NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema : పద్మావతి జోలికి రావొద్దు అంటూ కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్రమాదిత్య..ఆ తర్వాత ఏమి జరిగిందంటే!

Nuvvu Nenu Prema జులై 12 ఎపిసోడ్ 360: నువ్వు నేను ప్రేమ ఈ రోజు ఎపిసోడ్ 360 ఇలా మొదలవుతుంది…అనుకోని సంఘటనలు జరిగి ఒక్కసారిగా అయినా వాళ్ళందరూ దూరం అవ్వడం తో పద్మావతి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. మరోపక్క రూమ్ లో తల పట్టుకొని విక్రమాదిత్య కూడా దిగాలుగా కూర్చొని ఉంటాడు. పద్మావతి రూమ్ కి వెళ్ళగానే విక్రమాదిత్య ప్రశాంతం గా కూర్చోవడం చూసి, నాకు ఇన్ని కష్టాలను ఇచ్చి ఏమి జరగనట్టు అంత సైలెంట్ గా కూర్చొని ఉన్నారు ఏంటి, అసలు నా మీద అకస్మాత్తుగా ఇంత ద్వేషం ఎందుకు పెంచుకున్నారు, ఎందుకు నా మేడలో తాళికట్టారు అని ఏడుస్తుంది.

Nuvvu Neenu Prema 12 July 2023 Today Episode 360 Highlights
Nuvvu Nenu Prema 12 July 2023 Today Episode 360 Highlights

విక్రమాదిత్య ని చొక్కా పట్టుకొని నిలదీసిన పద్మావతి :

అప్పుడు విక్రమాదిత్య కోపం గా పైకి లేచి వెళ్తుండగా, పద్మావతి అతడిని ఆపి, ఈరోజు మీరు సమాధానం చెప్పకుండా ఇక్కడి నుండి కదలలేరు అని ఆపుతుంది. అనాదలాగా పడి ఉన్న నన్ను చేరదీసి, సొంత బిడ్డలాగా చాకినా  అమ్మానాన్న నేడు నన్ను ఒంటరి దానిని చేసి వెళ్లిపోయారు. నన్నే ప్రాణంగా భావించే నా అక్క కూడా నేను ఎవరో తెలియనట్టు ప్రవర్తిస్తుంది. ఇదంతా జరగడానికి కారణం మీరే అని నిలదీస్తుంది.

Nuvvu Neenu Prema 12 July 2023 Today Episode 360 Highlights
Nuvvu Nenu Prema 12 July 2023 Today Episode 360 Highlights

Nuvvu Nenu Prema: నువ్వు చేసిన నమ్మకద్రోహానికి నీకు ఈ శిక్ష పడాల్సిందే అంటూ పద్మావతి ని వారించిన విక్రమాదిత్య :

అసలు నేను ఏమి తప్పు చేశాను అని నాకు ఇంత శిక్ష వేశారు, సమాధానం చెప్పే ధైర్యం లేనప్పుడు నా మేడలో ఈ మూడు ముళ్ళు ఎందుకు వేశారు. సమాధానం చెప్పండి అంటూ పద్మావతి విక్రమాదిత్య చొక్కాని పట్టుకొని నిలదీస్తుంది. అప్పుడు విక్రమాదిత్య పద్మావతి ని వెనక్కి తీసుకొని వెళ్లి గోడకి ఆనించి, ఏమి తెలియనట్టు, నువ్వు ఏ తప్పు చెయ్యనట్టు ఎందుకు బాధని నటిస్తున్నావు.

Nuvvu Neenu Prema 12 July 2023 Today Episode 360 Highlights
Nuvvu Nenu Prema 12 July 2023 Today Episode 360 Highlights

నమ్మినందుకు ఇంట్లో వాళ్లందరికీ నమ్మక ద్రోహం చేసావు, ఇప్పుడు నువ్వు ఏడుస్తూ కూర్చుంటే నీ మీద జాలి చూపిస్తాను అనుకున్నావా?, నువ్వు చేసిన పాపానికి నీకు ఈ శిక్ష పడాల్సిందే అని అంటాడు విక్రమాదిత్య. అప్పుడు పద్మావతి కన్నీళ్లు పెట్టుకొని అంత పాపం నేను ఏమి చేశాను అని అంటుంది. నీకు తెలియదా ? అని అంటాడు విక్రమాదిత్య, నాకు తెలియదు తెలియదు అంటూ బిగ్గరగా అరుస్తుంది. అప్పుడు విక్రమాదిత్య కోపం తో  నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కేవలం నువ్వు ఆరు నెలలు మాత్రమే నాకు భార్య వి, అది కూడా సమాజం దృష్టిలో మాత్రమే, నా మనసులో నీకు భార్య స్థానం లేదు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అప్పుడు పద్మావతి శ్రీనివాస నా మీద అంత ప్రేమ చూపించిన వాడు, ఇప్పుడు ఇంత ద్వేషం చూపిస్తున్నాడు, నేను ఏమి తప్పు చేశాను అంటూ ఏడుస్తూ కూర్చుంటుంది.

Nuvvu Neenu Prema 12 July 2023 Today Episode 360 Highlights
Nuvvu Nenu Prema 12 July 2023 Today Episode 360 Highlights

పద్మావతి జోలికి రావొద్దు అంటూ కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్రమాదిత్య:

మరోపక్క కృష్ణ పద్మావతి ని పెళ్లి చేసుకొని సుఖంగా జీవించాలి అని అనుకుంటే ఈ విక్కీ వచ్చి మొత్తం నాశనం చేసేసాడు, నిన్ను వదిలిపెట్టను విక్కీ అని మనసులో అనుకుంటాడు. ఇంతలోపే విక్రమాదిత్య కార్ నుండి దిగి కృష్ణ దగ్గరకి వస్తాడు. ఏంటి నువ్వు అనుకున్నది ఏమి జరగలేదని భాదపడుతున్నావా అని అంటాడు విక్రమాదిత్య. నన్ను పద్మావతి ని వేరు చెయ్యడానికే కదా నువ్వు ఈ పెళ్లి చేసుకున్నావు అని అంటాడు కృష్ణ, నువ్వు ఏమి అనుకున్నా పర్వాలేదు, ఇక నుండి పద్మావతి నా భార్య, పొరపాటున కానీ నీ నీడ ఆ అమ్మాయి మీద పడినా నా విశ్వరూపం చూస్తావు, మా అక్క కడుపులో బిడ్డ పెరుగుతుంది కాబట్టి నువ్వు బ్రతికిపోయావ్, లేకుంటే నిన్ను ఈ లోకం లోనే లేకుండా చేసేవాడిని, నీకు మరో చివరి అవకాశం ఇస్తున్న, పుట్టే బిడ్డతో అక్కతో కలిసి సక్రమంగా కాపురం చేసుకో, కాదని తోక జాడిస్తే కత్తిరిస్తాను, అక్క కోసం ఏదైనా చెయ్యగలను ఎంత దూరం అయినా వెళ్ళగలను అని నీకు పద్మావతి విషయం లోనే అర్థం అయ్యుంటాది, కాబట్టి జాగ్రత్తగా బ్రతుకు అని వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు.

Nuvvu Neenu Prema 12 July 2023 Today Episode 360 Highlights
Nuvvu Nenu Prema 12 July 2023 Today Episode 360 Highlights

ఇక రేపటి ఎపిసోడ్ లో కుచేలా కొత్త వచ్చిన కోడలి చేత దీపం వెలిగిస్తుంది. పద్మావతి కూడా కొత్త కోడలే కదా తనతో కూడా దీపం వెలిగించండి అని ఆర్య అంటాడు. అప్పుడు కుచేలా మాయమాటలు చెప్పి మా విక్కీ ని పెళ్లి చేసుకున్నందుకు కేవలం అతని ముఖం చూసి ఇంట్లో నీకు ఒక మూల స్థానం ఇచ్చాము, అంతే కానీ కోడలిగా ఫీల్ అవ్వకు అని పద్మావతి ని అవమానిస్తుంది, తర్వాత ఏమి జరిగింది అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

Related posts

Kalki2898AD: ప్రభాస్ “కల్కి2898AD” బుజ్జి గ్లింప్స్ టీజర్ రిలీజ్..!!

sekhar

Telugu Movie: అమెరికాలో షూటింగ్ జ‌రుపుకున్న తొలి తెలుగు చిత్రం ఏ హీరోదో తెలుసా..?

kavya N

Godavari: ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో స‌హా గోదావ‌రి వంటి క్లాసిక్ హిట్ ను మిస్సైయిన‌ స్టార్ హీరోలు ఎవ‌రో తెలుసా..?

kavya N

Blink OTT: డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తా చాటుతున్న కన్నడ థ్రిల్లర్ మూవీ..!

Saranya Koduri

Maidaan OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన 235 కోట్ల బడ్జెట్ మూవీ..!

Saranya Koduri

OTT: భారీ ధరకు అమ్ముడుపోయిన అజిత్ మూవీ డిజిటల్ హక్కులు..!

Saranya Koduri

Bigg Boss: బిగ్బాస్ ముద్దుగుమ్మ కి చేదు అనుభవం.. రూ. 15 లక్షలు లాస్..!

Saranya Koduri

Hema: చేసిన పనిని వెనకేసుకొస్తు వీడియోను రిలీజ్ చేసిన హేమ.. ఘోరంగా తిట్టిపోస్తున్న నెటిజెన్స్..!

Saranya Koduri

Kajal Aggarwal: ఏంటీ.. మ‌హేష్ న‌టించిన ఆ డిజాస్ట‌ర్ మూవీ అంటే కాజ‌ల్ కు అంత ఇష్ట‌మా..?

kavya N

Karthika Deepam 2 May 22th 2024 Episode: నరసింహని కటకటాల పాలు చేసిన కార్తీక్.. తండ్రిగా ఎందుకు సంతకం పెట్టావ్ అంటూ నిలదీసిన దీప..!

Saranya Koduri

Brahmamudi May 22 Episode  416:దుగ్గిరాల ఇంట్లోకి మాయలేడి ఎంట్రీ.. కావ్య పై రాజ్ కోపం.. నకిలీ మాయ ని తీసుకొచ్చిన రుద్రాణి డెవిల్ ప్లాన్..?

bharani jella

Nuvvu Nenu Prema May 22 Episode 630: అరవింద కోసం పద్మావతి చేసిన పని..? పద్మావతిని అపార్థం చేసుకొని కొట్టిన విక్కి..

bharani jella

Krishna Mukunda Murari May 22 Episode 476:ఆదర్శ్ మీరాల పెళ్ళికి భవానీ తొందర..ముకుంద చేత నిజం బయటపెట్టించిన కృష్ణ..రేపటి ట్వీస్ట్…?

bharani jella

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N