Prabhas : ప్రభాస్‌తో పోటీకొచ్చిన అక్షయ్ కుమార్..ఆ క్రేజీ ఫ్రాంఛైజీలో ఛాన్స్ ఎవరికీ..?

Share

Prabhas : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ రేంజ్ ఇప్పుడు ఏ సినిమా చేసినా పాన్ ఇండియన్ సినిమాగా రూపొందుతున్నవే. ఆయన కోసం బాలీవుడ్ ఇండస్ట్రీ సినిమాలను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో హిందీలో స్ట్రైట్ సినిమా ఆదిపురుష్ చేస్తున్నాడు. ఇప్పటికే రాధే శ్యామ్ రిలీజ్ చేసే సన్నాహాలు ప్రారంభించారు. ఉన్న వారం రోజుల పాటు ఉన్న షూటింగ్ పూర్తి చేశాక పరిస్థితులు అనుకూలిస్తే జూలై 30న భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఇక 2022 లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సలార్ రానుంది.

Akshay kumar competes with prabhas
Akshay kumar competes with prabhas

అలాగే నాలుగైదు నెలల గ్యాప్‌లో బాలీవుడ్ సినిమా ఆదిపురుష్ తీసుకురానున్నారు. ఈ రెండు పూర్తయితే నాగ్ అశ్విన్ సినిమా మొదలు పెట్టనున్నాడు ప్రభాస్. అయితే ఎప్పుడైతే ఆదిపురుష్ కమిటయ్యాడో బాలీవుడ్ నిర్మాతలు ఆయన హీరోగా సినిమా చేయడానికి రెడీ అయ్యారు. అందులో ముఖ్యంగా బ్లాక్ బస్టర్ ప్రాంచైజీ ‘ధూమ్’ సిరీస్ లోని 4వ భాగం. ధూమ్-1, ధూమ్-2, ధూమ్ -3 వరకూ ప్రతీ భాగంలో మేకింగ్ లో హాలీవుడ్ సినిమాను మించిన అద్భుతాల్ని చూపించారు. మొదటి భాగంలో జాన్ అబ్రహాం విలన్ రోల్ లో నటించాడు.

Prabhas : ప్రభాస్ ధూమ్-4 ఎంతకీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు.

రెండవ భాగంలో హృతిక్ రోషన్ విలన్ గా నటించాడు. ఇక మూడవ భాగంలో అమీర్ ఖాన్ డ్యూయల్ రోల్ లో నటించి ధూమ్ ప్రాంచైజీ భారీ హిట్ సాధించేలా చేశారు. యాక్షన్ అడ్వెంచర్ గా రూపొందిన ధూమ్ 3 భాగాలు వరల్డ్ వైడ్ గా సెన్షేషనల్ హిట్ గా నిలిచాయి. అయితే ఈ ఫ్రాంఛైజీలో 4వ భాగాన్ని ప్రభాస్ విలన్ రోల్‌కి ఒప్పుకుంటే చేసేందుకు మేకర్స్ రెడీగా ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగాను అభిమానులు ఇదే కోరుకుంటున్నారు. కానీ ప్రభాస్ ఎంతకీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. దాంతో ఇప్పుడు అక్షయ్ కుమార్ పేరు పరిశీలనలోకి వచ్చింది. ఆయనకి వరుసగా బ్లాక్ బస్టర్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆయనకున్న క్రేజ్ కారణంగా అక్షయ్ కుమార్ ని తీసుకోవాలని చూస్తున్నారట.


Share

Related posts

Anasuya : మహా సముద్రంలో అనసూయ..మరో స్పెషల్ నంబర్ తో సర్‌ప్రైజ్ ..!

GRK

శశికళ కు కరోనా పాజిటివ్..!!

sekhar

Nimmagadda – జగన్ పై పోరాటానికి ఢిల్లీ పెద్దలను కలవనున్న నిమ్మగడ్డ..!

Muraliak