ఆన్ చేస్తుంది ఆ రేడియోలో పాటలకు విక్కికి నిద్ర పట్టదు ఇప్పుడు ఎందుకు ఆ రేడియో ఆన్ చేసావా ఆఫ్ చేయమని అడుగుతాడు. నా ఇష్టం నేను ఇలానే పాటలు వింటాను. నేను ఎంత విసిగించినా కానీ నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు చెప్పట్లేదు ఈ సమస్యకు నువ్వే పరిష్కారం చూపించి శ్రీనివాస అని అనుకుంటుంది పద్మావతి.

Nuvvu Nenu Prema 15 aug 2023 today 389 episode highlights,
Nuvvu Nenu Prema 15 aug 2023 today 389 episode highlights
అత్తారింట్లో విక్కీ అగచాట్లు..

విక్కీ ఉదయం స్నానం చేద్దామని బాత్రూం లోనికి వెళ్తాడు. ఆ తలుపుకి గడి ఉండదు. ఇప్పుడు ఎలా స్నానం చేయాలి అని చూస్తూ ఉంటాడు. చిలకమ్మ వచ్చి ఏంటి బాబు చూస్తున్నారు అని అడుగుతుంది. దీనికి గడి లేదు చిలకమ్మా ఎలా స్నానం చేయాలి అని అంటాడు. మీకు పాటలు పాడడం వస్తే పాటలు పాడుకుంటూ స్నానం చేయండి. అప్పుడు ఎవరైనా వచ్చినా కానీ మీ పాటలు విని వెళ్లిపోతారు. యాక్చువల్ గా నాకు పాటలు పాడడం చేతకాదు ఇప్పుడేం చేయాలి. నీకు నోటికి ఏ పదం వస్తే ఆ పదాన్ని రిపీటెడ్ గా అంటూ ఉండండి అప్పుడు మీరు బాత్రూంలో ఉన్నారని అనుకుంటారు. వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు అని అంటుంది చిలకమ్మా సరే నువ్వు వెళ్లి ఏదో ఒకటి చేస్తాలే అంటాడు విక్కీ. విక్కీ స్నానం చేద్దామని బాత్రూం లోకి వెళ్లి ఏమనాలి, ఇప్పుడు దీనికి లాక్ లేదు ఎలా అని అనుకుంటారు. ప్లీజ్ డోంట్ ఓపెన్ ప్లీజ్ డోంట్ ఓపెన్ అని అనుకుంటాడు. ఎప్పుడు ఫేస్ చేయనివి ఇక్కడ ఫేస్ చేయాలి.విజిల్ వేసుకుంటూ స్నానం చేస్తాడు.అప్పుడే అక్కడికి పద్మావతి వస్తుంది. విక్కి ని చూసి బాత్రూంలో ఒకసారి అరుస్తుంది. విక్కీ వెంటనే నీకు అసలు బుద్ధుందా స్నానం చేస్తుంటే లోపలికి వస్తావా ఏంటి అని అంటాడు. అసలు మీకు ఉందా డోర్ కి ఘడి వేసుకోకుండా స్నానం చేశారు అని అంటుంది. దీనికి డోర్ ఘడి ఉంటే ఎందుకు వేసుకోను అని అంటాడు.

రేపటి ఎపిసోడ్ లో కుచల, విక్కీ పద్మావతిని పిలిపించండి ఇందాకట్నుంచి అడుగుతున్నాము రాలేదు మేం చెప్పింది మీరు వినట్లేదు మా మీద గౌరవం లేదా ఏంటి అని,అంటుంది. అసలు మీ పద్మావతి కి కొంచెం కూడా ఏమీ లేదు కదా అందుకని ఇలా, మా వాడిని పెళ్లి చేసుకొని వచ్చింది చెప్పా పెట్టకుండా,అని అవమానిస్తుంది కుచల.ఆండాలు మధ్యలో మీరు మాట్లాడకండి అని అరుస్తుంది. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. అరవింద చూస్తావేంటి ఇకనుంచి వెళ్ళిపోదాం పద అని అంటుంది కుచల. అప్పుడే విక్కీ పద్మావతి అక్కడికి వస్తారు.


Share
Advertisements

Related posts

Sreeleela: పిచ్చ కోపంగా ఉన్న శ్రీ లీల – ఇలా అయితే నేను ఈ గుంటూరు కారం సినిమా చేయను అనేసింది !

sekhar

Nagarjuna Amala: పాపం నాగార్జున – అమల ఏం చేసిందో చూడండి .. ఎవ్వరికీ రాకూడని కష్టం ఇది !

sekhar

సినిమా ధియేటర్ లకు ఆడియన్స్ రావటం లేదు వ్యాఖ్యలపై ఎన్టీఆర్ రియాక్షన్..!!

sekhar