NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

Mega Star Chiranjeevi: ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. గెలుపు కోసం పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటిగా ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఓటమి పాలైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సారి కూటమి అభ్యర్ధిగా పిఠాపురం బరిలో ఉన్నారు. పవన్ గెలుపునకు ఎన్డీఏ కూటమి, మెగా ఫ్యామిలీ కష్టపడుతుంటే .. పవన్ ను ఈ సారి కూడా ఓడించే లక్ష్యంతో వైసీపీ వ్యూహాలు అమలు చేస్తొంది.

ఈ క్రమంలో తమ్ముడు పవన్ కళ్యాణ్ గెలుపునకు అన్నయ్య చిరంజీవి రంగంలోకి దిగడంతో జనసైనికులు, పవన్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ ను గెలిపించాలంటూ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు చిరంజీవి. దాదాపు పదేళ్లుగా ఏ రాజకీయ పార్టీకి బహిరంగంగా మద్దతు తెలియజేయని చిరంజీవి తొలి సారిగా తన తమ్ముడిని గెలిపించాలంటూ పిఠాపురం ఓటర్లను కోరుతూ వీడియో విడుదల చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గొప్పతనాన్ని వీడియోలో వివరించారు చిరంజీవి.  అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టిన కళ్యాణ్ ది సేవ చేసే మనస్థత్వమని అన్నారు. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారని, కానీ పవన్ కళ్యాణ్ తన సొంత సంపాదనను కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టారన్నారు. సరిహద్దుల దగ్గర ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడే జవాన్ల కోసం పెద్ద మొత్తంలో సాయం చేయడంతో పాటు.. అనేక మందికి పవన్ కల్యాణ్ చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనానికి కావాల్సింది అనిపిస్తుందని తెలిపారు.

ఒక రకం గా చెప్పాలేంటే పవన్ సినిమాల్లోకి బలవంతంగా వచ్చాడని కానీ రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంగా వచ్చాడని చెప్పారు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండే తరుక్కుపోతుందని ఆలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధేస్తుందని అన్నారు. కొడుకు కోసం బాధపడుతున్న తన తల్లికి ఈ అన్నయ్య ఒక మాట చెప్పానని, నీ కొడుకు ఎంతో మంది తల్లుల కోసం, వాళ్ల బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్దమని తెలిపానన్నారు. ఇది మన భాధ కంటే ఎంతో గొప్పది అని తన తల్లికి చెప్పానని చిరంజీవి అన్నారు.

అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచి వాళ్లతోనే ప్రజాస్వామ్యానికి మరింత నష్టమని.. జనం కోసం జనసైనికుడు అయ్యాడని అన్నారు. బలంగా తాను నమ్మిన సిద్దాంతం కోసం జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసిన శక్తిశీలి పవన్ అని కీర్తించారు. ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలంటే చట్టసభల్లో ఆయన గొంతు ఉండాలన్నారు. జనమే జయం అని నమ్మే జనసేనాని ఏమి చేయగలరో చూడాలంటే పిఠాపురం ప్రజలు కళ్యాణ్ ను గెలిపించాలన్నారు. మీకు సేవకుడిగా సైనికుడిగా అండగా నిలబడతాడని, మీ కోసం అవసరమైతే కనలబడతాడని, మీకల నిజం చేస్తాడని చిరంజీవి తెలిపారు. గాజు గ్లాసు గుర్తుకు మీ ఓటు వేసి పవన్ ను గెలిపించాలని పిఠాపురం ప్రజలను చిరంజీవి కోరారు.

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

Related posts

YSRCP: ఆ నిబంధనలు ఈసీ ఉపసంహరించుకోవాలి: వైసీపీ

sharma somaraju

Chiranjeevi: చిరంజీవి ప‌క్క‌న‌ హీరోయిన్‌గా, చెల్లెలుగా న‌టించిన ముగ్గురు హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Praja Bhavan: ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు

sharma somaraju

Fahadh Faasil: పుష్ప విల‌న్ కు అరుదైన వ్యాధి.. ఇక దానికి చికిత్సే లేదా..?

kavya N

Varsham: ప్ర‌భాస్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌ర్షం సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

Namitha: పెళ్లైన ఏడేళ్ల‌కే భ‌ర్త‌తో న‌మిత విడాకులు.. ఓపెన్ అయిపోయిన‌ హీరోయిన్‌!

kavya N

Ravi Teja: ఓటీటీలో స‌రికొత్త రికార్డు సృష్టించిన ర‌వితేజ ఫ్లాప్ మూవీ.. ఇండియా హిస్ట‌రీలోనే తొలిసారి ఇలా..!!

kavya N

AP High Court: ఏపీ హైకోర్టులో పిన్నెల్లికి ఊరట..షరతులతో మధ్యంతర బెయిల్ మంజూరు

sharma somaraju

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం .. సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్

sharma somaraju

Kajal Aggarwal-Payal Rajput: కాజ‌ల్ అగ‌ర్వాల్ తో పోటీకి సై అంటున్న‌ పాయ‌ల్‌.. పెద్ద రిస్కే ఇది..!

kavya N

NTR: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు

sharma somaraju

Indigo Flight: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు ..అత్యవసర ద్వారం ద్వారా ప్రయాణీకుల దించివేత

sharma somaraju

వైవీ. సుబ్బారెడ్డి VS బొత్స‌.. ఇలా జ‌రిగితే పేద్ద ర‌చ్చ రంబోలానే..?

‘ పిన్నెల్లి ‘ ఎపిసోడ్ వైసీపీకి ఎంత దెబ్బ కొట్టిందంటే…?

బాబుకు-జ‌గ‌న్‌, జ‌గ‌న్‌కు-ష‌ర్మిల మామూలు దెబ్బ కొట్ట‌లేదుగా…?