NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi 25 జూలై 157 ఎపిసోడ్: స్వప్న చేసిన యాడ్ ని చూసిన దుగ్గిరాల కుటుంబం..ఆమెని ఇంట్లో నుండి గెంటేయబోతున్నారా..?

Brahmamudi 25 July 2023 today 157 episode highlights

Brahmamudi 25 జూలై 157 ఎపిసోడ్: యాడ్ షూటింగ్ చేసుకొని ఇంటికి తిరిగి వస్తున్న స్వప్న ని చూసి కావ్య ఏంటి ఈ వేషం, ఎక్కడి నుండి వస్తున్నావ్ అని అడుగుతుంది. అప్పుడు స్వప్న నేను ఏమి వేసుకుంటే నీకెందుకు, ఎక్కడి నుండి వస్తే నీకెందుకు అని చాలా పొగరుగా సమాధానం చెప్తుంది. లోపల నిన్ను అందరూ ఈ డ్రెస్ లో చూస్తే ఏమవుతుందో తెలుసా అని కావ్య అనగా, నా సంగతి నేను చూసుకోగలను అని స్వప్న లోపలకు వెళ్తుంది.

Brahmamudi 25 July 2023 today 157 episode highlights
Brahmamudi 25 July 2023 today 157 episode highlights

Brahmamudi 24 జూలై 156 ఎపిసోడ్: యాడ్ షూట్ లో పాల్గొన్న స్వప్న..పుట్టింట్లో సంతోషంగా గడిపిన కావ్య!

కుటుంబ సబ్యులకు పొగరుగా సమాదానాలు చెప్పిన స్వప్న :

ఆమెని ఆ వేషం లో చూసిన ప్రతీ ఒక్కరు షాక్ కి గురి అవుతారు. ముందుగా అపర్ణ స్వప్న ని ఆపి ఏంటి ఈ వేషం అని అడుగుతుంది. అప్పుడు స్వప్న, బయట ఇదే లేటెస్ట్ ఫ్యాషన్,పెద్ద కుటుంబానికి చెందిన వాళ్ళు ఇలాగే ఉంటారు అని అంటుంది. అప్పుడు కావ్య స్వప్న ని కంట్రోల్ చెయ్యాలని చూడగా, ఏయ్ నువ్వెంటి నాకు చెప్పేది,ఇంట్లో నిన్ను అందరూ మెచ్చుకునేలోపు నా మీద డామినేషన్ చూపించాలని చూస్తున్నావా అని కావ్య ని కసురుతుంది.

Brahmamudi 25 July 2023 today 157 episode highlights
Brahmamudi 25 July 2023 today 157 episode highlights

Krishna Mukunda Murari: ఫంక్షన్ కి మురారిని రాకుండా ఆపిన ముకుందా.. నందుని మళ్లీ దగ్గరికి తీసిన భవానీ దేవి..

స్వప్న ని బయటకి గెంటేయండి అంటున్న రుద్రాణి :

దీనికి ఎంతో కోపగించుకున్న రాజ్, నీ భార్య ని కంట్రోల్ లో పెట్టుకో, ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది నేర్పించి అని రాహుల్ ని అంటాడు. అప్పుడు ఇందిరాదేవి ఇలాంటి దుస్తులతో బయటకి వెళ్తే దుగ్గిరాల కుటుంబం గురించి ఎంత అసహ్యంగా బయట మాట్లాడుకుంటారు? అని అడగగా, దానికి స్వప్న సమాధానం చెప్తూ ‘ఇది లేటెస్ట్ ఫ్యాషన్ బామ్మ, ఇంట్లోనే కూర్చొని ఉండే మీకు ఏమి తెలుసు వీటి గురించి’ అని అంటుంది. ఇలా పొగరుగా అందరికీ సమాధానం చెప్తున్నా స్వప్న ని చూసి, ఇందిరా దేవి కోపం తెచ్చుకొని రుద్రాణి మీద అరుస్తుంది. ఏంటి రుద్రాణి ఇదంతా, నీకు కోడలు ఏమైనా మామూలు మనిషి అనుకుంటున్నావా, ఆమెకి సంబంధించిన విషయాలు అన్నీ నువ్వే కదా చూసుకోవాలి అని అనగా, నాకు ఏమి సంబంధం అమ్మా, మీరే కదా ఈ దరిద్రాన్ని మా నెత్తి మీద పెట్టారు, ఆ అలగా జనాల్ని కొంపలోకి రానిస్తే ఇలాగే చేస్తారు, అది చేసిన పని మీకు ఇబ్బంది కలిగిస్తే బయటకి గెంటేయండి అని అంటుంది రుద్రాణి.

Brahmamudi 25 July 2023 today 157 episode highlights
Brahmamudi 25 July 2023 today 157 episode highlights

Nuvvu Nenu Prema : పద్మావతి జోలికి రావొద్దు అంటూ కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్రమాదిత్య..ఆ తర్వాత ఏమి జరిగిందంటే!

కావ్య ని అవమానించినందుకు రుద్రాణి కి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన రాజ్ :

అప్పుడు కావ్య రుద్రాణి మీద అరుస్తూ మా అక్క ఎదో తెలియకుండా చేసింది,దానికి మా ఇంట్లో వాళ్లంతా ఏమి చేసారు అని అంటుంది. చాలు లే ఆపు, నువ్వేమైనా తక్కువ మనిషి అనుకుంటున్నావా?,ముసుగు వేసుకొని అడ్డంగా ఇంట్లో వచ్చావ్, నేను ఇంటి పరువు కోసం ముసుగు వేసాను,కానీ నువ్వు దానికి ఒప్పుకొని వచ్చావు కదా, ఈ ఇంటికి ఆస్తిపరురాలు అవుదాం అని ఆశపడే కదా అలా చేసావు, లేకపోతే ముందుగానే ఈ విషయం ఇంట్లో చెప్పేదానివి అని అంటుంది రుద్రాణి. అప్పుడు రాజ్ తను చెప్పింది కధ అత్తా, పెళ్ళికి ముందే తన ముసుగుని తీసేసింది.జరిగింది మొత్తం చెప్పింది, నీ కొడుకు, నువ్వు చేసిన ఘానా కార్యాలకు దుగ్గిరాల పరువు నిలబడడం కోసం నేను, తన ఇంటి పరువు కాపాడుకోవడం కోసం కావ్య, ఇద్దరం పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఇంట్లోకి అడుగుపెట్టిన దగ్గర నుండి కావ్య ఏరోజు రోజు కూడా దుగ్గిరాల పరువు తీసే విధంగా నడుచుకోలేదు, అదే నీ కోడలిని చూసుకో ఎలా ఉందో. కావ్య ఇంట్లో వచ్చిన తర్వాత ఒక్క తప్పు జరిగినట్టు ఇంట్లో ఒక్కరి చేతనైనా చెప్పించు చూద్దాం అని అంటాడు. కోడల్ని అదుపు లో పెట్టుకోవడం చేత కానీ నువ్వు, కావ్య కుటుంబాన్ని అంటావా అని నిలదీస్తాడు. రాజ్ అడిగిన ప్రశ్నలకు రుద్రాణి వద్ద సమాధానం ఉండదు.సిగ్గు తలదించుకుంటుంది, అప్పుడు రాజ్ రాహుల్ ని పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేని నువ్వు ఏమి మొగాడివి, ఏమి మొగుడివి రా అని అంటాడు రాజ్. అప్పుడు రాహుల్ కోపం తో లోపాలకి రా స్వప్న అని పిల్చుకొని వెళ్తాడు.

Brahmamudi 25 July 2023 today 157 episode highlights
Brahmamudi 25 July 2023 today 157 episode highlights

ఇక మరోపక్క రాజ్ తన పై చూపించిన ఈ ప్రేమకి కావ్య ఎంతో మురిసిపోతుంది, తనని భార్య అంగీకరించాడు అనుకొని పొంగిపోతుంది. ఇలాగే అనుకొని అపర్ణ కూడా రాజ్ ని పక్కకి తీసుకెళ్లి, ఏంటిరా ఈమధ్య నీ భార్య మీద ఈగ కూడా వాలనివ్వడం లేదు?, మన కుటుంబాన్ని మొత్తం బజారుకి లాగి ఆ కావ్య తన హక్కులను ఎలా సాధించుకుందో మర్చిపోయావా ..?,నేను దానిని ఎప్పటికీ కోడల్ని చేసుకోలేను. జరిగిన విషయాలు నువ్వు మర్చిపోవచ్చు ఏమో కానీ, నేను మాత్రం ఎప్పటికీ మర్చిపోను అని అంటుంది. దీనికి రాజ్ నేను తనని ఒక తోటి మనిషిలాగానే చూస్తున్నాను, మీరెవ్వరు లేనప్పుడు నాకు సమస్య ఎదురైతే నా ప్రాణాలను కాపాడింది. ఆ కృతజ్ఞత మాత్రమే చూపిస్తున్నాను, తను ఎప్పటికీ నా భార్య కాలేదు అని అంటాడు.ఇదంతా విన్న కావ్య మనసు ఎంతో బాధపడుతుంది. ఇక మరుసటి ఎపిసోడ్ ప్రోమో లో స్వప్న నటించిన యాడ్ టెలికాస్ట్ ని చూసి అందరూ షాక్ కి గురి అవుతారు. మీడియా మొత్తం దుగ్గిరాల ఇంటికి వచ్చేస్తుంది. ఇంత జరిగిన తర్వాత కూడా దీనిని ఈ ఇంట్లో ఉంచడం కరెక్ట్ కాదు , వెంటనే గెంటేయండి అంటి అంటుంది రుద్రాణి. తర్వాత ఏమి జరిగిందో చూడాలి.

Related posts

Nayanthara: మేక‌ప్ అవ‌స‌ర‌మా.. నిన్నెవ‌రు చూస్తారంటూ న‌య‌న‌తార‌ను ముఖం మీదే అనేసిన ఎన్టీఆర్‌.. అస‌లేమైందంటే?

kavya N

Balakrishna: మ‌ద్యం బాటిల్ తో బాల‌య్య‌.. అస‌లు నిజం బ‌య‌ట‌పెట్టిన నిర్మాత నాగ వంశీ.. ఇంత‌కీ అంజలిని ఎందుకు తోశారంటే?

kavya N

Karthika Deepam 2 May 30th 2024: నరసింహ ని హోటల్ నుంచి తరిమికొట్టిన కడియం.. కార్తీక్ మాస్టర్ ప్లాన్ అదుర్స్..!

Saranya Koduri

Darling Movie Child Artist: డార్లింగ్ మూవీలో కాజ‌ల్ త‌మ్ముడు గుర్తున్నాడా.. ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి మూవీని రిజెక్ట్ చేసిన హీరో ఎవ‌రు.. విశ్వ‌క్ సేన్ చేతికి ఈ ప్రాజెక్ట్ ఎలా వ‌చ్చింది..?

kavya N

NTR: వందల పాత్రల్లో మెప్పించిన ఎన్టీఆర్.. హనుమంతుడి పాత్ర ఎందుకు వేయలేదు..?

Saranya Koduri

Sudigali Sudheer: పెళ్లి కాకముందే తండ్రి అయిన గాలోడు.. కూతురు ఎవరో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Vijay Antony: జీవితంలో ఇక చెప్పులు వేసుకోను.. విజ‌య్ ఆంటోని షాకింగ్ నిర్ణ‌యం వెన‌క కార‌ణం ఏంటి..?

kavya N

Pallavi Prashant: కొత్త కారు కొన్న బిగ్ బాస్ బిడ్డ.. ఆ నటుడు చేత ఫస్ట్ డ్రైవింగ్..!

Saranya Koduri

Maharaj OTT: నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న అమీర్ ఖాన్ తమ్ముడి తొలి ప్రాజెక్ట్..‌!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 30 Episode 637: విక్కీకి అరవింద ఫోన్.. తన పాప గురించి అరా.. మేనకోడలు కోసం విక్కీ వెతుకులాట.. అను ఆర్యా ల నిర్ణయం..

bharani jella

Brahmamudi May 30 Episode 423: మాయతో రాజ్ పెళ్లికి ఒప్పుకున్న కావ్య.. మాయ మీద స్వప్న అనుమానం..కోడల్ని అసహ్యించుకున్న అపర్ణ.

bharani jella

Krishna Mukunda Murari May 30 Episode 483: మీరానే ముకుందా అన్న నిజం ప్రభాకర్ కి తెలియనుందా? ఆదర్శ్ మీద భవాని కోపం.. మురారి కోసం రంగంలోకి పోలీసులు..

bharani jella

Pushpa 2: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ నుంచి రెండో పాట రిలీజ్..!!

sekhar

Karthika Deepam 2 May 29th 2024: శౌర్యని కలిసిన నరసింహ.. దీపకి వార్నింగ్..!

Saranya Koduri