Prabhas: పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిపోయిన తర్వాత ప్రభాస్ సరసన నటించడానికి అనేక మంది టాప్ హీరోయిన్లు ఎదురుచూస్తూ ఉన్నారు. ఇటువంటి తరుణంలో ప్రభాస్ ప్రస్తుతం “కేజిఎఫ్” డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక పక్క “రాధేశ్యాం” సినిమా షూటింగ్ చేస్తూనే మరో పక్క “సలార్” సినిమా ప్రభాస్ స్టార్ట్ చేయడం జరిగింది.
పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. ప్రభాస్ ని ఈ సినిమాలో ఇంటర్నేషనల్ డాన్ పాత్రలో మాఫియా బ్యాక్ డ్రాప్ లో డైరెక్టర్ ప్రశాంత్ నిల్ చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు కోసం ప్రత్యేకంగా ప్రభాస్… డిఫరెంట్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం జరిగిందట.
Read more: Prabhas : ప్రభాస్తో పోటీకొచ్చిన అక్షయ్ కుమార్..ఆ క్రేజీ ఫ్రాంఛైజీలో ఛాన్స్ ఎవరికీ..?
ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ పాత్ర చేస్తున్న శృతిహాసన్ కూడా మార్షల్ ఆర్ట్స్ ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు కోసం ప్రత్యేకంగా ఇటీవల నేర్చుకోవడం జరిగిందట. ఇంటర్నేషనల్ మాఫియా తరహాలో ఈ సినిమా ఉంటుందని ప్రభాస్ పక్కనే శృతి హాసన్ పాత్ర హై వోల్టేజ్ యాక్షన్ పాత్ర అని మేకర్స్ అంటున్నారు. సరిగ్గా బిల్లా సినిమాలో ప్రభాస్ పక్కన అనుష్క చేసిన పాత్ర మాదిరిగా ఈ సినిమాలో శృతి హాసన్ క్యారెక్టర్ ఉంటుందని ఫిలిం నగర్ టాక్. సినిమా లో గతంలో ఎన్నడూ చూడని రీతిలో ప్రభాస్ ని చాలా డిఫరెంట్ మాఫియా డాన్ పాత్రలో ప్రశాంత్ నీల్ చూపిస్తున్నారట. ఖచ్చితంగా ఈ సినిమా మరో “బాహుబలి” రేంజ్ విజయం సాధిస్తుందని మేకర్స్ అంటున్నారు.