NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఏలూరు ఎంపీ బ‌రిలో ‘ త‌ప‌న చౌద‌రి ‘ .. ఇంత‌కీ ఎవ‌రు..!

రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఖరారైంది. పోటీ చేయబోయే సీట్ల స్థానాలపైనా దాదాపు స్పష్టత వచ్చింది. ఈ క్రమంలోనే బీజేపీ నుంచి ఏలూరు పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఈ స్థానానికి బీజేపీ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న గారపాటి సీతారామాంజనేయ చౌదరి(తపన) సిద్ధపడుతున్నారు. ఈ స్థానం ఆయనకు దాదాపు ఖరారైనట్టు చెబుతున్నారు. బీజేపీలో సీనియర్‌ నేతగా ఉన్న సుజనా చౌదరి ఇక్కడి నుంచి పోటీ చేయాలని భావించారు.

అయితే, అనూహ్యంగా తపన చౌదరికి ఈ సీటు దాదాపు ఖరారు అయినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నా యి. బీజేపీలో ఎంతో మంది సీనియర్‌ నేతలు, మాజీ ఎంపీలు ఉన్నప్పటికీ అనూహ్యంగా తపన చౌదరి వైపు పార్టీ మొగ్గుచూపతుండడం చర్చనీయాంశంగా మారింది. అసలు ఎవరీ తపన చౌదరి అన్న చర్చ సర్వత్రా సాగుతోంది. గడిచిన 15 ఏళ్లుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలు పరిధిలో తపన చారిటబుల్‌ ట్రస్ట్‌ పేరుతో గారపాటి సీతారామాంజనేయ చౌదరి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

నిరుపేదలకు ఆర్థిక సహాయం, చిన్నారులకు విద్యా పరమైన సహకారం, ఇతర సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆయన ముందుకు సాగుతున్నారు. బీజేపీలోనూ ఆయన గత కొన్నాళ్లుగా యాక్టివ్‌గా పని చేస్తు న్నారు. ఆర్థికంగా, సామాజికంగా బలమైన నేత కావడంతో ప్రజల్లోనూ ఆయనకు పలుకబడి ఉంది. మిగిలి న నేతలతో పోలిస్తే పెద్ద సంఖ్యలో అనుచర గణం ఉండడం కూడా తపన చౌదరిని రానున్న ఎన్నికల్లో ఏలూరు పార్లమెంట్‌ స్థానం నుంచి బరిలోకి దించాలని అధిష్టానం యోచిస్తున్నట్టు చెబుతున్నారు.

ఇదే సీటును మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఆశించి తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు సాగించారు. అయి నా ఆయన్ను కాదని.. తపన చౌదరి వైపు బీజేపీ అధిష్టానం మొగ్గు చూపిందంటే ఆయన ఏ స్థాయిలో పార్టీ లో సత్సంబంధాలు కలిగి ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఏలూరు పార్లమెంట్‌ స్థానం పరిధిలోని ఏడు నియోజవర్గాల్లో ఆయన గత కొన్నాళ్లు నుంచి జోరుగా తిరుగుతున్నారు. ఆయా నియోకజవర్గాల్లో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు.

ఒకవైపు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూనే.. మరోవైపు తపన సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలను సాగిస్తూ ప్రజల దృష్టిని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్థిక, అంగ బలం కలిగిన నేతగా, అంతకుమించి బీజేపీకి విధేయుడిగా ఉన్న గారపాటి వైపు బీజేపీ మొగ్గు చూపుతున్నట్టు చెబుతున్నారు.

Related posts

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju