NewsOrbit
Entertainment News Telugu TV Serials

Prema Entha Madhuram December 14 2023 Episode 1125:  షాపింగ్ మాల్ లో ఆర్య కి అవమానం..

Prema Entha Madhuram Today Episode December 14 2023 Episode 1125 Highlights

Prema Entha Madhuram December 14 2023 Episode 1125:  సార్ ఏంటి సార్ ఈ గొడవ అంతా మీరు తలుచుకుంటే ఈ షాపింగ్ మాల్నే కొనగలరు మీరెందుకు సార్ అంతలా ఆలోచిస్తున్నారు అని యాదగిరి అంటాడు. యాదగిరి నీకు చెప్పిన అర్థం కాదులే నువ్వు వెళ్లి వాళ్ళ సంగతి చూడు నేను డబ్బులు ఏర్పాటు చేస్తాను అని ఆర్య అంటాడు. యాదగిరి ఇదంతా చూస్తుంటే నాకెందుకు ఓ డౌట్ గా ఉంది అని అను అంటుంది. నేను అదే చెప్తున్నాను మేడం పుణ్యానికి వస్తే బట్టలు కొని షాపు పెట్టేలా ఉన్నారు వాళ్ళు సార్ కి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు అని యాదగిరి అన్నాడు. సరే ఇప్పుడు మనం ఏం చేయలేము కదా పద వెళ్దాం అని అను అంటుంది.అను గారు మీరు నాకు డ్రెస్సులు సెలెక్ట్ చేదురు గాని రండి అని ఉష అంటుంది. కట్ చేస్తే, అందరూ 20 30 వేల బట్టలు తీసుకుంటూ ఉంటారు. అవి చూసి సుగుణ ఏం చేయాలో అర్థం కాక సతమతం అవుతుంది. ఆంటీ వీళ్ళు కావాలని ఇదంతా చేస్తున్నారనుకుంటా ఒకసారి దివ్య అని పిలిచి వాళ్ళకి తక్కువ మొత్తంలో బట్టలు తీసుకునేలా చెప్పండి తనే హరీష్ కి చెప్తుంది అని అను అంటుంది. దివ్య ఒకసారి ఇలా రామ్మ అని సుగుణ పిలుస్తుంది.

Prema Entha Madhuram Today Episode December 14 2023 Episode 1125 Highlights
Prema Entha Madhuram Today Episode December 14 2023 Episode 1125 Highlights

ఏంటో చెప్పమ్మా అని దివ్య అంటుంది. దివ్య వాళ్ళు చూస్తే 20,000 30,000 చీరలు తీసుకుంటున్నారు మన దగ్గరేమో అంత మొత్తంలో డబ్బు లేదు హరీష్ కి నువ్వు నచ్చ చెప్పమ్మా అని సుగుణ అంటుంది. నీ కొడుకు డబ్బులు ఏర్పాటు చేస్తానన్నాడు కదా నన్నేం చేయమంటావ్ అని దివ్య అంటుంది. అదేంటి దివ్య అలా అంటావ్ వాళ్ళు ఇలా చేస్తారని  ఎవరు మాత్రం అనుకుంటారు వాళ్లు లక్షల్లో బట్టలు చూస్తున్నారు అంత డబ్బు మన దగ్గర ఎక్కడిది అని సుగుణ అంటుంది. అవన్నీ షాపింగ్ రాకముందే ఉండాలమ్మా ఇప్పుడు చెప్తే నా పరువు పోతుంది నేను చెప్పను అని దివ్య అంటుంది. అది కాదు దివ్య మీ అన్నయ్య పరిస్థితి నీకు కూడా తెలుసు కదా ఎందుకు అలా మాట్లాడుతున్నావ్ అని అను అంటుంది. అది మాట ఇచ్చే ముందు ఆలోచించాలండి షాపింగ్ మాల్ కి వచ్చాక చెప్తే మన పరువు పోతుంది మీ తిప్పలేవు మీరు పడండి నేనేమీ చేయలేను అని దివ్య వెళ్ళిపోతుంది. అమ్మ వీళ్ళు పెళ్లికూతురు పెళ్ళికొడుకు బట్టలు తప్ప అందరూ కొనుకుంటున్నారు అని ఉష అంటుంది.

Prema Entha Madhuram Today Episode December 14 2023 Episode 1125 Highlights
Prema Entha Madhuram Today Episode December 14 2023 Episode 1125 Highlights

ఏంటి వదిన గారు మీ చిన్నమ్మాయి అలా మాట్లాడుతుంది ఏంటి అని వాళ్ళ వియకురాలు ఉంటుంది. మా చిన్నమ్మాయికి కొంచెం మాట దుడుకుతనం ఎక్కువ అండి మీరేమీ అనుకోకండి అని సుగుణ అంటుంది. అను గారు మీరు నాకు డ్రెస్సులు సెలెక్ట్ చేయద్దురుగాని రండి అని ఉష అను ని తీసుకుని వెళుతుంది. కట్ చేస్తే, వాళ్లందరూ ఇవి బాలేవు అవి బాలేవు అని చూస్తూ ఉంటారు. ఆర్య ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో సంపత్ ఆఫీసులో ఒక అతనికి ఫోన్ చేసి ఈరోజు నేను రాలేను సార్ కి నువ్వు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చెయ్యి అని అంటాడు. అను వాళ్ళు బట్టలు తీసుకునే షాపింగ్ మాల్ లోనే సంపత్ కూడా బట్టలు తీసుకుంటూ ఉంటాడు. ఉష ఈ డ్రెస్సులు బాగున్నాయి ఇవి ఒకసారి ట్రయల్ వేసి  రా అని అను అంటుంది. ట్రయల్ వేయడానికి ఉష వెళుతుంది. సంపత్ కూడా రెండు డ్రస్సులు సెలెక్ట్ చేసుకుని ట్రయల్ వేయడానికి వెళ్తాడు. ఉషా కి సంపతు  చూసుకోకుండా డాష్ ఇస్తాడు సంపత్. సారీ అండీ అని సంపత్ అంటాడు. పర్వాలేదండి అని ఉష ట్రయల్ రూమ్ లోకి వెళుతుంది. ఇంతలో అను ఈ డ్రెస్ కూడా ట్రయల్ వెయ్యి ఉష అని ఇస్తుంది. అను ని చూసిన సంపత్ అను అని గట్టిగా పిలుస్తాడు. తన దగ్గరికి వెళ్లి ఏంటి అను ఎక్కడికి వెళ్ళిపోయావు ఏమైపోయావ్ ఆర్య సార్ దగ్గర ఉండట్లేదు ఎందుకు అని సంపత్ అంటాడు.

Prema Entha Madhuram Today Episode December 14 2023 Episode 1125 Highlights
Prema Entha Madhuram Today Episode December 14 2023 Episode 1125 Highlights

ఏంటి రాధ గారు ఇతని మీకు తెలుసా అని ఉష అంటుంది. నువ్వు ఇలా రా ఉషా అని ఉషాన్ని తీసుకొని వెళుతుంది అను. ఆగు అను  ఎందుకు వెళ్ళిపోతున్నావ్ నాకు సమాధానం చెప్పు ఆంటీని అంకుల్ని నేను కలిశాను నువ్వు పిల్లల్ని తీసుకొని ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయారని వాళ్ళు బాధపడ్డారు అసలు ఎక్కడికి వెళ్లి పోయావా నువ్వు నీకు ఫ్రెండును కదా నాకు కూడా చెప్పకూడదా అని సంపత్ అంటాడు. ఉష ఒక్క నిమిషం నువ్వు అటు వెళ్ళావా నేను వెంటనే వచ్చేస్తాను అని అను అంటుంది. ఉష ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. ఇప్పుడు చెప్పు అను ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు ఆర్య సార్ దగ్గర ఎందుకు ఉండట్లేదు అని సంపత్ అంటాడు. సంపత్  ఇప్పుడు నేను ఏమీ చెప్పలేను నువ్వు నా ఫ్రెండ్ వే కదా అర్థం చేసుకో అని అను అంటుంది. సరే అను ఇప్పుడు నేను ఏమి అడిగినా నువ్వు చెప్పవని నాకు అర్థమైపోయింది కానీ నా విస్టింగ్ కార్డు తీసుకో నువ్వు నాకు ఫోన్ చెయ్ అని సంపత్ వెళ్ళిపోతాడు.

Prema Entha Madhuram Today Episode December 14 2023 Episode 1125 Highlights
Prema Entha Madhuram Today Episode December 14 2023 Episode 1125 Highlights

అను ఉష దగ్గరికి వెళ్తుంది.ఏంటి రాధ గారు అతను నిన్ను అను అంటున్నాడు ఆర్య సార్ అంటున్నాడు ఏంటి మీ బంధువులు  ఊర్లోనే ఉన్నారా అని ఉష అడుగుతుంది. ఉష ఇప్పుడు నేను ఏమీ చెప్పలేను నన్ను ఏమీ అడగకు అని అను అంటుంది. కట్ చేస్తే, దివ్య  ఇంకోటి తీసుకో అది బాగోలేదు అని హరీష్ అంటాడు. ఈ చీర ఎలాగా ఉంది హరీష్ అని దివ్య అడుగుతుంది. బాగానే ఉంది దివ్య దీంతో పాటు నాలుగైదు చీరలు తీసుకో రిసెప్షన్ కి పెళ్లికి పనికొస్తాయి అని హరీష్ అంటాడు. హరీష్ ఈ కోటు చూడు ఎలా ఉంది అని దివ్య అడుగుతుంది. చాలా బాగుంది దివ్య అని హరీష్ అంటాడు. దాంతోపాటు నాలుగైదు తీసుకో నాన్న అలా పడుంటాయి నువ్వు సూట్ వస్తే హీరోలా ఉంటావు అని వాళ్ళ అమ్మ అంటుంది. అవును మా వాడు దొరకడం నీ అదృష్టం  దివ్య మా వాడు సినిమా హీరోలా ఉంటాడు ఏ డ్రెస్ వేసిన వాడి కోసమే తయారు చేసినట్టు ఉంటుంది అని వాళ్ళ చిన్న అత్తయ్య అంటుంది. ఏవండీ మీరు కూడా ఇంకో నాలుగు సూట్లు తీసుకోండి పండగలకి పబ్బాలకు పనికొస్తాయి అని వాళ్ళ ఆవిడ అంటుంది. ఆంటీ సూర్య ఎందుకు అలా మౌనంగా ఉన్నాడు వాళ్లు ఇదంతా కావాలనే చేస్తున్నారనుకుంటా మీరేనా సార్ కి చెప్పొచ్చు కదా అని అను అంటుంది. ఇప్పుడు ఏమి చెప్పలేనమ్మ వాడు ఎందుకు అలా ఉన్నాడు నాకు కూడా తెలియదు అని సుగుణ అంటుంది.

Prema Entha Madhuram Today Episode December 14 2023 Episode 1125 Highlights
Prema Entha Madhuram Today Episode December 14 2023 Episode 1125 Highlights

బావగారు మీరు కూడా ఒక సూట్ తీసుకోండి పెళ్లికి వేసుకుందువు గాని డబ్బుల గురించి ఏమీ ఆలోచించకు నేను గిఫ్ట్ గా ఇస్తున్నాను అని హరీష్ అంటాడు. వద్దులే బావగారు మీరు తీసుకోండి అని ఆర్య అంటాడు. అతనికి సూటు ఇచ్చిన వేసుకుంటే అంత బాగోదు రా సూట్ వేసుకున్న గాని సూటవలరా అని వాళ్ళ పిన్ని అంటుంది. అవును అతనికి అవేవీ సూటు కావు తను ఏమీ చదువుకోలేదు కదా అని ఎగతాళి చేసి అందరూ పకపకా నవ్వుతారు. రేయ్ మీ అదృష్టం బాగుండి ఆయన నిజ స్వరూపం మీకు తెలియట్లేదు రా సూటు వేసుకుంటే నువ్వు కొయ్యలా ఉంటావు కానీ ఆయన హీరోలా ఉంటాడు రా అని యాదగిరి మనసులో అనుకుంటాడు. ఏంటి ఆంటీ మీ అబ్బాయిని అలా ఎగతాళి చేసి మాట్లాడుతుంటే ఏమీ మాట్లాడరేంటి అని అను అంటుంది. ఆడపిల్ల వాళ్ళం కాదమ్మా వాళ్లు ఏం చేసినా భరించాల్సిందే పైగా ఇప్పుడు ఏమి మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాము అని సుగుణ అంటుంది. అలాగని అవమానిస్తుంటే చూస్తూ ఊరుకుంటారా ఆంటీ అని అను అంటుంది.

తప్పదు కదా అమ్మ ఆడపిల్లను ఇచ్చే వాళ్ళం లొంగి ఉండాలి అని సుగుణ అంటుంది. ఆర్య వాళ్ళు ఎగతాళి చేసి మాట్లాడుతుంటే మౌనంగా చూస్తూ ఉండిపోతాడు.బావగారు ఏం పర్వాలేదు ఒక్కసారి ఈ సూట్ వేసుకొని రండి అని హరీష్ అంటాడు. నాకేమీ వద్దులే హరీష్ మీరు తీసుకోండి అని ఆర్య అంటాడు. సార్ వాళ్లు అంతగానం అంటూ ఉంటే ఎందుకు సార్ ఊరుకోవడం ఒక్కసారి వేసుకొని నీకు సూట్ ఎలా ఉంటుందో వాళ్లకు చూపించు మైండ్ బ్లాక్ అయిపోవాలి అని యాదగిరి అంటాడు. ఆర్య షూట్ వేసుకొని వస్తాడు. ఆర్య ని చూసి యాదగిరి విజిల్ వేస్తాడు. అబ్బా ఏంటండీ ఆ సౌండ్ చెవులు పగిలిపోతున్నాయి జ్యోతి అంటుంది. ఇక్కడ కాదే అక్కడ చూడు అని యాదగిరి అంటాడు. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Krishna Mukunda Murari: బ్లాక్ కలర్ చీరలో కృష్ణ ముకుంద మురారి అత్త అందాలు.. 45 ఏళ్ల వయసులో కూడా ఇంత అందం ఎలా సాధ్యం..?

Saranya Koduri

Sivakarthikeyan: ముచ్చ‌ట‌గా మూడోసారి తండ్రి కాబోతున్న హీరో శివ కార్తికేయ‌న్‌.. వైర‌ల్‌గా మారిన వైఫ్ బేబీ బంప్ వీడియో!

kavya N

Balakrishna-Anjali: బాల‌య్య దురుసు ప్ర‌వ‌ర్త‌న‌పై అంజ‌లి షాకింగ్ రియాక్ష‌న్‌.. పెద్ద ట్విస్టే ఇచ్చిందిగా..!!

kavya N

Karthika Deepam 2 May 31th 2024: తన గానంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న దీప.. భర్త అంటే మీలా ఉండాలి అని శ్రీధర్ ను మెచ్చుకున్న కార్తీక్..!

Saranya Koduri

Family Stars promo: సుధీర్ ని బావ అని పిలిచిన అషూ రెడ్డి.. అత్త కోడళ్ళ మధ్య కోల్డ్ వార్..!

Saranya Koduri

Telugu OTT: ఈవారం ఓటీటీ తెలుగు ఫ్యాన్స్ కి పండగ… ఈ థ్రిల్లర్ సినిమాలను డోంట్ మిస్..!

Saranya Koduri

Kota Factory Season 3: కోట ఫ్యాక్టరీ 3 ఓటీటీ రిలీజ్ డేట్ తెలుసుకోవాలనుకుంటున్నారా?.. అయితే ఈ పజిల్ ని సాల్వ్ చేయండి..!

Saranya Koduri

Star Ma New Serial: స్టార్ మా లో మరో సరికొత్త సీరియల్.. ఎప్పటినుంచి ప్రారంభం అంటే..?

Saranya Koduri

Brahmamudi May 31 Episode 424: కావ్యను కొట్టిన ఇందిరాదేవి.. అపర్ణని అసహ్యించుకున్న అత్తగారు.. కావ్య మీద భారం వేసిన సుభాష్. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 31 Episode 638:అను ఆర్యాల బిడ్డ గురించి తప్పుగా మాట్లాడిన కుచల.. పద్మావతి తన కోడలని ఫిక్స్ అయిన సుగుణ.. యశోదర్ ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari May 31 Episode 484:మురారి మిస్సింగ్ కృష్ణ కి తెలియనుందా? ముకుంద, కృష్ణల సవాల్.. రేవతి ని ఓదార్చిన కృష్ణ.. రేపటి సూపర్ ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: పన్నెండు దేశాల్లో పుష్ప-2 ‘కపుల్’ సాంగ్ ట్రెండింగ్..!!

sekhar

Nayanthara: మేక‌ప్ అవ‌స‌ర‌మా.. నిన్నెవ‌రు చూస్తారంటూ న‌య‌న‌తార‌ను ముఖం మీదే అనేసిన ఎన్టీఆర్‌.. అస‌లేమైందంటే?

kavya N

Balakrishna: మ‌ద్యం బాటిల్ తో బాల‌య్య‌.. అస‌లు నిజం బ‌య‌ట‌పెట్టిన నిర్మాత నాగ వంశీ.. ఇంత‌కీ అంజలిని ఎందుకు తోశారంటే?

kavya N

Karthika Deepam 2 May 30th 2024: నరసింహ ని హోటల్ నుంచి తరిమికొట్టిన కడియం.. కార్తీక్ మాస్టర్ ప్లాన్ అదుర్స్..!

Saranya Koduri