NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

AP Elections 2024: జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ కేసులో కూటమికి హైకోర్టులో ఊరట లభించలేదు. జనసేనకు కేటాయించిన గాజు గ్లాస్ గుర్తును ఇతరులకు, స్వతంత్రులకు కేటాయించకుండా ఆదేశించాలని కోరుతూ టీడీపీ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది.

జనసేన పార్టీకే గాజు గ్లాస్ గుర్తును రిజర్వ్ చేయాలని కోరుతూ టీడీపీ నేత వర్ల రామయ్య ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఇతర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయిస్తే కూటమి నష్టపోతుందని తెలిపారు. ఈ దశలో ఉత్తర్వులు ఇవ్వడం ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడమేనని.. ఎలాంటి ఆదేశాలు జారీ చేయవద్దని ఈసీ తరపు న్యాయవాది వాదించారు.

గుర్తుల కేటాయింపు ప్రక్రియ ఏ దశలో ఉందో కనుక్కొని సాయంత్రం నాలుగు గంటలకు కోర్టుకు చెప్పాలని ఎలక్షన్ కమిషన్ న్యాయవాదికి హైకోర్టు ఆదేశించింది. నాలుగు గంటల పాటు వాయిదా వేసింది. తిరిగి విచారణ ప్రారంభం అయిన తర్వాత ప్రస్తుత పరిస్థితిని ఈసీ తరపు న్యాయవాది వివరించారు. ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైందని చెప్పారు. జనసేన పోటీ చేయని స్థానాల్లో స్వతంత్ర అభ్యర్ధులకు గుర్తులు కేటాయింపు జరిగిందని, ఈ దశలో ఇతర అభ్యర్ధులకు కేటాయించిన సింబల్ ను మార్చలేమని ఈసీ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు.

ఎలక్ట్రానిక్ బ్యాలెట్ ను ఇప్పటికే పంపిచామని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఇప్పటికే గుర్తుల కేటాయింపు ప్రక్రియ పూర్తి అవ్వడంతో సోమవారం విచారణలో ఉన్నత న్యాయస్థానం ఎలాంటి ఉత్తర్వులు ఇస్తుంది అన్నదానిపై సర్వత్రా ఉత్కంట నెలకొంది. చాలా నియోజకవర్గాల్లో వైసీపీ వర్గీయులే స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేసి గాజు గ్లాస్ గుర్తును ఎన్నికల గుర్తుగా తీసుకోవడంతో కూటమి నేతల్లో ఆందోళన నెలకొంది.

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

Related posts

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

sharma somaraju

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

sharma somaraju

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం సీరియస్ .. కీలక ఆదేశాలు జారీ

sharma somaraju

EC: పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ .. మరి కొందరిపై బదిలీ వేటు

sharma somaraju

AP Elections: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి వ్యక్తిగతంగా వివరణ ఇచ్చిన సీఎస్, డీజీపీ

sharma somaraju

CM YS Jagan: ఏపీ ఎన్నికల ఫలితాలు దేశంలోని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయన్న సీఎం జగన్

sharma somaraju

భారీ భద్రత మధ్య జేసీ ఫ్యామిలీ హైదరాబాద్ తరలింపు.. ఎందుకంటే..?

sharma somaraju

Tollywood Actor: ఇత‌నెవ‌రో గుర్తుప‌ట్టారా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వ‌చ్చి హీరోగా అద‌ర‌గొట్టి చివ‌ర‌కు ఇండ‌స్ట్రీలోనే లేకుండా పోయాడు!

kavya N

Sai Pallavi-Sreeleela: సాయి ప‌ల్ల‌వి – శ్రీ‌లీల మ‌ధ్య ఉన్న ఈ కామ‌న్ పాయింట్స్ ను గ‌మ‌నించారా..?

kavya N

Serial Actress Sireesha: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. భ‌ర్త‌తో విడిపోయిన‌ట్లు ప్ర‌క‌టించిన ప్ర‌ముఖ సీరియ‌ల్ న‌టి!

kavya N

Janhvi Kapoor: జాన్వీ మెడ‌లో మూడు ముళ్లు వేయాలంటే ఈ క్వాలిటీస్ క‌చ్చితంగా ఉండాల్సిందే అట‌!

kavya N

Janga Krishna Murty: వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు

sharma somaraju

Mrunal Thakur: ప్రియుడితో మృణాల్ ఠాకూర్ డిన్న‌ర్ డేట్‌.. అస‌లెవ‌రీ సిద్ధాంత్ చతుర్వేది..?

kavya N