NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi 24 జూలై 156 ఎపిసోడ్: యాడ్ షూట్ లో పాల్గొన్న స్వప్న..పుట్టింట్లో సంతోషంగా గడిపిన కావ్య!

Brahmamudi 24 July 2023 Today 156 episode highlights

Brahmamudi 24 జూలై 156 ఎపిసోడ్: కావ్య ని రాజ్ తన పుట్టింట్లో విడిచిపెడుతాడు. ఒక్కసారి లోపలకి వచ్చి వెళ్లొచ్చు కదా అని కావ్య అంటుంది, నేను నిన్ను డ్రాప్ చేస్తా అని చెప్పాను , లోపలకు వస్తానని చెప్పలేదు అని అంటాడు రాజ్. అప్పుడు కావ్య ఒక 5 నిమిషాలు వచ్చి వెళ్తే ఏమి అవుతుంది అని అడగగా, ఆఫీస్ లో నాకోసం చాలామంది ఎదురు చూస్తున్నారు, నువ్వు వెళ్ళు అని చెప్పేసి వెళ్తాడు. ఇక లోపలకు ఎంతో సంతోషంగా వెళ్ళగానే కావ్య వచ్చినందుకు అందరూ ఆనందిస్తారు.

Brahmamudi 24 July 2023 Today 156 episode highlights
Brahmamudi 24 July 2023 Today 156 episode highlights

Brahmamudi 22 జూలై 155 ఎపిసోడ్: కావ్య ని పుట్టింట్లో దింపిన రాజ్..ధాన్య లక్ష్మి ని దారుణంగా అవమానించిన స్వప్న..కన్నీళ్లు పెట్టుకున్న ధాన్య లక్ష్మి!

కావ్యని చాలా కాలం తర్వాత చూసినందుకు ఎంతో సంతోషించిన కనకం – మూర్తి :

అయితే నేను కష్టపడి నా భర్త కంపెనీ కోసం వేసిన కొన్ని డిజైన్స్ ని చూసి, ఆయన ఎంతో మెచ్చుకొని నాకు డబ్బులు ఇచ్చారు,అవి ఇద్దామని వచ్చాను అని అంటుంది కావ్య. అప్పుడు కనకం నువ్వు ఈ ఇంట్లో ఉన్నప్పుడు నీ కష్టం మీదనే బ్రతికాము, అకెక్కడికి వెళ్లిన తర్వాత కూడా నీ కష్టం మీదనే బ్రతకాలా కావ్యా అని అంటుంది కనకం.

Brahmamudi 24 July 2023 Today 156 episode highlights
Brahmamudi 24 July 2023 Today 156 episode highlights

Nuvvu Nenu Prema: విక్కీకి ఐ హేట్ యు అని చెప్పిన పద్మావతి.. కొత్త విలన్ జలజ ఎంట్రీ..

కావ్య ఇచ్చే డబ్బులను తీసుకోడానికి ఇష్టపడని మూర్తి :

కావ్య అలా డబ్బులు ఇవ్వడానికి మరోపక్క మూర్తి ఒప్పుకోడు. మీ అత్తారింటి డబ్బుని నువ్వు మాకు ఇస్తే మేము మిమల్ని దోచేస్తున్నాం అని అనుకుంటారు , దయచేసి వద్దు అమ్మా అని అంటాడు మూర్తి. అప్పుడు కావ్య నేను పరాయి దానిని కాదు కదా నాన్న అని అంటుంది. దానికి మూర్తి సమాధానం ఇస్తూ పరాయి దానివే, ఒక్కసారి ఈ ఇంటి గడప దాటి ఆ ఇంటి మహాలక్ష్మి అయ్యాక, అక్కడి సొమ్ము ఆశించడం కరెక్ట్ కాదు. డబ్బు విషయం లో నువ్వు మాకు పరాయి దానివే అమ్మా అని అంటాడు మూర్తి. అప్పుడు కావ్య ఇది నేను కష్టపడి సంపాదించిన డబ్బు, దీనిని నేను ఇందుకోసం ఖర్చు చెయ్యబోతున్నానో మా ఆయనకీ చెప్పే ప్రయత్నం చేయగా, అది నీ కష్టం, నీ టాలెంట్ నువ్వు ఏమైనా చేసుకోవచ్చు అని అన్నాడు నాన్న, ఆ ఇంట్లో నా సంపాదన నీటి బిందువు లాంటిది. ఆ నీటి బిందువు ఎక్కడికి చేరింది అనే విషయాన్నీ ఎవ్వరూ పట్టించుకోరు. మీ ఆత్మాభిమానం పక్కన పెట్టి ఈ డబ్బుని తీసుకోండి నాన్న అంటుంది. మీ అమ్మకి ఇవ్వు అమ్మా అని అంటాడు మూర్తి.

Krishna Mukunda Murari: కృష్ణ ముందే మురారి చెయ్యి పట్టుకుని తీసుకెళ్లిన ముకుంద.. రేపటికి సూపర్ ట్విస్ట్..

Brahmamudi 24 July 2023 Today 156 episode highlights
Brahmamudi 24 July 2023 Today 156 episode highlights

యాడ్ షూటింగ్ లో పాల్గొన్న స్వప్న :

అప్పుడు కనకం చేతిలో ఏమి దాచిపెట్టావ్ చూపించు అని అడగగా, ఆమె చెవిపోగులు కనిపిస్తాయి. నీకు మిగిలిన ఏకైక చెవిపోగులు అమ్మే దుస్థితి వచ్చిందా ఇంట్లో అని కావ్య అడుగుతుంది. అప్పుడు కనకం అన్నపూర్ణ కి వచ్చిన జబ్బు గురించి చెప్తుంది. ఇక లోపలకు వెళ్లి అన్నపూర్ణ తో మాట్లాడి, నీకు ఆరోగ్యం సరి అయ్యేవరకు నీ ఖర్చు మొత్తం నేనే భరిస్తాను పెద్దమ్మా అని ఆమెతో ప్రేమగా కాసేపు మాట్లాడి , ఇంట్లో అమ్మ చేతి వంట తిని, అలా సంతోషంగా ఆ రోజు మొత్తం గడుపుతుంది కావ్య. మరోపక్క స్వప్న ధాన్య లక్ష్మి ని అవమానించడాన్ని వాడుకొని స్వప్న ని ఇంటి నుండి బయటకి పంపాలని అనుకుంటుంది రుద్రాణి. ఏమి జరిగింది ధాన్య లక్ష్మి అంత డల్ గా ఉన్నావు అని అడగగా, మీ కోడలు పిచ్చి బట్టలు వేసుకున్నందుకు మంచి బట్టలు వేసుకో అని నేను అన్న పాపానికి నన్ను నానా మాటలు అనేసి వెళ్ళింది అని అంటుంది.

Brahmamudi 24 July 2023 Today 156 episode highlights
Brahmamudi 24 July 2023 Today 156 episode highlights

అప్పుడు రుద్రాణి నిన్నే అవమానిస్తుందా, ఇంటికి రానివ్వు దాని సంగతి చెప్తా అని ఇంట్లో ఉన్నవాళ్లందరిని పిలిచి గొడవ పెట్టడానికి సిద్ధం గా ఉంటుంది రుద్రాణి. మరో పక్క యాడ్ షూటింగ్ కి హాజరైన స్వప్న ని డైరెక్టర్ కలుస్తాడు, ఆ తర్వాత రాజ్ డైరెక్టర్ కి ఫోన్ చేసి ఈ యాడ్ షూట్ చాలా బోల్డ్ గా ఉండాలి, కుర్రాళ్ళు మెంటలెక్కిపోయేలా చెయ్యాలి, పెద్దవాళ్ళు చూస్తే అసహ్యించుకునేలా ఉండాలి అని అంటాడు. అప్పుడు యాడ్ డైరెక్టర్ నేను చూసుకుంటా, నాకు వదిలేయ్ అని అంటాడు, ఆ తర్వాత ఏమి జరిగింది అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

Related posts

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Saranya Koduri

Anchor Shyamala: 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అటువంటి పనులు చేశాను.. యాంకర్ శ్యామల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Pushpa 2 lyrical Video Response: 24 గంటల్లోనే యూట్యూబ్ ను మోత మోగిస్తున్న పుష్ప రాజ్.. ఏకంగా అన్ని దేశాల్లో ట్రెండింగ్..!

Saranya Koduri

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 4th 2024 Episode: కొడుకును ఈడ్చి కొట్టిన అనసూయ.. కార్తీక్‌, దీపకి అక్రమ సంబంధం అంటూ నీచంగా మాట్లాడిన నరసింహ..!

Saranya Koduri

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Mamagaru: గంగాధర్ ని ఆ పొజిషన్లో చూసి గంగను తిట్టిన చంగయ్య..

siddhu

Brahmamudi May 4 2024 Episode 401:రుద్రాణి నే బురిడీ కొట్టించి కోటి కాజేసిన స్వప్న.. రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ అని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

bharani jella

Naga Panchami: సిద్ధాంతి గారు చెప్పినట్లుగా పంచమి జ్వాలా మధ్యలో గొడవలు మొదలవుతాయా లేదా.

siddhu

Nuvvu Nenu Prema May 4 Episode 615 :అరవింద సమక్షంలో దండలు మార్చుకున్న విక్కీ పద్మావతి.. కృష్ణ నిజస్వరూపం అరవింద కు తెలియనుందా?

bharani jella